E-Paper
Advertisement

ఆగస్టు 9న ‘దూకుడు’ రీ-రిలీజ్.. మళ్లీ బాక్సాఫీస్ షేక్ అవుతుందా?

ఆగస్టు 9న ‘దూకుడు’ రీ-రిలీజ్.. మళ్లీ బాక్సాఫీస్ షేక్ అవుతుందా?
Advertisement

Dookudu ReRelease: పెద్ద హీరోలు రెండేళ్ళకి గాని ఒక్క సినిమా వదల్లేకపోవడంతో డిస్టిబ్యూటర్స్ కాస్తా రిలీజ్ అయిన సినిమాలనే రీరిలీజ్ చేసుకునే పరిస్థితి.ఇక ఈ సినిమాలు కూడా మళ్ళీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుపిస్తుండటంతో పోలో మంటూ ప్రతీ సినిమా రీరిలీజ్ బాట పట్టేశాయి అయితే ప్యాన్స్ డిమాండ్ కారణంగానో లేక మరిన్ని డబ్బులు  రాబట్టాలనే ఉద్దేశంతోనో తెలీదు కాని కొన్ని బడా సినిమాలు రీ రీ  రిలీజ్ కూడా అయ్యాయి. అయితే వాటికి మించి అన్నట్టుగా ఈ ఆగస్ట్ 9న మహష్ బాబు బర్త్ డే సందర్భంగా ఏకంగా  నాలుగో సారి అంటే రీ రీ రీ  రిలీజ్ కి సిద్దమైంది దూకుడు.

డీ,దుభాయ్ శ్రీను, రెడీ ,కింగ్ వంటి వరుస సూపర్ హిట్ సినిమాలతో లైమ్ లైట్ లో ఉన్న శ్రీను వైట్ల, అతిథి, ఖలేజా ల వంటి వరుస ప్లాపులని చూస్తున్న మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన సినిమా కావడం విశేషం.ఇక 2011 సెప్టెంబర్ 23న  రిలీజ్ న ఈ సినిమా నటుడిగా మహేష్ ని మరో లెవెల్ కి తీసికెళ్ళింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ సినిమా అప్పటి బాక్సాఫీస్ రికార్డులని మడతెట్టేసింది. ఈ సినిమాలో  శ్రీను వైట్ల కామెడీ మార్క్ స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు మెయిన్ ఎసెట్ అని చెప్పాలి.

Advertisement

రెండు వేరియేషన్స్ లో అదరగొట్టిన మహేష్ 

ఇక పోలీస్ ఆఫీసర్ గా,పొలిటికల్ లీడర్ గా మహేష్ బాబు చూపించిన వేరియేషన్స్, యాక్షన్ సీన్స్ థియేటర్లలో ఈలలు వేయిస్తే సమంత బబ్లీ యాక్టింగ్ తో యూత్ ని మెస్మరైజ్ చేసింది.ముఖ్యంగా కోమాలో ఉన్న తండ్రి కోసం నడిపించే డ్రామా, బ్రహ్మానందంతో వచ్చే ‘పద్మశ్రీ’ కామెడీ ట్రాక్ ఎంత పెద్ద హిట్టో చెప్పక్కర్లేదు….ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపించే సగం మీమ్స్‌ ఈ సినిమా నుండే పుట్టాయంటే ఆశ్చర్యం లేదు.అలా  సినిమాని మహేష్,సమంత నిలబెడితే వారికి తమ వంతు సాయం చేస్తూ ప్రకాశ్ రాజ్, సోను సూద్, బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, వెన్నెల కిషోర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యంలు ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు.

Advertisement

also read :ఒడిశా అమ్మాయి సంచలనం.. ఇండియన్ ఐడల్ 16 విన్నర్‌గా జ్యోతిర్మయి నాయక్!

ఇక వీరికి తోడు గుహన్ సినిమాటోగ్రఫీ, తమన్ సంగీతం సినిమాని మరింత ఎత్తులో నిలబెట్టాయి. ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు బాణీలు కట్టిన “గురు”,”పూవై పూవై”,”దేత్తడి” వంటి పాటలు ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ప్లే లిస్టు లో తరచుగా వినిపిస్తూనే ఉంటాయి.

అందులో అడుగుపెట్టిన తొలి తెలుగు సినిమా

ఇక కలెక్షన్స్ పరంగా చూస్తే ఆ రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ .100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సౌత్ ఇండియాలోనే సరికొత్త రికార్డు సృష్టించిందంటే మహేష్ స్టామినా ఏంటో అర్థం అవుతుంది. అంతేకాదండోయ్..అమెరికాలో 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో అడుగుపెట్టిన తొలి తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలవడం విశేషం.

ఒక రకంగా ఈ దూకుడు ఇచ్చిన ఊపు తోనే  మహేష్  కెరీర్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిందని చెప్పాలి.ఆ తర్వాత వచ్చిన బిజినెస్‌మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి,  లాంటి సాలిడ్ హిట్స్ కి  ఈ సినిమానే స్రాంగ్ బేస్ అనడంలో ఆశ్చర్యం లేదు.

 వసూళ్ళలో ఎలాంటి దూకుడుని చూపిస్తుందో

ఇక ఎన్నో నంది, ఫిల్మ్‌ఫేర్, సైమా అవార్డులను సొంతం చేసుకున్నఈ ఆల్ టైమ్ క్లాసిక్ సినిమా, ఇప్పుడు 4K క్వాలిటీతో,కొత్త సౌండ్ ఎఫెక్ట్స్‌తో మన ముందుకు వస్తోంది.చూస్తుంటే ఆగస్టు 9న థియేటర్లలో మళ్లీ ఆనాటి మ్యాజిక్ రిపీట్ అవ్వడం ఖాయంగానే కనిపిస్తుంది.ఏది ఏమైనా వింటేజ్ మహేష్ బాబును స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయాలనుకునే ఫ్యాన్స్‌కి ఇది పూనకాలు తెప్పించే వార్తే అని చెప్పకతప్పదు.

ఇప్పటికే పోకిరి, ఒక్కడు, బిజినెస్‌మ్యాన్, మురారి వంటి సినిమాలు బాబు బర్త్డే లకి వచ్చిన కోట్లని కొల్లగొట్టాయి.మరి నాలుగో సారి రిలీజ్  అవుతున్న ఈ దూకుడు వసూళ్ళలో ఎలాంటి దూకుడుని చూపిస్తుందో ఈ ఆగస్ట్ 9న తేలిపోనుంది .

also read :ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్….రూ.2000 కోట్ల రికార్డు కొట్టేది ఈ హీరోనేనా?

Related News

5 కోట్ల మూవీకి 26 కోట్లు ఖర్చు.. మహేంద్రగిరి వారాహి మూవీ బడ్జెట్ పై నిర్మాత రియాక్షన్?

ఒడిశా అమ్మాయి సంచలనం.. ఇండియన్ ఐడల్ 16 విన్నర్‌గా జ్యోతిర్మయి నాయక్!

హీరోయిన్స్ కి డ్రీమ్ రోల్ పడాలంటే వారి వల్లే సాధ్యం.. మాళవిక బోల్డ్ కామెంట్స్!

ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్….రూ.2000 కోట్ల రికార్డు కొట్టేది ఈ హీరోనేనా?

రామాయణ కోసం సాయి పల్లవి రెమ్యూనరేషన్?

ఆదర్శకుటుంబం.. వెంకీ మామ ఎంట్రీ సీన్ రిలీజ్, ఏకిపారేస్తున్న నెటిజన్స్

ఎన్టీఆర్ మూవీలోకి మరో స్టార్ నటుడు ఎంట్రీ.. ఏ పాత్రలో అంటే!

Big Stories

Advertisement
×