E-Paper
Advertisement

లండ‌న్ కు గుడ్ బై…మ‌ళ్లీ ముంబైకి షిఫ్ట్ అవుతోన్న కోహ్లీ, అనుష్క శ‌ర్మ‌?

లండ‌న్ కు గుడ్ బై…మ‌ళ్లీ ముంబైకి షిఫ్ట్ అవుతోన్న కోహ్లీ, అనుష్క శ‌ర్మ‌?
Advertisement

Virat Kohli To Move Back To Mumbai:  టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli ), అనుష్క శర్మ ( Anushka Sharma) దంపతులు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు లండ‌న్ లో జీవనం కొనసాగిస్తున్న ఈ ఇద్దరు… మళ్లీ ఇండియాకు రిటర్న్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ముంబైలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్ ( luxury apartment in Versova) కూడా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు కొనుగోలు చేశారు. దాదాపు రూ.18.29 కోట్లు ఖర్చు చేసి ఈ అపార్ట్మెంట్ కొనుగోలు చేయడం జరిగింది. ఈ క్రమంలో లండన్ నుంచి.. విరాట్ కోహ్లీ దంపతులు ఇండియాకు షిఫ్టు అవుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇకపై లండన్ లో ఉండకుండా.. ఇండియాలోనే ఉండాలని డిసైడ్ అయ్యార‌ని కోహ్లీ స‌న్నిహితులు కూడా చెబుతున్నారు. అందుకే ఖరీదైన అపార్ట్మెంట్ తీసుకొని.. ముంబైలోని సెటిల్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Also Read : Robin Uthappa On Babar Azam:  బాబర్ ఆజం వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్‌..కానీ అత‌న్ని పాక్ ప్లేయ‌ర్లే తొక్కేస్తున్నారు

Advertisement

లండన్ లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు ఇద్దరూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. లండన్ లోనే ఉంటున్న ఈ ఇద్దరు ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో ఏకంగా రూ. 18.29 కోట్లు పెట్టి లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. ఇందులో భాగంగానే ఈనెల 21వ తేదీన రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. ఈ అపార్ట్మెంట్ కార్పెట్ ఏరియా 2644 చదరపు అడుగులు ఉంటుంది.

దీంతో పాటు 316 చదరపు అడుగుల ప్రత్యేక ఏరియా, మూడు కార్లు పార్కింగ్ చేసుకునేలా స్లాట్లు కూడా ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకే కోటి రూపాయలు ఖర్చు చేశాడు విరాట్ కోహ్లీ. గోద్రెజ్ స్కై షోర్ ప్రాజెక్టు వాళ్లు ఈ అపార్ట్మెంట్ నిర్మించారు. ముంబైలో ఫేమస్ అయిన వీళ్లను విరాట్ కోహ్లీ దంపతులు స్వయంగా కలిసి.. అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. ఈ క్రమంలో లండన్ ను వదిలేసి… ముంబై కి షిఫ్ట్ అవుతారని విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ దంపతులపై ప్రచారం జోరుగా సాగుతోంది.

లండన్ లో ఉంటున్న విరాట్ కోహ్లీ పై విమర్శలు

Advertisement

గత కొన్ని రోజులుగా లండన్ లో ఉంటున్న విరాట్ కోహ్లీ దంపతులపై సోషల్ మీడియాలో అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇండియాన్ కాదని.. లండన్ లో ఉండడం ఏంటని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. ఇండియా ద్వారా పాపులర్ అయిన విరాట్ కోహ్లీ.. లండన్ లో ఆస్తులు కొని, అక్కడే ఉండడం దేశద్రోహం కిందకు వస్తుందని ఫైర్ అవుతున్నారు. అయితే ఈ విమర్శలకు కూడా చెక్ పెట్టేందుకు… యూటర్న్ తీసుకున్నాడట కోహ్లీ. ఈ మేరకు న్యూస్ వైరల్ అవుతోంది.

Also Read : టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

 

Related News

యశస్వి జైస్వాల్ ఇంత పెద్ద‌ కామాంధుడా? 9 ఏళ్లు పెద్ద‌దైన హీరోయిన్ తో డేటింగ్

బీహారీ ప్లేయ‌ర్లు అంటూ అవ‌మానించారు..ఇప్పుడు టీమిండియాకు మేమే దిక్క‌య్యాం

సంజు కంటే అభిషేక్ శ‌ర్మ పెద్ద‌ పోటుగాడా? అంద‌రికీ ఒకే రూల్స్ ఉండాలి

పసికూన‌ జింబాబ్వే పైన గెలవడం కాదు…మ‌గాళ్లు అయితే మాపై గెల‌వండి!

పాకిస్తాన్ ఘోర అవ‌మానం…ఏ ఒక్క కామెంటేటర్ ను పిల‌వ‌ని వెస్టిండీస్‌

వైభ‌వ్ సెంచ‌రీ మిస్…టీమిండియా చేతిలో జింబాబ్వే వైట్ వాష్

Video: వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట పడ్డ బంతి

Big Stories

Advertisement
×