E-Paper
Advertisement

రెంటల్ సిస్టమ్ VS పర్సంటేజ్ షేరింగ్.. కొండాపూర్ భేటీలో ఎగ్జిబిటర్ల వార్నింగ్.. టాలీవుడ్‌లో కొత్త రగడ!

రెంటల్ సిస్టమ్ VS పర్సంటేజ్ షేరింగ్.. కొండాపూర్ భేటీలో ఎగ్జిబిటర్ల వార్నింగ్.. టాలీవుడ్‌లో కొత్త రగడ!
Advertisement

Tollywood Exhibitors Demand: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక్కటే డిస్కషన్. అదే రెంటల్ సిస్టమ్ VS పర్సంటేజ్ షేరింగ్.సినిమాలు అంతంత మాత్రమే ఆడుతుండటంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు నడపడమే కష్టమైపోయింది. దీంతో గత కొంతకాలంగా మాకూ పర్సంటేజ్ కావాలంటూ గొంతెత్తిన తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తాజాగా కొండాపూర్‌లోకీలక సమావేశం ఏర్పాటు చేసింది.ఇందులో చదలవాడ శ్రీనివాసరావు, శిరీష్, సునీల్ నారంగ్, శ్రీధర్, అనుపమ్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, బాలగోవింద్ వంటి ఇండస్ట్రీ ప్రముఖులు హాజరైన ఈ సమావేశంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడపై ప్రధానంగా చర్చించారు. ప్రధానంగా ప్రస్తుతం ఉన్న ‘రెంట్’ (అద్దె) సిస్టమ్ ని  పూర్తిగా పక్కన పెట్టి, ‘పర్సంటేజ్ షేరింగ్’ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఎగ్జిబిటర్లు అంతా కలిసి నిర్ణయించారు. ఇన్నేళ్లుగా థియేటర్లకి రెంట్లు కట్టలేక అవస్థలు పడుతుండటంతో ఎగ్జిబిషన్ సిస్టం ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ కొత్త రెవెన్యూ మోడల్‌ను తెరపైకి తెచ్చారు.

లాభమైనా, నష్టమైనా సమానం ఉండాల్సిందే

Advertisement

మాములుగా ఒక సినిమా రిలీజ్ అయితే థియేటర్ ఓనర్స్ ప్రొడ్యూసర్స్ లేదా డిస్ట్రిబ్యూటర్లకు ఒక ఫిక్స్డ్ రెంట్ పే చేయాలి. దీంతో సినిమాకి జనాలు వచ్చినా రాకున్నా ఈ రెంట్ భారం థియేటర్ల మీద పడుతోంది. అందుకే, ఇకపై లాభమైనా, నష్టమైనా సమానం ఉండాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. అంటే ఎంత వసూలైతే అందులో ముందే అనుకున్న పర్సెంటేజ్ ప్రకారం ఇద్దరు పంచుకోవాలన్న మాట.చిన్న సినిమాల సంగతి ఎలా ఉన్నా ఆర్గుమెంట్ అంతా పెద్ద సినిమాల గురించే.. ఏడాదిలో దాదాపు 40 వారాల పాటు చిన్న సినిమాలకు పర్సంటేజ్ పద్ధతిని అమలు చేస్తున్నారు. కానీ, అసలు లాభాలు వచ్చే పెద్ద సినిమాల సమయానికి వచ్చేసరికి (సుమారు 10 వారాలు) మళ్లీ పాత రెంట్ పద్ధతిని తెరపైకి తెస్తున్నారు. దీనివల్ల థియేటర్లకు వచ్చే లాభం కంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ‘పుష్ప’ వంటి భారీ చిత్రాలకు ఇతర రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్లకు కూడా పర్సంటేజ్ షేరింగ్ ఇస్తున్నప్పుడు, మన తెలంగాణలో ఎందుకు ఇవ్వరనేది అసోసియేషన్ వేస్తున్న సూటి ప్రశ్న.

ALSO READ :CM విజయ్ ‘మాస్’ డెసిషన్.. 717 వైన్ షాపులు ఖాళీ..హీరో విశాల్ రియాక్షన్ వైరల్!

Advertisement

ఒకే చట్టం ఉండాలన్నది ఎగ్జిబిటర్ల డిమాండ్

మల్టీప్లెక్స్‌లకు ఒక రూల్, సింగిల్ స్క్రీన్‌లకు మరో రూల్ ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల్టీప్లెక్స్‌లు ఇప్పటికే పర్సంటేజ్ సిస్టమ్‌తో సేఫ్ జోన్‌లో ఉంటే, సామాన్యులకు వినోదాన్ని పంచే సింగిల్ స్క్రీన్లు మాత్రం అద్దెల భారంతో డీలా పడిపోతున్నాయ్ .అందుకే ఈ డిఫరెన్స్ లేకుండా అందరికి ఒకే చట్టం ఉండాలన్నది ఎగ్జిబిటర్ల డిమాండ్ . మరోవైపు సినిమాల ‘రన్-టైమ్’ తగ్గిపోవడం సింగిల్ స్క్రీన్ల పాలిట శాపంగా మారిందనే చెప్పాలి. ఒకప్పుడు ‘F2’ లాంటి సినిమాలు 8 వారాల పాటు థియేటర్లలో సందడి చేసేవి. కానీ ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, భారీ అంచనాలతో వచ్చిన ‘ధురంధర్’ వంటి సినిమాలు కూడా కేవలం 2-3 వారాల్లోనే థియేటర్ల నుంచి ఎగ్జిట్ ఇస్తున్నాయి. ఆడియన్స్ తక్కువ టైమ్ లోనే ఎక్కువ థియేటర్లలో సినిమా చూసేయడం,దాంతో పాటు ఓటీటీలలో చాలా త్వరగా స్ట్రీమింగ్ అవుతుండటంతో థియేటర్ల వైపు జనాలు చూడని పరిస్థితి. ఇలా సినిమాలు ఆడని పరిస్థితుల్లో కూడా థియేటర్స్ కి రెంట్స్ కట్టడం సాధ్యం కాదని, అందుకే వసూళ్లలో వాటా ఇచ్చే పద్ధతి అయితేనే నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు ఇద్దరికీ అనువుగా ఉంటుందంటూ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయించింది.

సరిసమానంగా పంచుకోవడమే చిత్ర పరిశ్రమకు శ్రీరామరక్ష

చివరగా, లాభనష్టాలను నిర్మాత మరియు థియేటర్ యజమాని సరిసమానంగా పంచుకోవడమే చిత్ర పరిశ్రమకు శ్రీరామరక్ష అని అసోసియేషన్ స్పష్టం చేసింది. సినిమా బాగుంటే ఇద్దరూ లాభపడాలి, ఫలితం తేడా కొడితే రిస్క్ కూడా ఇద్దరూ షేర్ చేసుకోవాలి. కేవలం అద్దెల రూపంలో థియేటర్లను నష్టాల్లోకి నెట్టడం సరికాదని సమావేశం తీర్మానించింది.ఇక ఈ భేటీలో తీసుకున్న సమిష్టి నిర్ణయం ఎగ్జిబిషన్ వ్యవస్థలో సరికొత్త మార్పులు తెస్తుందని, దీనిపై టాలీవుడ్ పెద్దలు సానుకూలంగా స్పందిస్తారని ఎగ్జిబిటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

చూడాలి మరి కొండాపూర్ వేదికగా తీసుకున్న ఈ నిర్ణయాలు ఎలా ఆచరణలోకి వస్తాయో!

ALSO READ :ఫోన్ లో చూసే సినిమాకు 500 టికెట్ ఎందుకు.. టాలీవుడ్ మేకర్స్ పై రాహుల్ రామకృష్ణ సెటైర్స్

 

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×