E-Paper
Advertisement

ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో ముదిరిన వివాదం.. ప్రెసిడెంట్‌కే తెలియకుండా సంతకాలు.. అసలేం జరుగుతోంది?

ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో ముదిరిన వివాదం.. ప్రెసిడెంట్‌కే తెలియకుండా సంతకాలు.. అసలేం జరుగుతోంది?
Advertisement

Telugu Film Producers Council: ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్’..దీనికి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.కానీ దీన్నుండి వచ్చే అఫీషియల్ ప్రెస్ నోట్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌కు కూడా తెలీకపోవడమే ఇక్కడ ఆశ్చర్యం. దీంతో అసలు కౌన్సిల్‌లో ఏం జరుగుతోంది? ప్రెసిడెంట్‌కు తెలీకుండానే నిర్ణయాలు జరిగిపోతున్నాయా అనే ప్రశ్నలు ఇండస్ట్రీ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

అసలేం జరిగింది?

Advertisement

విషయంలోకి వెళ్తే …నిన్నఅంటే మే 11, 2026 కౌన్సిల్ పేరుతో ఒక ప్రెస్ నోట్ విడుదలైంది. అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి మరియు నందమురి బాలకృష్ణకి ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు కురిపించారు. APFDCలో నియామకాలకు సంబంధించి కౌన్సిల్ ప్రెసిడెంట్‌ హర్షం వ్యక్తం చేస్తూ ఈ లెటర్ వచ్చినట్టుగా సంతకాలని బట్టి అర్థమయింది.అంటే నిజంగానే కౌన్సిల్ ప్రెసిడెంట్‌ సమ్మతంతో వచ్చిందని అనుకుంటున్నారా..అయితే మీరు తప్పులో కాలేసినట్టే.ఎందుకంటే ఈ డాక్యుమెంట్‌పై ఇద్దరు సెక్రటరీలు మరియు ప్రెసిడెంట్ సంతకాలు ఉన్నట్లు చూపిస్తున్నా.. ప్రెసిడెంట్ మాత్రం తాను ఆ లేఖపై సంతకం చేయలేదని కుండబద్ధలు కొట్టడమే ఇక్కడ అసలు ట్విస్ట్.

తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండా కౌన్సిల్ పేరుతో ఒక అధికారిక ప్రకటన వెలువడటంపై ప్రెసిడెంట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “అసలు అధికారిక జీవో (GO) విడుదల కాకుండా, కౌన్సిల్ లేదా చాంబర్ ఇటువంటి లేఖలను విడుదల చేసే సంప్రదాయం లేదు. కానీ ఇక్కడ అన్ని నియమాలను తుంగలో తొక్కారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం పొరపాటు కాదు, పరిపాలనలో జరుగుతున్న తీవ్రమైన నిర్లక్ష్యం అని ఆయన వాపోయారు.

Advertisement

also read :ముంబైలో ‘పెద్ది’ జాతర.. మే 18న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్రైలర్ బ్లాస్ట్!

ఇండస్ట్రీ బాగు కోసం పని చేయాల్సిన సంస్థలో

ఇక ఇదే ఇష్యూ పై ప్రెసిడెంట్ ఈ ఉదయం GM కృష్ణను వివరణ కోరగా.. “సెక్రటరీలే ఈ నిర్ణయం తీసుకున్నారు” అని సమాధానం రావడం కౌన్సిల్ లో హాట్ టాపిక్ అయింది. విచిత్రం ఏమిటంటే, నిన్న ఉదయం 11:30 నుండి సాయంత్రం 4:40 వరకు ప్రెసిడెంట్ చాంబర్‌లోనే ఉన్నారు. ప్రసన్న కుమార్, రామ్ సత్యనారాయణ, సురేందర్ రెడ్డి వంటి ప్రముఖులు ఆయన వద్ద గంటకు పైగా గడిపినా, కనీసం మాట వరసకైనా ఈ ప్రెస్ నోట్ గురించి చెప్పకపోవడం గమనార్హం.

కౌన్సిల్‌లో ప్రెసిడెంట్‌ను బైపాస్ చేసి నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఉన్న మతలబు ఏంటి? ఇండస్ట్రీ బాగు కోసం పని చేయాల్సిన సంస్థలో ఇలాంటి ‘సంతకాల వివాదం’ రావడం ఇండస్ట్రీ పరువును బజారున పడేస్తోందన్న కామెంట్స్ ఇపుడు గట్టిగానే వినిపిస్తున్నాయి.

ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో

అసలు ప్రెసిడెంట్ అనుమతి లేకుండా లెటర్ హెడ్‌లు ఎలా వాడతారని , తోటి సభ్యులు కలిసి ఉన్నప్పుడు ఎందుకు దాచాల్సి వచ్చిందని, అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాకముందే ఎందుకు తొందరపడ్డారన్నది కౌన్సిల్ ప్రెసిడెంట్‌ వేస్తున్న ప్రశ్నలు. ఇక ఇష్యూని ప్రెసిడెంట్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC) దృష్టికి తీసుకెళ్లారు.చూడాలి మరి ఈ ‘ప్రెస్ నోట్’ డ్రామా టాలీవుడ్‌లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో !

also read :బతకనివ్వరా..? అంటూ తిరుపతిలో రషా తడానీతో ఘట్టమనేని వారసుడి రొమాన్స్!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×