E-Paper
Advertisement

తమిళ‌నాట సీనియ‌ర్‌, జూనియ‌ర్ రాజ‌కీయాలు..! ఇదో టైపు ర్యాగింగా? ఉద‌య‌నిధి దూకుడు..! కేటీఆర్‌లాగే..!

తమిళ‌నాట సీనియ‌ర్‌, జూనియ‌ర్ రాజ‌కీయాలు..! ఇదో టైపు ర్యాగింగా? ఉద‌య‌నిధి దూకుడు..! కేటీఆర్‌లాగే..!
Advertisement

తండ్రికి, కొడుకు చాలా తేడా ఉంది. ఎంతైనా సీనియ‌ర్ సీనియ‌రే. ఇప్పుడు మ‌నం చెప్పుకుంటున్న‌ది స్టాలిన్‌, అత‌ని కొడుకు ఉద‌య‌నిధి స్టాలిన్ గురించి. తొలిరోజే అసెంబ్లీలో ఉద‌య‌నిధి స్టాలిన్ మాట్లాడిన ప్ర‌సంగం.. అత‌ని ఆత్మ‌నూన్య‌త‌ను చాటింది. తండ్రి ఓడాడు. కొడుకే ఇప్పుడక్క‌డ ఎల్పీ లీడ‌ర్‌. ఎంతో హుందాగా ఉండాలె. తామిద్ద‌రం ఒకే కాలేజీలో చ‌దివామ‌న్నాడు. అక్క‌డ విజ‌య్ త‌న‌కు సీనియ‌ర్ అని గుర్తు చేస్తూనే.. రాజ‌కీయాల్లో మాత్రం నేనే సీనియ‌ర్‌. అత‌ను జూనియ‌ర్ అన్నాడు. చ‌లోక్తిలో అంత‌టితో ఆగితే స‌రిపోయేది. ఇంకా మాట్లాడుతూ.. ఏవైనా స‌ల‌హాలు, సూచ‌న‌లు కావాంటే ఇస్తామ‌న్నాడు. ఇక్క‌డ ఉద‌య‌నిధిలో ఇంకా ఎద‌గ‌ని మ‌న‌స్త‌త్వ‌మే క‌నిపించింది.

అక్క‌డ సీనియ‌ర్ అయినా.. ఇక్క‌డ జూనియ‌ర్ అయినా.. విజ‌య్‌లో ఉన్న అనుకువ, ప‌రిణ‌తిని క‌దా చూడాల్సింది. త‌న‌కు తానుగా ఎక్క‌డా త‌క్కువై పోతున్నాన‌నే ఇన్ఫిరియారిటీలో ఉన్న‌ట్టున్నాడు ఉద‌య్‌. సినిమాల్లో కూడా విజ‌య్ స‌క్సెస్ హీరో. ఆ విష‌యానికొస్తే ఉద‌య్ ఫెయిల్యూర్.. సినిమా జ‌నం తిర‌స్క‌రించిన హీరో. ఆ మాట‌లు వింటున్న విజ‌య్ గంభీరంగా న‌వ్వుకున్నాడు త‌ప్ప‌.. మ‌ళ్లీ కామెంట్ చేయ‌లేదు. విజయ్ మెజారిటీ విష‌యంలో కూడా ఉద‌య్ మాట్లాడిన‌న మాట‌లు హుందాగా లేవు. తండ్రిని అనుస‌రించేందుకు కొడుకు ఏమాత్రం ప్ర‌య‌త్నం చేయ‌లేద‌నిపించింది. రాజ‌కీయాల ప‌ట్ల విజ‌య్‌కు ఏమాత్రం అవ‌గాహ‌న లేద‌ని, త‌న‌కు తెలిసినంత‌గా కూడా అత‌నికి తెలియ‌ద‌న జ‌నాల‌కు తెలియ‌జెప్ప‌డం ఉద‌య్ ఉద్దేశ్య‌మై ఉంటుంది.

Advertisement

రేపు విజ‌య్ ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాలు.. చేప‌ట్టే సంస్క‌ర‌ణ‌లు.. ఏవైనా త‌ను విమ‌ర్శించేందుకు త‌న‌కు తానుగా ఓ స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు. దానికి జ‌నం ఆమోదం కూడా ల‌భిస్తుంద‌ని అనుకుంటున్నాడు. కానీ, స్టాలిన్ మాత్రం ఆరు నెల‌లు టైమ్ ఇచ్చి ఆ త‌రువాతే విజ‌య్ ప్ర‌భుత్వంపై కామెంట్ చేస్తామ‌న్నాడు హుందాగా. ఆ ప‌రిణ‌తి ఉద‌య్‌లో లోపించింది. ఇక్క‌డ కేసీఆర్ ఫామ్‌హౌజ్ కే ప‌రిమిత‌మై.. అన్ని బాధ్య‌త‌లు కేటీఆర్‌కు అప్ప‌గిస్తే.. త‌న‌దైన ర‌చ్చ రాజ‌కీయాల‌కు జీవం పోస్తున్న కేటీఆర్ లాగే ఉంది ఉద‌య్ నిధి మెంటాలిటీ కూడా. తొంద‌ర‌పాటు, దుందుడుకు మ‌న‌స్త‌త్వాలు ఇద్ద‌రిలో ఒకేలా క‌నిపిస్తున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కానీ విజ‌య్ మాత్రం.. సీఎంగా త‌న‌దైన శైలిని ఆదిలోనే చూపించుకున్నాడు. స్కూళ్లు, దేవాలయాల ద‌గ్గ‌ర ఉన్న మ‌ద్యం దుకాణాల‌ను తొల‌గించాల‌నేది చాలా చిన్న విష‌య‌మే కావొచ్చు. కానీ అంద‌రినీ ఆక‌ర్షించింది. త‌మిళ సినీ హీరోల‌తో పాటు..జ‌నం కూడా శ‌బ్బాష్ అన్నారు. త‌న‌కు ప్ర‌జాధ‌నంతో అవ‌స‌రం లేద‌ని, కావ‌ల్సినంత సంపాదించుకున్నాన‌ని విజ‌య్ కామెంట్ చేయ‌డం కూడా త‌మిళ‌నాట చ‌ర్చ‌కు తావిచ్చింది. అంటే… అవినీతికి ఆస్కారం లేని రాజ‌కీయాలుంటాయ‌ని ఆయ‌న ప‌రోక్షంగా జ‌నాల‌కు చెప్పాడు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఈ మాట‌నాలంటే ధైర్య‌మే కావాలి. కాస్ట్లీ ఎన్నికలుగా మారిన నేటి రాజ‌కీయాల్లో అవినీతి కూడా అందులో కామ‌న్ థింగ్ అయిపోయింది.

Advertisement

విజ‌య్‌కు రాజ‌కీయ అనుభ‌వం లేకున్నా… న‌డుస్తున్న తీరులో ప‌రిణ‌తే క‌నిపిస్తుంది. దీన్ని గ‌మ‌నించి కామెంట్ చేయాల్సిన ఉద‌య్‌.. ఆదిలోనే తొంద‌ర‌పాటు కామెంట్లు చేస్తూ.. ప్ర‌తిప‌క్షం ఇలాగే ఉండాల‌ని, త‌న‌లాంటి నేత ఇలాంటి దూకుడుతోనే ఉండాల‌ని ఫిక్స్ అయిన‌ట్టున్నాడు. ఆ లెక్క‌న రాజ‌కీయ ప‌రిణ‌తిలో ఉద‌యే జూనియ‌ర్ అవుతాడు. రాజ‌కీయాలు నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుందనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Related News

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×