E-Paper
Advertisement

‘ధురంధర్ 2’ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఏం జరిగిందంటే?

‘ధురంధర్ 2’ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఏం జరిగిందంటే?
Advertisement

RGV Bollywood: భారతీయ సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి బాలీవుడ్‌పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. గత కొన్ని రోజులుగా ధురంధర్ సినిమాను చూసి అసలు సినిమా ఎలా తియ్యాలి అనే దానిపై ప్రముఖ దర్శకులకు క్లాసులు పీకిన ఆర్జీవీ ఇప్పుడు బాలీవుడ్ పై ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ‘ధురంధర్ 2’ సినిమా సాధించిన అద్భుత విజయం పట్ల బాలీవుడ్ ప్రముఖులు ప్రదర్శిస్తున్న నిశ్శబ్దాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. పరిశ్రమలోని ఇలాంటి పరిస్థితులను వర్మ తనదైన శైలిలో ఎండగట్టారు.

Read also-పొదరిల్లు.. మార్చి 30 : శైలుకు కేశవ వార్నింగ్.. నారాయణ ప్రవర్తనతో మహా షాక్..చావు బతుకుల్లో నారాయణ..

భయంకరమైన నిశ్శబ్దం

Advertisement

సాధారణంగా ఏదైనా పెద్ద సినిమా విజయం సాధిస్తే, బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు అభినందించుకోవడం చూస్తుంటాం. కానీ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్నప్పటికీ, పరిశ్రమలోని అగ్ర హీరోలు, దర్శకులు మౌనంగా ఉండటాన్ని వర్మ “భయంకరమైన నిశ్శబ్దం” అని అభివర్ణించారు. ఈ విజయాన్ని అంగీకరించడానికి బాలీవుడ్‌కు మనసు రావడం లేదని, ఒక మంచి సినిమాను గుర్తించలేని స్థితిలో పరిశ్రమ ఉందనేది ఆయన ప్రధాన ఆరోపణ.

రణవీర్ సింగ్‌లకు హెచ్చరిక

ఈ సందర్భంగా వర్మ దర్శకుడు ఆదిత్య ధర్, స్టార్ హీరో రణవీర్ సింగ్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి కలయికలో వస్తున్న ప్రాజెక్టుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. బాలీవుడ్‌లో ఉండే అంతర్గత రాజకీయాలు, గ్రూపిజం వల్ల ప్రతిభ గల వ్యక్తులు ఎలా నష్టపోతారో ఆయన పరోక్షంగా సూచించారు. “ఒక గొప్ప విజయాన్ని పండగలా జరుపుకోవాల్సింది పోయి, కుళ్లుకుంటూ మౌనం వహించడం పరిశ్రమ పతనానికి సంకేతం” అని వర్మ అభిప్రాయపడ్డారు.

Advertisement

Read also-ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

కంటెంట్ సినిమాలదే రాజ్యం

కేవలం స్టార్ పవర్‌తో సినిమాలు నడిచే రోజులు పోయాయని, ‘ధురంధర్ 2’ వంటి సినిమాల విజయం ప్రేక్షకుడి అభిరుచి మారుతుందనడానికి నిదర్శనమని వర్మ పేర్కొన్నారు. బాలీవుడ్ లోని కొందరు పెద్దలు తమ అహాన్ని పక్కన పెట్టి, వాస్తవాలను గ్రహించాలని ఆయన డిమాండ్ చేశారు. కంటెంట్ ఆధారిత సినిమాలను ప్రోత్సహించకపోతే పరిశ్రమ వెనుకబడిపోతుందని ఆయన హెచ్చరించారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఎప్పుడూ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే వర్మ, ఈసారి బాలీవుడ్ ‘కోట’ గోడల మధ్య ఉన్న అసూయను బయటపెట్టే ప్రయత్నం చేశారు. మరి ఈ విమర్శలపై బాలీవుడ్ ప్రముఖులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

Big Stories

Advertisement
×