E-Paper
Advertisement

Epic First Note: సంచారమే సాంగ్ ప్రోమో వచ్చింది.. స్పెషల్ ఏంటంటే?

Epic First Note: సంచారమే సాంగ్ ప్రోమో వచ్చింది.. స్పెషల్ ఏంటంటే?
Advertisement

Epic First Note: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.32 గా రూపొందుతోన్న చిత్రానికి ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ (EPIC – First Semester) అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ‘బేబీ’ వంటి సంచలన విజయం తర్వాత ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) కలిసి నటిస్తున్న చిత్రమిది. ‘90s’ వెబ్ సిరీస్‌తో అందరి మనసులు దోచుకున్న ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతుండగా.. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ అప్డేట్‌ని ‘ఎపిక్ ఫస్ట్ నోట్’ (Epic First Note) పేరిట మేకర్స్ వదిలారు. అంతేకాదు, సాంగ్ ప్రోమో కూడా విడుదల చేశారు. ఈ ప్రోమో స్పెషల్ ఏంటంటే..

Also Read- Allu Family Wedding: అల్లు శిరీష్ వివాహానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.. అల్లు అర్జున్ ఈసారి ఆ తప్పు చేయలే!

గోరటి వెంకన్న సాహిత్యంలో

Advertisement

‘సంచారమే’ అంటూ సాగే ఈ పాటకు ఓ ప్రత్యేకత ఉండేలా మేకర్స్ ప్లాన్ చేశారు. ఆ ప్రత్యేకత ఏంటో కాదు ప్రజాకవి గోరేటి వెంకన్న (Goreti Venkanna) ఈ పాటకు సాహిత్యం అందించడమే కాకుండా, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్‌తో కలిసి ఆలపించడం. అవును తాజాగా విడుదల చేసిన సాంగ్ ప్రోమో (Sancharame Song Promo)లో ఆ విషయాన్ని వివరంగా స్పష్టం చేశారు. కేవలం హమ్మింగ్‌తో ఉన్న ప్రోమో ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఒక చార్ట్ బస్టర్ సాంగ్ రాబోతున్న ఫీల్‌ని ఈ ప్రోమో ఇస్తుంది. లిరికల్ వీడియో కాకుండా, ఏకంగా ఫుల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేయబోతున్నట్లుగా ఈ అప్డేట్‌లో తెలిపారు. ‘సంచారమే’ ఫుల్ వీడియో సాంగ్ శనివారం (మార్చి 7) ఉదయం 11 గంటల 8 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ఈ సాంగ్ కోసం అంతా వెయిట్ చేస్తున్నామంటూ, నెటిజన్లు ఈ ప్రోమో కింద కామెంట్స్ చేస్తున్నారు.

Also Read- Biker Movie: ‘బైకర్’ మూవీ మోటివేషన్ యాంథమ్ ‘జిద్ధి జిద్ధి’.. ఎలా ఉందంటే?

90స్ ఆదిత్య పెద్దయిన తర్వాత స్టోరీ

Advertisement

ఇక ఈ సినిమా గురించి ఇంతకు ముందు ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ సినిమా అవకాశం రావడానికి ముందే.. నేను ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వచ్చిన 90s వెబ్ సిరీస్ చూశాను. సిరీస్ నాకు చాలా నచ్చింది. ముఖ్యంగా ఆదిత్య పాత్రలో నన్ను నేను చూసుకున్నాను. గ్లింప్స్‌లో ఆదిత్య ఎలాగైతే అమ్మాయితో మాట్లాడాడో, నేను కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు అలాగే తడబడుతూ మాట్లాడేవాడిని. అలాంటి ఆదిత్య పెద్దయ్యాక తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల లండన్‌కి వెళ్తే.. అక్కడ ఏం జరిగింది? ప్రేమ కథ ఏంటి? వంటి అంశాలతో ఈ సినిమా ఉంటుంది. ఇందులో ప్రతి అంశం, ప్రతి సన్నివేశం అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని తెలిపారు.

Also Read- Muralidhar Goud: ‘డీజే టిల్లు’, ‘బలగం’ ఫేమ్ మురళీధర్ గౌడ్ ఇంట విషాదం

Related News

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

Big Stories

Advertisement
×