Band Melam Song: ‘కోర్ట్’ చిత్రంతో మెప్పించిన హర్ష్ రోషన్ (Harsh Roshan), శ్రీదేవి (Sridevi) జంట మళ్లీ ‘బ్యాండ్ మేళం’ (Band Melam) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు విడుదల తేదీని మార్చుకున్న ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. బ్లాక్ బస్టర్ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపు దిద్దుకుంటోంది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కావ్య, శ్రావ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి ‘రాజమ్మ’ అనే సాంగ్ (Band Melam Song)ని మేకర్స్ వదిలారు. ఈ సాంగ్ వివరాల్లోకి వెళితే..
‘‘రాజమ్మ ఇడిసిపోయిందిరో.. రాజమ్మ పొడిసిపోయిందిరో..
నన్నింక మరిసిపోయిందిరో.. నా గుండె ఇడిసిపోయిందిరో..’’ అంటూ సాగిన ఈ పాటకు విజయ్ బుల్గానిన్ ఇచ్చిన స్వరాలు క్యాచీగా ఉన్నాయి. ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను రామ్ మిరియాల ఆలపించారు. సునీల్ సున్నపు, ఫల్గుణి బంగీరా కొరియోగ్రఫీ చేశారు. పాట మొత్తం హాయిగా సాగిపోతుంది. వాడుక భాషలో ఉన్న పదాలను చంద్రబోస్ కూర్చిన విధానం ఆసక్తికరంగా ఉంది. సరిగ్గా ప్రమోట్ చేస్తే మంచి చార్ట్ బస్టర్ అయ్యే లక్షణాలు ఈ పాటకు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాట టాప్‌లోనే ట్రెండ్ అవుతోంది. పాటలో హర్ష్ రోషన్ స్టెప్స్‌తో అలరించేలా ఉన్నాయి. హీరోయిన్‌ని ఎదురుగా పెట్టుకుని, తనకు కలిగిన బాధను హీరో చెబుతున్న సందర్భంలో ఈ పాట ఉండనుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకు సంబంధించి వచ్చిన టీజర్, ట్రైలర్, మాస్ పెప్పీ సాంగ్ ‘తిప్పూ కుంటున్నావ్’, మంచి మెలోడీ సాంగ్ ‘పల్లెలోని సందల్లన్ని మీవే’ వంటివి ఆడియెన్స్‌లో సినిమా పట్ల అంచనాలను పెంచాయి. యూత్ ఆడియెన్స్‌లో ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం శ్రీరాముడి ఆశీస్సులతో శ్రీరామ నవమి సందర్భంగా రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్స్‌కి కావాల్సినంత టైం దొరకడంతో చిత్రయూనిట్ సైతం డిఫరెంట్ స్టైల్లో ప్రేక్షకులకు సినిమాను రీచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఇతర ప్రమోషనల్ కంటెంట్, ఈవెంట్లకు సంబంధించిన వివరాల్ని మేకర్స్ ప్రకటించనున్నారు. ఈ మూవీలో సాయికుమార్ ఓ కీలక పాత్రను పోషించారు.
Also Read- Ustaad Bhagat Singh:ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ పై హరీష్ శంకర్ అప్డేట్.. అలా చేయక తప్పట్లేదు అంటూ..!