E-Paper
Advertisement

Allu Family Wedding: అల్లు శిరీష్ వివాహానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.. అల్లు అర్జున్ ఈసారి ఆ తప్పు చేయలే!

Allu Family Wedding: అల్లు శిరీష్ వివాహానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.. అల్లు అర్జున్ ఈసారి ఆ తప్పు చేయలే!
Advertisement

Allu Family Wedding: అల్లు వారింట పెళ్లి వేడుకలు (Allu Family Wedding) అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. అల్లు అరవింద్ (Allu Aravind) చిన్న కుమారుడు, అల్లు అర్జున్ (Allu Arjun) సోదరుడైన అల్లు శిరీష్ (Allu Sirish) తన ప్రేయసి నయనిక రెడ్డి (Nayanika Reddy) తో మార్చి 6న ఏడు అడుగులు వేయబోతున్న విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల నడుమ ఈ పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరుగుతోంది. ఈ పెళ్లికి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని తెలిసి, అల్లు ఫ్యామిలీ మొత్తం ఆయనను రిసీవ్ చేసుకోవడానికి బయటకు వచ్చారు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ ఈసారి ఎటువంటి తప్పు చేయలేదు.

Also Read- Allu Arjun -Sneha Reddy: అల్లు అర్జున్ స్నేహ రెడ్డి 15 వెడ్డింగ్ యానివర్సరీ.. కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన బన్నీ!

ఎదురెళ్లి మరీ వెల్‌కమ్ చెప్పిన అల్లు అర్జున్

Advertisement

సీఎం రేవంత్ రెడ్డికి ఎదురెళ్లి మరీ అల్లు అర్జున్ ఆహ్వానించారు. గతంలో ఓ వేడుకపై సీఎం రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయిన అల్లు అర్జున్.. ఈసారి మాత్రం ఎటువంటి పొరపాటు చేయకుండా, గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వేదిక వద్ద కూడా సీఎం పక్కనే కూర్చుని.. చేతిలో చెయ్యేసి మరీ కబుర్లు చెప్పారు. వారి పక్కన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. ఇక ఈ ఫొటోలను అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రీసెంట్‌గా సీఎం రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మికల రిసెప్షన్‌కు హాజరు కాలేదని, స్వయంగా ఇంటికి వెళ్లి మరీ వారిని ఆశీర్వదించిన విషయం తెలిసిందే. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే తమ ఇంటికి రావడంతో విజయ్ ఫ్యామిలీ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Telangana CM Revanth Reddy Graces Allu Sirish’s Wedding

Advertisement

Also Read- Ustaad Bhagat Singh:ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ పై హరీష్ శంకర్ అప్డేట్.. అలా చేయక తప్పట్లేదు అంటూ..!

గ్రాండ్‌గా ప్రీ వెడ్డింగ్ వేడుక

ఇప్పుడు అల్లు ఫ్యామిలీ కూడా సీఎం రాకతో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. అల్లు శిరీష్ విషయానికి వస్తే.. గత కొన్ని రోజులుగా అల్లు వారింట శిరీష్ పెళ్లి సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. మార్చి 2వ తేదీన హైదరాబాద్‌లో ఘనంగా ప్రీ వెడ్డింగ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలెందరో హాజరై, నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి వేడుకను కూడా అల్లు అరవింద్ ఎంతో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు.

Also Read- Pragya Jaiswal: సన్ సెట్ కి పోటిగా అందాల జాతర మొదలుపెట్టిన ప్రగ్యా జైస్వాల్!

Related News

ఆటా సందీప్ దూకుడు.. జానీ, శేఖర్ మాస్టర్లకి ఇక కష్టమేనా ?

జయం రవి విడాకుల కేస్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆర్తి తల్లి!

త్రిషపై ఉదయనిధి అసభ్యకర వ్యాఖ్యలు.. కుష్బూ సంచలన ట్వీట్!

సర్జరీ తర్వాత తొలిసారి దర్శనమిచ్చిన రామ్ చరణ్.. డ్యాషింగ్ లుక్ తో!

ఆ సెలబ్రిటీల బాటలో శృతిహాసన్.. మరీ ఇంత దారుణంగా తయారయ్యారా?

ముంబై కోర్టును ఆశ్రయించిన శృతి హాసన్.. ఆ ఒక్కటి చేస్తే జైలుకే..!

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

Big Stories

Advertisement
×