E-Paper
Advertisement

చిన్నపాపతో రాత్రికి రాత్రే ఇల్లు వదిలి వచ్చేసిన స్టార్ నటి.. అసలేం జరిగిందంటే?

చిన్నపాపతో రాత్రికి రాత్రే ఇల్లు వదిలి వచ్చేసిన స్టార్ నటి.. అసలేం జరిగిందంటే?
Advertisement

Eva Grover: ప్రముఖ నటి ఎవా గ్రోవర్ వ్యక్తిగత జీవితంలో దాగున్న ఒక చీకటి కోణం ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తుంది.బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ సవతి సోదరుడు హైదర్ అలీ ఖాన్‌తో తన పెళ్లి, ఆ తర్వాత తను అనుభవించిన కష్టాల గురించి ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కేవలం 18 రోజుల పరిచయం, ఆపై ప్రేమ అనే భ్రమలో తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని ఎలా తలకిందులు చేసిందో చెప్తూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

కేవలం 18 రోజుల్లోనే పెళ్లి

సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ సినిమా ‘రెడీ’ (2011)లో నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో, అలాగే ‘కుంకుమ్ – ఏక్ ప్యారా సా బంధన్’ (2002), ‘బడే అచ్చే లగ్తే హై’ (2011) వంటి సెన్సేషనల్ టీవీ సీరియల్స్ ద్వారా ఎవా గ్రోవర్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే ఆమె జీవితంలో పెద్ద తప్పటడుగు వేసేసింది.
హైదర్ అలీ ఖాన్‌తో పరిచయమైన కేవలం 18 రోజుల్లోనే ఆమె పెళ్లి పీటలెక్కేసింది.

Advertisement

also read :ఒకప్పుడు ఓకే.. ఇప్పుడైతే తప్పా?…జాన్వీ ఇష్యూపై సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్

నిజానికి ఈ వివాహం ఎవా తల్లికి అస్సలు ఇష్టం లేదు. అంత తక్కువ సమయంలో ఆ వ్యక్తీ ఎలాంటి వాడో అని అంచనా వేయడం కష్టమని చెప్పినా వినకుండా ముందుకు వెళ్ళిపోయింది. అంతెందుకు, స్వయంగా ఆమిర్ ఖాన్ కూడా ఈ బంధం విషయంలో ఎవాను ముందుగానే హెచ్చరించడం గమనార్హం. అయినా సరే, ఆమె ఎవరి హెచ్చరికలను లెక్కచేయకుండా తొందరపాటు నిర్ణయం తీసుకుంది.

కూతురు పుట్టిన నెలరోజులకే మళ్ళీ టార్చర్

Advertisement

అయితే, పెళ్లయిన కొన్ని రోజులకే ఎవా డ్రీమ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయాయి. హైదర్ అసలు స్వరూపం బయటపడటానికి ఎంతో సమయం పట్టలేదు. రోజూ ఫిజికల్ హెరాస్ మెంట్, మెంటల్ హెరాస్ మెంట్ తో ఇంటిని ఒక నరకంగా మార్చేశాడు హైదర్.అయినప్పటికీ, ఎలాగైనా తన సంసారాన్ని నిలబెట్టుకోవాలనే తాపత్రయంతో, ఒక బిడ్డ పుడితేనైనా భర్త మారుతాడేమోననే ఆశతో ఒక పాపకు జన్మనిచ్చింది ఎవా.అయినా కానీ హైదర్ మారలేదు. పైగా కూతురు పుట్టిన నెలరోజులకే ఈ టార్చర్ మరింత ఎక్కువైపోయింది. దీంతో తన పసిపాపని తీసుకొని పుట్టింటికి చేరింది.

also read :హాలీవుడ్ దిగ్గజాలకే మైండ్ బ్లాక్…స్టార్స్ లేకుండానే రూ. 2200 కోట్లా?

ఆ సమయంలో ఆమెకు తన తోటి నటీనటులు, షూటింగ్ యూనిట్ సభ్యులు కొండంత అండగా నిలిచారు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. హైదర్ వైపు కుటుంబ సభ్యులైన ఆమిర్ ఖాన్ తండ్రి, దివంగత ప్రముఖ నిర్మాత తాహిర్ హుస్సేన్, అలాగే అత్తగారు షహనాజ్ కూడా ఎవాకే మద్దతుగా నిలిచారు. హైదర్ తప్పును వారు సమర్థించకపోవడమే కాకుండా, ఎవాకు ధైర్యాన్ని నూరిపోశారు.

ఎవా జీవితమే ఒక ఉదాహరణ

చివరకు, ఐదేళ్ల పాటు సాగిన కోర్టు పోరాటాలు, నరకయాతన తర్వాత ఆమె హైదర్‌కు అధికారికంగా విడాకులు ఇచ్చి ఆ బంధం నుంచి విముక్తి పొందారు. ఈ చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ.. ఒక్కోసారి మనం తీసుకునే తొందరపాటు నిర్ణయాలు జీవితాలను ఎలా నాశనం చేస్తాయో చెప్పడానికి తన జీవితమే ఒక ఉదాహరణ అని ఎవా గ్రోవర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సింగిల్ మదర్‌గా తన కూతురిని పెంచుకుంటూ, మళ్లీ కెరీర్‌పై దృష్టి పెడుతున్న ఎవా వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

Related News

నాని ది ప్యారడైజ్ నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల ఎప్పుడంటే?

జనాలను పిచ్చోళ్లని చేస్తున్నారా.. చెన్నై లవ్ స్టోరీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్!

సినిమా తీయాలి.. గివ్ అవేలు ఇవ్వాలి.. ఏమీ టైం సర్ ఇది.. ఏమీ ప్రమోషన్!

రూ.కోటి విలువ చేసే టికెట్లు ఫ్రీగా పంచిపెట్టిన హీరో.. అసలు నిజం తెలిస్తే షాక్!

గౌతమ్ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ అప్పుడే.. జయకృష్ణ క్లారిటీ!

నరేష్ మాటలకు స్టేజ్ దిగి వెళ్లిపోయిన బ్రహ్మాజీ.. అంత మాట అనేశాడు ఏంటి?

బాలకృష్ణను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి!

వివాదంలో చిక్కుకున్న నోలన్ ‘ది ఒడిస్సీ’ మూవీ.. 2వేల కోట్ల మూవీకి 6 లక్షలు ఇవ్వలేరా?

Big Stories

Advertisement
×