Madhubala Peddi: చరణ్ ,బుచ్చి బాబు కాంబోలో వచ్చిన పెద్ది చుట్టూ కాంట్రవర్సీలు ఇప్పట్లో ఆగేలా లేవు..ఏ ముహూర్తాన బుచ్చి జాన్వీ సీన్స్ డిజైన్ చేశాడో కాని రిలీజ్ అయ్యాక కలెక్షన్స్ కంటే కాంట్రవర్సీలే హైలెట్ అయిపోయాయి. నిజానికి స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెట్టుకున్నారు మూవీ లవర్స్. ఇక సినిమా థియేటర్లోకి వచ్చాక డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం ఒక రేంజ్ లో కుమ్మేసింది.అయితే ఈ ఈ ఆనందాన్ని ఆవిరి చేస్తూ జాన్వీ అందాల ఆరబోతపై నెట్టింట్లో రచ్చ జరగడం, జాన్వీ ఇన్స్టా లీక్స్. జయ, కరీనా, ఆశికా వంటి తారలు సపోర్ట్ చేయడంతో డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడ్డాడు.
తాను వెండితెరపై ఆవిష్కరించాలనుకున్న భావజాలాన్ని కొందరు తప్పుగా ప్రొజెక్ట్ చేశారని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ప్రేక్షకుల మనోభావాలను గౌరవిస్తూ ఆ ఓవర్ గ్లామరస్ కట్‌లను, వివాదాస్పద సీన్స్‌ను చిత్రం నుండి పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించి ఇండస్ట్రీకి షాక్ ఇచ్చారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ అగ్గిని మరింత రాజేస్తూ సీనియర్ స్టార్ మధుబాల రంగంలోకి దిగి సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చింది.
సినిమాల్లో మహిళా పాత్రలు , క్రమ క్రమంగా ఆడియన్స్ మైండ్‌సెట్‌లో వచ్చిన మార్పులను మధుబాల చాలా ప్రాక్టికల్‌గా వివరించారు. ఈ సందర్భంగా ఆమె 1991 నవంబర్ 22న బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తన ఆల్‌టైమ్ క్లాసిక్ “ఫూల్ ఔర్ కాంటే” (Phool Aur Kaante) నాటి రోజులను గుర్తు చేసింది. అజయ్ దేవగన్ సరసన కుకు కోహ్లీ డైరెక్షన్‌లో వచ్చిన ఆ సినిమా ఆ దశాబ్దంలోనే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.
also read :94 ఏళ్ల ‘భీష్మాచార్యుడు’ సింగీతంపై మెగాస్టార్ చిరంజీవి క్రేజీ పోస్ట్.. నెట్టింట వైరల్!
అందులో కాలేజ్ క్యాంపస్ వేదికగా సాగే ఈవ్-టీజింగ్ సీన్స్, హీరో హీరోయిన్‌ను వెంటాడే రొమాంటిక్ ట్రాక్స్ అప్పట్లో యూత్‌ను ఒక ఊపు ఊపేశాయని మధు గుర్తు చేశారు. నాటి రోజుల్లో హీరో హీరోయిన్ వెంటపడటాన్ని కేవలం ఒక ప్యూర్ లవ్ ఎక్స్ప్రెషన్ గా , రొమాంటిక్ ఎలిమెంట్‌గా మాత్రమే చూసేవారని.. అందుకే కథలో తన క్యారెక్టర్ చివరకు తనను ఏడిపించిన హీరోతోనే ప్రేమలో పడుతుందని ఆమె వివరించారు.
అప్పట్లో ఇలాంటి రొమాంటిక్ అప్రోచ్ చాలా కామన్ అని, 1992లో మణిరత్నం సృష్టించిన అద్భుతం “రోజా” చిత్రంలో గానీ, ఆ తర్వాతి కాలంలో వచ్చిన ఆమె ఇతర హిట్ సినిమాలు “జెంటిల్మన్” (1993), “అల్లరి ప్రియుడు” (1993) వంటి క్రేజీ మ్యూజికల్ హిట్స్‌లో గానీ రొమాంటిక్ ఎమోషన్స్ మీద ఎప్పుడూ ఇలాంటి నెగెటివిటీ రాలేదని మధుబాల గుర్తు చేశారు. అంతేకాకుండా కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలైన “యోధా” (1992), “జాథ్ రత్న” వంటి చిత్రాల్లోనూ మహిళల పాత్రల గ్లామర్‌ను జనం కేవలం ఒక కమర్షియల్ యాంగిల్‌లోనే ఆస్వాదించారని పేర్కొన్నారు.
కానీ, ఇప్పటి 2026 డిజిటల్ జనరేషన్ ఆలోచనా విధానం, సామాజిక దృక్పథం పూర్తిగా మారిపోయాయని మధుబాల నొక్కి చెప్పారు. నాటి కాలంలో రొమాన్స్‌గా చలామణీ అయిన స్క్రీన్ బిహేవియర్, నేటి సమాజంలో వేధింపులుగా (Harassment) మారిపోయాయని, సినిమా ఎప్పుడూ సమాజంలో మారే సాంస్కృతిక విలువలను రిఫ్లెక్ట్ చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఆడియన్స్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినప్పుడు మేకర్స్ కూడా తమ రైటింగ్ స్టైల్‌ను అప్‌డేట్ చేసుకోవాలని హితవు పలికారు.
also read :హాలీవుడ్ దిగ్గజాలకే మైండ్ బ్లాక్…స్టార్స్ లేకుండానే రూ. 2200 కోట్లా?
ప్రస్తుతం “పెద్ది” సినిమా చుట్టూ రేగిన ఈ కాంట్రవర్సీ కేవలం ఒక సినిమా సీన్ తొలగింపుతో ముగిసిపోయేలా కనిపించడం లేదు. వెండితెరపై కమర్షియల్ గ్లామర్‌కు, సామాజిక గౌరవానికి మధ్య ఉండాల్సిన గీతపై ఇండస్ట్రీ పెద్దలు ఆలోచించేలా చేస్తోంది.చూడాలి మరి ముందు ముందు ఈ గ్లామర్ వార్ ఇంకెంత ముదురుతుందో !