Garividi Lakshmi: ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి (Garividi Lakshmi) కథని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) ప్రేక్షకులకు అందించబోతున్న విషయం తెలిసిందే. ‘గరివిడి లక్ష్మి’ టైటిల్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో టైటిల్ పాత్రని ఆనంది (Anandhi) పోషిస్తోంది. గౌరి నాయుడు జమ్ము (Gowri Naidu Jammu) ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బుర్రకథలు చెప్పడమే కాదు, ఓ ఉద్యమంగా మార్చిన లక్ష్మి జీవితాన్ని ఈ సినిమా ఆవిష్కరించనుందని మొదటి నుంచి టీమ్ చెబుతూ వస్తోంది. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా, పాటతో వేలాది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని రిక్రియేట్ చేస్తోందని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ సినిమా నుంచి జానపద గీతం ‘కోసింది కొయగూర’ సాంగ్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు.
Also Read- R Madhavan: ఆ సీన్‌లో సిగరెట్ స్మోకింగ్.. సారీ చెప్పిన ‘ధురంధర్’ నటుడు
ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కారణం ఆనంది డ్యాన్స్. చరణ్ అర్జున్ (Charan Arjun) ఈ జానపదాన్ని రా ఎనర్జీ వుండే డ్యాన్స్ నెంబర్‌గా కంపోజ్ చేశారు. అనన్య భట్, షకలక శంకర్, గౌరీ నాయుడు జమ్ము వోకల్స్ మరింత వైబ్‌ని ఈ పాటకు యాడ్ చేశాయి. ఉత్తరాంధ్ర జానపద మూలం నుంచి స్వరపరిచిన ఈ పాటకు గంటేడ గౌరు నాయుడు, గౌరీ నాయుడు జమ్ము రాసిన అదనపు సాహిత్యం మరింత ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఈ పాటలో రాగ్ మయూర్ ప్రజెన్స్, డ్యాన్స్ మూమెంట్స్ మరింత జోష్‌ని ఇచ్చేలా ఉన్నాయి. ఈ పాట చూసిన తర్వాత ఆనందిలో ఇంత విషయం ఉందా? అని అంతా ఆశ్చర్యపోతారు. అంత చక్కగా చీరకట్టులో ఆమె డ్యాన్స్ చేసింది. హెవీ డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఆమె చేస్తుంటే చాలా అందంగా అనిపిస్తున్నాయి. అందుకే ఈ పాట చూసిన వారంతా ఆమె డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారని. ‘కోసింది కొయగూర’ సాంగ్‌తో సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి.
Also Read- Mythri Movie Makers: మరో తమిళ చిత్రాన్ని ప్రకటించిన మైత్రీ బ్యానర్.. హీరో ఎవరంటే?
‘గరివిడి లక్ష్మి’ మన ఊరి పాటలు, అనుభూతులు, మన మూలాల నుంచి వచ్చే ఆత్మగౌరవానికి సెల్యూట్ లాంటి సినిమా అని దర్శకురాలు గౌరి నాయుడు జమ్ము చెబుతున్నారు. గరివిడి లక్ష్మిగా ఆనంది అద్భుతంగా చేస్తున్నారని, సినిమా చాలా బాగా వస్తుందని, కచ్చితంగా అందరినీ మెప్పించే సినిమా అవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఆనంది ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నరేష్, రాశి, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, శరణ్య ప్రదీప్, కుశాలిని వంటి వారు ఇతర పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాతో మంచి విజయంతో పాటు ఒక గొప్ప సినిమా తీశామనే సంతృప్తి కూడా మాకు లభిస్తుందని నిర్మాతలు నమ్మకంగా చెబుతున్నారు.
Also Read- Deva katta: పవన్ కళ్యాణ్ తో పొలిటికల్ సినిమా.. స్పందించిన దేవా కట్టా.. స్క్రిప్ట్ పనులు మొదలు?