E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : తనూజా కోసం సంజనాకు అన్యాయం… భరణి నిర్ణయానికి బలి… ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్

Bigg Boss 9 Telugu : తనూజా కోసం సంజనాకు అన్యాయం… భరణి నిర్ణయానికి బలి… ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్
Advertisement

Bigg Boss 9 Telugu : ఇమ్యూనిటీ కోసం ఈ వారం మొత్తం జరిగిన పోరులో సంజనకు సపోర్ట్ చేసిన భరణినే ఈరోజు ఆమెకు అన్యాయం చేశాడు. నిన్నటికి నిన్న సుమన్ పాయింట్స్ ను తాను తీసుకోకుండా సంజనకు ఇచ్చాడు. కానీ ఈ రోజు మాత్రం కావాలని ఆమెను గేమ్ నుంచి తప్పించే ప్లాన్ చేశాడు.

తనూజపై ప్రేమ కాదు 

స్కోర్ బోర్డులో లీస్ట్ లో ఉన్న భరణిని బిగ్ బాస్ డే 96 ఎపిసోడ్లో తప్పించారు. అక్కడి నుంచి మొదలైంది భరణి మాస్టర్ ప్లాన్. ‘నాకు సపోర్ట్ చేయకపోయినా నేను ఆమెకు సపోర్ట్ చేస్తాను. నాన్నా అని నోరారా పిలిచిన అమ్మాయిని దూరం పెట్టేంత క్యారెక్టర్ లెస్ కాదు నేను” అని భరణి చెప్పిన డైలాగ్ విన్నా, తనూజకు పాయింట్స్ ఇచ్చేటప్పుడు అతని ఏడుపును చూసినా… కూతురు తనూజపై ప్రేమతో ఈ నిర్ణయం తీసుకున్నాడేమో అన్పిస్తుంది. కానీ అసలు ప్లాన్ వేరే ఉంది. తన పాయింట్స్ ను సంజనకు ఇస్తే, ఆమె టాప్ 5 లోకి వెళ్తుంది. అప్పుడు తామే డేంజర్ జోన్లో పడతామని సుమన్ తో చెప్పడమే కాదు, సంజనను ఈ రేసు నుంచి తప్పించేటప్పుడు కూడా భరణి ఇదే మాట చెప్పాడు డైరెక్ట్ గా. నా గేమ్ ను మైండ్ లో పెట్టుకుని సంజన గారినే తీసేస్తాను అని చెప్పాడు. అలా తీసేయడానికి ముందు జరిగిన టాస్క్ లో కూడా సంజనకు సంచాలక్ గా భరణి అన్యాయమే చేశాడు. ఆమె లీస్ట్ లోకి రావడానికి, రేసు నుంచి తొలగిపోవడానికి కారకుడు భరణి.

‘కీ టూ సక్సెస్’ టాస్క్ లో అన్యాయం 

Advertisement

‘కీ టూ సక్సెస్’ టాస్క్ లో సంజన ఇమ్మూ, తనూజలతో సమానంగా పోరాడింది. ఒకరిని ఒకరు తీసుకుంటూ చివరి దాకా వచ్చారు. బజర్ మోగే సమయానికి ఇమ్మూ – సంజన రెండు రెండు పాయింట్స్ తో సమానంగా ఉన్నారు. నిజానికి హౌస్ మేట్స్ అందరూ సంజన సరిగ్గా పెట్టలేదని అన్నారు. కానీ భరణినే ఆమె సరిగ్గా పెట్టిందని అనౌన్స్ చేశాడు. అదే నిజమైతే ఇమ్మూ – సంజనకు ఆ టాస్క్ టై అయ్యి ఉండాల్సింది. ఇదే మాట సంజన అడిగితే సంచాలక్ గా నా మాటే శాసనం, ఇమ్మూనే విన్నర్ అన్నాడు భరణి.

ఒకవేళ ఇక్కడ టై ఇచ్చి ఉంటే, ఈ టాస్క్ పాయింట్స్ 150ని ఇద్దరికీ సమానంగా పంచి ఉంటే… అప్పటికే టాప్ లో ఉన్న తనూజతో సంజన, లేదా ఇమ్మూ స్కోర్ సమం అయ్యేది. కానీ భరణి మాత్రం సంజన టాప్ 5 లోకి వెళ్తే తాను డేంజర్ జోన్ లో పడతాను అని ఆలోచింది, టై ఇవ్వకుండా ఇమ్మూను విన్నర్ ను చేశాడు. ఒకరకంగా చెప్పాలి అంటే దీన్ని కూడా స్ట్రాటజీ అనే అనవచ్చు. కానీ పాపం సంజన.

Advertisement

Read Also ; తనూజాకే భరణి సపోర్ట్… ఇమ్మూకి గాయం… సెకండ్ ఫైనలిస్ట్ కు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×