E-Paper
Advertisement

తెలంగాణలో మళ్లీ గులాబీ జైత్రయాత్ర.. వంద శాతం మనమే గెలవబోతున్నాం: కేసీఆర్

తెలంగాణలో మళ్లీ గులాబీ జైత్రయాత్ర.. వంద శాతం మనమే గెలవబోతున్నాం: కేసీఆర్
Advertisement

KCR Jagtial Speech: జగిత్యాల వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న అణచివేతను.. మలిదశ ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించిన సీనియర్ నేత జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా, ఆయనను వెంటనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ గడ్డపై మళ్లీ వంద శాతం బీఆర్ఎస్ హవా మొదలుకాబోతోందని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరిన సీనియ‌ర్ నేత‌ జీవ‌న్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. “జగిత్యాలకు చెందిన కవి కలిశెట్టి ప్రభాకర్ ఒక మాట అన్నాడు. చీకట్లో భయపడితే ఒక చెట్టే నీ చుట్టూ అరణ్యమై భయపెడుతుంది.. అదే గుండె ధైర్యం ఉంటే, నీ వెంట ఒక పెద్ద సైన్యమే నిలుస్తుంది. ఈరోజు నా కళ్లముందు ఉన్న ఈ జనసందోహం, బయట రోడ్ల మీద ఉన్న జీవన్ రెడ్డి గారి అభిమానులు చూస్తుంటే ఆ మాట నిజమనిపిస్తుంది. జీవన్ రెడ్డి గారు నిఖార్సైన మనిషి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మొండి ధైర్యం ఉన్నోడు. అందుకే తెలంగాణ భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మాది 45 ఏళ్ల స్నేహం. రాజకీయ సిద్ధాంతాలు వేరైనా మా మిత్రత్వంలో ఏనాడూ లోపం లేదు.” అని కేసీఆర్ అన్నారు.

Advertisement

ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం ఆకలి కేకలతో, వలసలతో అల్లాడిపోయేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కరీంనగర్, పాలమూరు జిల్లాల నుండి 90 శాతం మంది ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్లేవారని, అప్పటి ప్రభుత్వాలు ప్రజల ఆకలి తీర్చలేక గంజి కేంద్రాలు నడిపేవారని గుర్తు చేశారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లోనే కరెంటు ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా రైతులు గళమెత్తారని, బషీర్‌బాగ్ వద్ద జరిగిన కాల్పుల్లో ముగ్గురు రైతులు చనిపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ఆ అన్యాయంపై పోరాడేందుకే తాను రాజకీయంగా తెగించి ముందుకు సాగానని వివరించారు.

రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన 14ఎఫ్ జీవో (14F GO) తెలంగాణ యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా ఉందని, ఆ సమయంలోనే తాను ‘చావో రేవో’ తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. శపథం చేసి తాను చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షే కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించిందని, చివరకు అప్పటి హోంమంత్రి చిదంబరం నోట “తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది” అనే చారిత్రాత్మక ప్రకటన వచ్చేలా చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు మళ్లీ క్షేత్రస్థాయిలోకి వస్తున్నానని, ప్రతి కార్యకర్త సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Read Also: కాళేశ్వరం కేసీఆర్ చేసిన భారీ పాపం.. అందుకోసమే హరీష్ రావు ఢిల్లీకి..! సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×