E-Paper
Advertisement

Happy Raj: ‘హ్యాపీ రాజ్’ లెక్కేంటో చెప్పేశాడు.. మైత్రీకి మరో హిట్!

Happy Raj: ‘హ్యాపీ రాజ్’ లెక్కేంటో చెప్పేశాడు.. మైత్రీకి మరో హిట్!
Advertisement

Happy Raj: స్టార్ కంపోజర్, వెర్సటైల్ యాక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హ్యాపీ రాజ్’ (Happy Raj). ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ వద్ద శిష్యరికం చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌పై జైవర్ద నిర్మించిన ఈ చిత్రంలో ‘మ్యాడ్’ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా మేకర్స్ ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ‘అద్దిరా లెక్క’ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ పాటను గమనిస్తే..

Also Read- Hema and Surekha Vani: కల్లు తాగుతూ.. హేమ, సురేఖ వాణి హల్‌చల్.. వీడియో వైరల్!

‘అద్దిరా లెక్క’ వచ్చేసింది..

Advertisement

సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేసిన ఈ ‘అద్దిరా లెక్క’ సాంగ్ (Addira Lekka Lyrical Video) ఇన్‌స్టెంట్ హిట్‌గా సోషల్ మీడియాలో దూసుకెళుతోంది. అదిరిపోయే బీట్స్‌తో సాగే ఈ మాస్ ఎనర్జిటిక్ నంబర్‌ను గాయకుడు గోవింద్ ప్రసాద్ తన పవర్‌ఫుల్ వాయిస్‌తో ఆలపించగా, రెహ్మాన్ అందించిన సాహిత్యం యువతను ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఈ పాటలో జి.వి. ప్రకాష్ కుమార్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ స్పెషల్ హైలైట్‌గా నిలిచాయి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఈజ్ స్టెప్స్ సాంగ్‌కు మంచి వైబ్‌ను తీసుకొచ్చాయి. విడుదలైన కొద్దిసేపటికే ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి రావడంతో సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలుస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటలో హీరో లెక్కేంటో చెప్పేసేలా సాహిత్యం కుదిరింది.

Also Read- Peddi Release Date: ఆ పాట వల్ల రామ్ చరణ్ పెద్ది సినిమాకు కష్టాలు..రిలీజ్ డేట్ మారుతుందా!

రెండు భాషల్లో ఒకేసారి రిలీజ్..

Advertisement

నటీనటులే కాకుండా, టెక్నికల్‌గా కూడా ఈ చిత్రం చాలా రిచ్‌గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. మధన్ క్రిస్టోఫర్ సినిమాటోగ్రఫీ, ఆర్కె సెల్వ ఎడిటింగ్, కుమార్ గంగప్పన్ ప్రొడక్షన్ డిజైన్ ఈ సినిమాకు బలాన్ని చేకూర్చాయి. ఈ చిత్రంలో అబ్బాస్, జార్జ్ మరియన్, గీతా కైలాసం వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 27న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తుండటంతో, బాక్సాఫీస్ వద్ద ‘హ్యాపీ రాజ్’ స్ట్రాంగ్ రన్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మార్చి 26న టాలీవుడ్‌లో మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ మూవీస్‌కు పోటీగా వస్తున్న ‘హ్యాపీ రాజ్’.. కచ్చితంగా మైత్రీ వాళ్లకి హిట్ ఇస్తాడని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. చూద్దాం మరి.. ఏం జరుగుతుందో?

Also Read- Samantha:బెడ్ రూమ్ లో భర్త రాజ్ నిడుమోరు ఏం చేస్తున్నారో పోస్ట్ పెట్టిన సమంత..!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×