E-Paper
Advertisement

Horror Movie OTT: కాటి నుంచి కదిలొచ్చిన కసాయి తండ్రి… కన్నబిడ్డలనూ వదలని కొరివి దెయ్యం

Horror Movie OTT: కాటి నుంచి కదిలొచ్చిన కసాయి తండ్రి… కన్నబిడ్డలనూ వదలని కొరివి దెయ్యం

Horror Movie OTT : హారర్ సినిమాలు చూసేందుకు చాలామంది ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అయితే ఇండోనేషియన్ హారర్ సినిమాలు మాత్రం చాలామందికి వెన్నులో వణుకు పుట్టిస్తాయి. అక్కడ నుంచి వచ్చే సినిమాలు ఎక్కువ భాగం భయంకరమైన హారర్ కంటెంట్ తోనే వస్తాయి. అది కూడా ఘోరమైన చేతబడులతోనే ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో గత ఏడాది థియేటర్లలో వణికించిన, ఒక హారర్ మూవీ గురించి చెప్పుకోవాల్సిందే. ఈ సినిమా కథ ఇంటి పెద్ద ఒక ఆశుభ ఘడియలో చనిపోవడంతో భయంకరమైన అతీంద్రియ శక్తుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమాను, ఇండోనేషియాలోని పురాతన నమ్మకాలు, ఫ్యామిలీ సెంటిమెంట్‌ను మిక్స్ చేసి రూపొందించారు.

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో

ఈ ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ది డిసీజ్డ్’ (The Deceased). దీని అసలు పేరు ‘అల్మర్హుమ్’ (AlMarhum). ఇందులో సఫీరా రతు సోఫ్యా, రుక్మాన్ రోసాడి, దిమాస్ ఆదిత్య ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 2025 నుండి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులోకి వచ్చింది.

స్టోరీలోకి వెళ్తే

ఈ కథ ఒక మధ్యతరగతి కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఆ కుటుంబ పెద్ద అయిన ముల్వాంటో ఒక అశుభ గడియలో మరణిస్తారు. ఆయన చనిపోయినప్పటి నుండి ఆ ఇంట్లో వింత వింత సంఘటనలు మొదలవుతాయి. అది సాధారణ మరణంలా కనిపించినా, దాని వెనుక ఏదో అతీంద్రియ శక్తి ఉందనే భయం కుటుంబ సభ్యుల్లో మొదలవుతుంది. ఆయనకు ముగ్గురు పిల్లలు. పెద్ద కొడుకు విసేసా వృత్తిరీత్యా డాక్టర్ కావడంతో ఇలాంటి మూఢనమ్మకాలను అస్సలు నమ్మడు. కానీ అతని చెల్లెలు నూరి, తమ్ముడు యందాలకు మాత్రం ఇంట్లో ఏదో దుష్టశక్తి తిరుగుతోందని అర్థమవుతుంది. క్రమంగా ఆ శక్తుల ప్రభావం పెరిగి, కుటుంబ సభ్యుల ప్రాణాల మీదకు వస్తుంది.

అప్పుడు వాళ్ళు తమ తండ్రి మరణం వెనుక ఉన్న అసలు రహస్యం గురించి తెలుసుకొనడం మొదలు పెడతారు. ఇక ఈ విచారణలో వాళ్ళకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. తమ కుటుంబంపై ఎవరో పాత పగతో భయంకరమైన క్షుద్ర పూజలు చేయించారని తెలుసుకుంటారు. చివరికి ఆ చేతబడి ప్రభావం నుండి బయటపడటాని వీళ్ళు ఏం చేశారు ? తమ తండ్రి ఆత్మకు శాంతిని ఇవ్వగలిగారా ? ఆ దుష్టశక్తిని ఎలా ఎదిరించారు? అనే విషయాలను, ఈ ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : కాబోయే మొగుడు ఇంకో పిల్లతో… లోకం చూపించే కొత్త ప్రియుడు… కన్నీళ్ళు పెట్టించే క్లైమాక్స్

Tags

Related News

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

క్రైమ్ నుంచి రొమాన్స్ వరకు… ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే

ఓటీటీలోకి 7,000 కోట్ల మూవీ… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

‘మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ నుండి ‘ఆఫీస్ రొమాన్స్’ వరకు… ఓటీటీలోకి 6 హాలీవుడ్ మూవీస్

Big Stories

×