E-Paper
Advertisement

Happy Raj: ‘హ్యాపీ రాజ్’ని పట్టేసిన మైత్రి.. విడుదల ఎప్పుడంటే?

Happy Raj: ‘హ్యాపీ రాజ్’ని పట్టేసిన మైత్రి.. విడుదల ఎప్పుడంటే?
Advertisement

Happy Raj: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అగ్రగామి నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ‘పుష్ప 2’ తర్వాత ఈ బ్యానర్ స్థాయి పాన్ ఇండియాకు చేరింది. మరో వైపు మైత్రీ డిస్ట్రిబ్యూషన్ కూడా అద్భుతంగా కొనసాగుతోంది. టాలీవుడ్ నుంచే కాకుండా ఇతర భాషల నుంచి కూడా తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాలను అందిస్తోంది. మైత్రీ నిర్మాతల డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘హ్యాపీ రాజ్’ (Happy Raj) అనే చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన చేసింది. ఈ చిత్రంలో కంపోజర్-హీరో జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) హీరోగా నటిస్తుండగా.. స్టార్ హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద ఈ చిత్రాన్ని కోలీవుడ్‌లో నిర్మించారు.

Also Read- Hero Vishal: మీకు ఇబ్బంది వచ్చినా.. రాజేంద్ర ప్రసాద్ సారీ‌పై రియాక్టైన విశాల్!

ప్రమోషన్స్ మొదలెట్టిన మైత్రి..

Advertisement

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. గ్యారంటీ హిట్ అనే ఫీల్‌ని ఇచ్చింది. దీంతో మైత్రీ వారు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. ‘మ్యాడ్’ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఇప్పటికే తమిళ్‌లో పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ప్రమోషనల్ కంటెంట్‌కు ప్రేక్షఖులకు బాగా నచ్చేసింది కూడా. ఇప్పుడు కలర్, యాటిట్యూడ్, మాస్ టోన్‌తో వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో తెలుగు ప్రమోషన్లను కూడా ప్రారంభించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ గమనిస్తే.. జివి ప్రకాష్ కుమార్ కాన్ఫిడెంట్‌గా నల్లటి సూట్, ఓపెన్-కాలర్ షర్ట్, సన్ గ్లాసెస్ ధరించి, స్ట్రీట్-స్మార్ట్‌గా ఆటో రిక్షా నుండి బయటకు వస్తున్నారు. ఫస్ట్ లుక్ స్టైలిష్‌గా ఉండటమే కాకుండా అందరిదృష్టిని ఆకర్షిస్తోంది.

Also Read- Chandini Chowdhary: పెళ్లికి సిద్ధమైన చాందినీ చౌదరి.. ఇందులో నిజం ఎంత..?

రిఫ్రెషింగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

Advertisement

టైటిల్‌కు తగ్గట్టే.. ఆయన చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఇంకా కొన్ని స్టిల్స్‌ని కూడా మైత్రీ వారు విడుదల చేశారు. ఈ స్టిల్స్‌లో హీరోహీరోయిన్లు షాపింగ్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. హీరోయిన్ చాలా అందంగా కనిపిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో అబ్బాస్, జార్జ్, గీతా కైలాసం, ప్రార్థన నాథన్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘హ్యాపీ రాజ్’ రిఫ్రెషింగ్ నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం మార్చి 27న తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల అవుతుంది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP (Mythri Movie Distributors LLP) సపోర్ట్‌తో ఈ చిత్రం తెలుగులో స్ట్రాంగ్ రన్ అందుకుని, మంచి సక్సెస్ అవుతుందని చిత్రయూనిట్ కూడా భావిస్తోంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.

Also Read- Rakasa: ‘రాకాస’ నుంచి మెలోడీ సాంగ్ ‘పదే పదే’ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×