E-Paper
Advertisement

Romantic Drama OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సిరీస్… ఏకంగా ఏడు సీజన్లు

Romantic Drama OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సిరీస్… ఏకంగా ఏడు సీజన్లు
Advertisement

Romantic Drama OTT : ఓటీటీలో ఏ సిరీస్ అయినా 3 లేదా 4 సీజన్లకే ఆగిపోతుంది. కానీ 2019లో మొదలైన ఒక సిరీస్, ఇప్పటివరకు 7 సీజన్లుగా వచ్చి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యంగా ఇందులోని ప్రశాంతమైన కొండలు, పచ్చని ప్రకృతి చూస్తుంటే ఏదో హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే, మన తెలుగు వాళ్లకు గోదావరి లాంటి సినిమాల్లో ఉండే ఆ పల్లెటూరి ఫీలింగ్ ఈ సిరీస్‌లో కూడా కొంచెం కనిపిస్తుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన సీజన్ 7 కూడా దూసుకుపోతోంది.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న సిరీస్ పేరు ‘వర్జిన్ రివర్ సీజన్ 7’ (Virgin River Season 7). రాబిన్ కార్ అనే రచయిత్రి రాసిన నవల ఆధారంగా దీనిని తీశారు. ఆమె రాసిన ‘వర్జిన్ రివర్’ బుక్ సిరీస్ ఎంత హిట్ అయిందంటే, నెట్‌ఫ్లిక్స్ వాళ్లు దీన్ని వెబ్ సిరీస్‌గా మార్చేశారు. ఇందులో మెల్ పాత్రలో అలెగ్జాండ్రా బ్రెకెన్రిడ్జ్, జాక్ పాత్రలో మార్టిన్ హెండర్సన్ నటించారు. వీళ్లిద్దరి కెమిస్ట్రీ జనాలకు భలే నచ్చింది. విచిత్రం ఏంటంటే, కథ అంతా కాలిఫోర్నియాలోని ఒక చిన్న ఊరిలో జరిగినట్టు చూపించినా, అసలు షూటింగ్ మాత్రం కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో జరిగింది. అక్కడి అందమైన లొకేషన్లే ఈ సిరీస్‌కు పెద్ద ప్లస్ పాయింట్. రీసెంట్‌గా సీజన్ 7, 2026 మార్చి 12న నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో రిలీజ్ అయ్యింది. అది వచ్చిన వెంటనే నెట్‌ఫ్లిక్స్ వాళ్లు సీజన్ 8ను కూడా అనౌన్స్ చేసేశారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ అంతా అమెరికాలోని ఒక అందమైన కొండల మధ్య ఉండే ‘వర్జిన్ రివర్’ అనే చిన్న ఊరి చుట్టూ తిరుగుతుంది. మెలిండా మన్రో అనే ఒక నర్సు, తన జీవితంలో జరిగిన కొన్ని ఘోరమైన చేదు జ్ఞాపకాలను, బాధలను మర్చిపోవడానికి లాస్ ఏంజిల్స్ వంటి పెద్ద నగరాన్ని వదిలేసి ఈ చిన్న ఊరికి వస్తుంది. అక్కడ డాక్ ముల్లిన్ అనే ముసలి డాక్టరుకు సాయంగా క్లినిక్‌లో చేరుతుంది. మొదట్లో ఆ ఊరు, అక్కడి మనుషులు ఆమెకు కొత్తగా అనిపించినా, నెమ్మదిగా ఆ ఊరి ప్రశాంతత ఆమెకు బాగా నచ్చుతుంది.

మెల్ ఆ ఊరికి రాగానే అక్కడ ఒక బార్ నడిపే జాక్ పరిచయం అవుతాడు. జాక్ మాజీ మిలిటరీ మ్యాన్, మనసున్న మనిషి. మెల్ బాధను అర్థం చేసుకుని ఆమెకు అండగా నిలబడతాడు. ఇక వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది కానీ, అది అంత సులభంగా సాగదు. జాక్ పాత ప్రేమికురాలు చార్మైన్ గర్భవతి కావడం, మెల్ తన గతాన్ని మర్చిపోలేకపోవడం వంటి ఎన్నో అడ్డంకులు వస్తాయి.

Advertisement

ఇక లేటెస్ట్ సీజన్ 7 వరకు వచ్చేసరికి, మెల్, జాక్ ఎట్టకేలకు పెళ్లి చేసుకుని ఒకటవుతారు. వాళ్లు ఒక ఫామ్ హౌస్ కొని అక్కడ సెటిల్ అవుతారు. సొంత బిడ్డ కోసం పడ్డ కష్టాలు చాలనిపించి, ఒక బిడ్డను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇంతలో ఊరిలో కొత్తగా వచ్చిన మెడికల్ బోర్డ్ ఆఫీసర్ వల్ల డాక్ ముల్లిన్ క్లినిక్ మూతపడే పరిస్థితి వస్తుంది. ఇక ఈ సీజన్ లో కూడా ఊహించని మలుపులు ఉంటాయి. క్లైమాక్స్ లో వచ్చే అసలు ట్విస్ట్ సీజన్ 8కు కొనసాగింపుగా ఉంటుంది.

Read Also : ముగ్గురు తండ్రులకు పుట్టిన ముద్దుల కూతురు… ఆసక్తి రేపుతున్న ఒక్కో ఎపిసోడ్

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×