E-Paper
Advertisement

Harish Shankar: పవన్ కళ్యాణ్‌కు కథ చెప్పినపుడు ప్రశాంత నీల్ గుర్తుకొచ్చాడు… హరీష్ శంకర్

Harish Shankar: పవన్ కళ్యాణ్‌కు కథ చెప్పినపుడు ప్రశాంత నీల్ గుర్తుకొచ్చాడు… హరీష్ శంకర్
Advertisement

Harish Shankar: టాలీవుడ్‌లో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్‌ను వెండితెరపై ఎలా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటారో, అంతకు మించి చూపించగల దర్శకుడు ఆయన. అయితే, వీరిద్దరి ప్రయాణం వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. అది ‘మిరపకాయ’ సినిమా కథా చర్చల సమయంలో జరిగింది. హరీష్ శంకర్ మొదట పవన్ కళ్యాణ్ కి ‘మిరపకాయ’ కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు, కళ్యాణ్ చాలా బిజీగా ఉండటంతో “హరీష్, ఒక 10 నిమిషాల్లో సినాప్సిస్ చెప్పేయ్, నేను తర్వాత డీటెయిల్డ్ గా వింటాను” అన్నారట. కానీ హరీష్ శంకర్ కథ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది.

Read also-Hyderabad Reception: విరోష్ జంట రిసప్షన్ తర్వాత ఏం చేయనున్నారో క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ..

Advertisement

కథలోని ఎనర్జీ, హరీష్ శంకర్ మాట తీరుకు పవన్ కళ్యాణ్ ముగ్ధులయ్యారు. 10 నిమిషాల్లో ముగిసిపోవాల్సిన ఆ చర్చ, ఏకంగా ఒక గంటా 20 నిమిషాల పాటు సాగింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఎంతలా లీనమైపోయారంటే, సమయం గడిచిన విషయమే ఇద్దరికీ తెలియలేదు. కథ మొత్తం విన్నాక పవన్ కళ్యాణ్ గారు కాసేపు మౌనంగా ఆలోచనలో పడిపోయారట. ఆ మౌనం చూసి హరీష్ శంకర్ లోపల ఒకటే టెన్షన్.. “కథ నచ్చలేదా? ఎక్కడైనా పొరపాటు జరిగిందా?” అని భయపడ్డారు. కానీ, ఆ మౌనం తర్వాత కళ్యాణ్ ఒక్కసారిగా హరీష్ శంకర్ వైపు చూసి, “మనం ఈ సినిమా చేస్తున్నాం హరీష్” అని భరోసా ఇచ్చారు. ఆ క్షణం హరీష్ శంకర్‌కు కలిగిన సాటిస్ఫాక్షన్ మాటల్లో వర్ణించలేనిది.

Read also-Vijay Rashmika: రష్మిక గురించి విజయ్ దేవరకొండ ఫస్ట్ టైమ్ పెట్టిన ట్వీట్ ఇదే.. అప్పుడే చెప్పేశాడు..

గబ్బర్ సింగ్‌తో..

Advertisement

కొన్ని కారణాల వల్ల ‘మిరపకాయ’ సినిమా పవన్ కళ్యాణ్ గారితో కుదరకపోయినప్పటికీ తర్వాత అది రవితేజతో బ్లాక్ బస్టర్ అయ్యింది, ఆ కథా చర్చలే వీరిద్దరి మధ్య బలమైన నమ్మకాన్ని ఏర్పరిచాయి. అదే నమ్మకం తర్వాత టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి పునాది వేసింది. ఒక దర్శకుడు తన కథపై ఉన్న నమ్మకంతో స్టార్ హీరోని ఎలా మెప్పించవచ్చో చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం. పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్‌ను పట్టడంలో హరీష్ శంకర్ దిట్ట అని చెప్పడానికి ఈ ’10 నిమిషాల’ కథే ఒక ఉదాహరణ.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×