E-Paper
Advertisement

Free Bus Scheme: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

Free Bus Scheme:  దివ్యాంగులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
Advertisement

Free Bus Scheme: ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. “ఇంద్రధనుస్సు” పథకం ద్వారా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది. ఈ పథకాన్ని మార్చి 18న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అర్హులని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ప్రకటించారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అలాగే దివ్యాంగుకి సహాయకుడిగా వచ్చిన వారికి టికెట్ ధరలో 50% రాయితీ కల్పిస్తాయి.

47 కోట్ల ప్రయాణాలు

ఏపీ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పిస్తుంది. ఈ స్కీమ్ కింద మహిళలు ఇప్పటి వరకు 47 కోట్ల ప్రయాణాలు చేశారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసా ద్ రెడ్డి తెలిపారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ. 1,660 కోట్లు కేటాయించిందన్నారు. స్త్రీశక్తి పథకానికి 9,500 బస్సులను కేటాయించామన్నారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్ సూచన మేరకు విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ఎగ్జామ్ సెంటర్ వెళ్లే బస్సుల్లో ప్రయాణించవచ్చన్నారు.

Advertisement

ఆటో డ్రైవర్ సేవలో పథకం కింద వాహన మరమ్మతుల కోసం 2,90,699 మందికి రూ.15వేల చొప్పున రూ.436 కోట్ల ఆర్థిక సాయం అందించామన్నారు. దీన్ని ఏటా కొనసాగిస్తామని మంత్రి తెలిపారు. ఆర్టీసీకి 2,700 కొత్త బస్సులు సమకూర్చనున్నట్లు మంత్రి వివరించారు. పీఎం ఈ-బస్ సేవ ద్వారా రాష్ట్రానికి 750 కొత్త బస్సులు కేటాయించారనన్నారు.

Also Read: రాష్ట్రవ్యాప్తంగా 2,500 ఎకో-ఫ్రెండ్లీ బస్సులు.. ఏపీఎస్ఆర్టీసీ భారీ మార్పులకు శ్రీకారం!

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×