E-Paper
Advertisement

Hyderabad Reception: విరోష్ జంట రిసప్షన్ తర్వాత ఏం చేయనున్నారో క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ..

Hyderabad Reception: విరోష్ జంట రిసప్షన్ తర్వాత ఏం చేయనున్నారో క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ..
Advertisement

Hyderabad Reception: దక్షిణాది చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ జంటగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ జంట తమ స్నేహితులు, సినీ ప్రముఖులు రాజకీయ నాయకుల కోసం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో మార్చి 4న ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుక సందర్భంగా విరోష్ జంట్ తమపై ప్రేమ కురిపించిన అభిమానులకు థన్యవాదాలు తెలిపారు. అనంతరం ఈ రిసప్ఫన్ తర్వాత ఎవరికీ కనిపించకుండా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి పోతానని, రెస్ట్ తీసుకుంటానని చెప్పుకొచ్చారు.

Read also-Big Tv Kissik Talks: పేరుకే స్టార్ కిడ్…సొంత ఇల్లు కూడా లేదు.. వరలక్ష్మి ఎమోషనల్ కామెంట్స్!

Advertisement

ఈ వేడుకకు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ నుంచి ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. కేవలం సినీ రంగమే కాకుండా, తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇతర రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అభిమానుల్లో ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా, ఈ రిసెప్షన్ వేడుకను కేవలం ‘ఇన్విటేషన్ ఉన్నవారికి మాత్రమే’ పరిమితం చేశారు. పోలీసుల సూచన మేరకు భద్రతా కారణాల వల్ల అతిథుల సంఖ్యను తగ్గించి, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కఠినమైన నిబంధనలు అమలు చేశారు. ఆహ్వాన పత్రం ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించారు.

Read also-Allu Sirish Pre-Wedding: శిరీష్ ప్రీవెడ్డింగ్ వేళ అల్లు అర్జున్ పోస్ట్ వైరల్.. ఏం అన్నారంటే?

Advertisement

రిసెప్షన్ వేదిక వద్ద విజయ్ దేవరకొండ తెల్లటి సాంప్రదాయ దుస్తుల్లో మెరవగా, రష్మిక మందన్న ఎరుపు రంగు పట్టుచీర మరియు భారీ బంగారు ఆభరణాలతో ఎంతో అందంగా కనిపించారు. ఈ జంట తమ పెళ్లి ఆనందాన్ని పంచుకుంటూ దేశవ్యాప్తంగా దాదాపు 23 నగరాల్లో స్వీట్లు పంపిణీ చేయడమే కాకుండా, పలు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. రిసెప్షన్‌కు ముందు విజయ్ రష్మిక తెలుగు మీడియాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజయ్ భావోద్వేగానికి లోనవుతూ, “తెలుగు రాష్ట్రాలకు కొత్త కోడలు వచ్చింది, ఆమెను జాగ్రత్తగా చూసుకోండి” అని కోరారు. రష్మిక కూడా అందరి ఆశీస్సులు తమపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకతో వీరిద్దరి వివాహ వేడుకలు ముగియనున్నాయి. త్వరలోనే ఈ జంట తమ వృత్తిపరమైన పనుల్లో నిమగ్నం కానుంది. వీరిద్దరూ కలిసి నటించిన ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల తర్వాత మళ్లీ సెప్టెంబర్‌లో విడుదల కానున్న ‘రణబలి’ చిత్రంలో కలిసి కనిపించబోతున్నారు.

Related News

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

Big Stories

Advertisement
×