BigTV English
Advertisement

Kannappa Movie : ఇంత చేసి బయటికి రావడం లేదేంటి ? వెర్ ఈజీ హీరోయిన్ ?

Kannappa Movie : ఇంత చేసి బయటికి రావడం లేదేంటి ? వెర్ ఈజీ హీరోయిన్ ?

Kannappa Movie Heroine : కన్నప్ప హడావుడి తగ్గినట్టు కనిపిస్తుంది. మొదటి రోజు మొదటి షోకే కన్నప్ప హవా పరిమితమైంది. ఇక తర్వాత ప్రభాస్ మానియేనే సాగింది. అదే టైంలో మంచు విష్ణుపై ట్రోల్ బాంబులు కూడా పేలుతున్నాయి. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో మంచు విష్ణు చేసిన ఫర్ఫామెన్స్‌ గురించి వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో అందరూ చూస్తున్నారు.


సినిమా ఇంట్రడక్షన్‌లోనే గద్దను బాణంతో కొట్టే సీన్‌పై చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఆ సీన్‌లో విష్ణు పరిగెడుతూ వచ్చి.. గుర్రం ఎక్కి.. మళ్లీ గుర్రం పై నుంచి కిందకు దూకి గద్దపైకి బాణం వేస్తాడు. గుర్రం ఎక్కడం ఎందుకు.. మళ్లీ దిగడం ఎందుకు అంటూ డైరెక్ట్ విష్ణును ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు.
అలాగే, భక్తి సినిమాలో మీ రొమాన్స్ ఏంటి అని అడుగుతున్నారు.

అయితే, ఈ రొమాన్స్ సీన్స్, అలాగే రెండు పాటల్లో విష్ణుతో ఆడిపాడిన హీరోయిన్ ప్రితీ ముకుందన్ మాత్రం బయటకనిపించడం లేదు. ఫస్టాఫ్ మొత్తం ప్రితీ ముకుందనే ఎక్కువ కనిపిస్తుంది. కారణం.. ఆమె చేసిన అందాల ఆరబోత అని చెప్పొచ్చు. ముఖ్యంగా హీరోతో ఉన్న రెండు సాంగ్స్‌లో అడ్డు అదుపు లేకుండా అందాలను పరిచేసింది. ఓన్లీ ఫస్టాఫ్ వరకు చూస్తే ఎవరూ కూడా కన్నప్ప మూవీని భక్తి సినిమా అని అనరు.


అంతలా రెచ్చిపోయి మరీ అందాల వింధు పెట్టింది హీరోయిన్ ప్రితీ ముకుందన్. ఇంతలా రెచ్చిపోయి… అంతలా అందాల ఆరబోసిన ఈ హీరోయిన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం కనిపించడం లేదు. సినిమాకు హిట్ టాక్ వచ్చింది. ఇండస్ట్రీ హిట్ అయిందని మూవీ యూనిట్ ప్రకటించుకుంది. అలాగే పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.

అలాంటి టైంలో కూడా హీరోయిన్ బయటికి రావడం లేదు. దీంతో భక్తి సినిమాలో మీ రొమాన్స్ ఏంటి అంటూ వచ్చిన ట్రోల్స్ బయపడే, ప్రితీ ముకుందన్ బయటికి రావడం లేదా అని అంటున్నారు నెటిజన్లు.

నిజానికి ప్రితీ ముకుందన్‌కు ఇది ఫస్ట్ భారీ బడ్జెట్ మూవీ. ఓం భీం బుష్ అనే తెలుగు సినిమా. స్టార్ అనే ఓ తమిళ సినిమా చేసింది. ఈ రెండు చిన్న సినిమాలే. అలాగే ఈ రెండూ హిట్ అయ్యాయి. కానీ, ఈ పాపకు వచ్చిన పేరు మాత్రం జీరో.

కానీ, ఇప్పుడు కన్నప్ప సినిమాతో ప్రితీ ముకుందన్‌ కు గుర్తింపు వచ్చింది. కెరీర్‌లో మూడో మూవీకే మంచి గుర్తింపు తెచ్చుకుంది. సాధారణంగా కెరీర్ తొలినాళ్లలో మూవీ సక్సెస్ అయితే.. సక్సెస్ సెలబ్రేషన్స్ లో హీరోయిన్లు పాల్గొంటారు. ఎందుకంటే, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కంట పడాలని, కొత్త ఛాన్స్ లను దక్కించుకోవాలని. కానీ, ఈ అమ్మడు మాత్రం సినిమా రిలీజ్ తర్వాత బయటికే రావడం లేదు.

Related News

HBD Shahrukh Khan: 50 రూపాయలతో మొదలైన జీవితం.. వేలకోట్లకు అధిపతి.. మొత్తం ఆస్తి విలువ ఎంతంటే?

Allu Arjun: అల్లు అర్జున్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.. వర్సటైల్ యాక్టర్ గా బన్నీ!

Yellamma: ఎల్లమ్మ, ఇలా అయితే ఎలా అమ్మ? దేవి కూడా అవుట్?

Ustaad bhagat singh : పవన్ కళ్యాణ్ డాన్స్ ఇరగదీశారు, దేవి ఏమన్నాడంటే?

Chiranjeevi : మరోసారి ఆ సెంటిమెంట్ నమ్ముకుంటున్న అనిల్ రావిపూడి

SSMB 29: SSMB 29 అప్డేట్.. జియో హాట్ స్టార్ లో ప్రసారం..సినీ చరిత్రలోనే మొదటసారి ఇలా!

Rashmika: రష్మికలో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా..నిజంగా గ్రేట్ అబ్బా!

Sandeep Reddy: ఆ సినిమా వల్లే డైరెక్టర్ అయ్యాను.. మైండ్ నుంచి పోలేదంటున్న సందీప్ రెడ్డి!

Big Stories

×