Keerthy Suresh: దశరథ్ తీసిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో కె విశ్వనాథ్ పాత్ర ఒక డైలాగ్ చెబుతుంది. టెక్నాలజీ డెవలప్ అయింది అని ఆనందపడాలో మనుషుల మధ్య దూరం పెంచుతుంది అని బాధపడాలో అర్థం కావట్లేదు అంటారు. అయితే టెక్నాలజీ వలన లాభాలు నష్టాలు అన్నీ ఉన్నాయి. బేసిగ్గా అన్నింటి వలన లాభాలు నష్టాలు ఉంటాయి. దానిని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేదాన్ని బట్టి ఉంటుంది.
ఉదాహరణకు ఒక కత్తి ఉంది దాంతో దేనినైనా కోయొచ్చు కానీ వంటింట్లో ఉల్లిపాయలు మాత్రమే ఎందుకు వస్తాం అంటే ఆ కత్తిని మనం అక్కడి వరకే పరిమితం చేసాం. అది మన ఆలోచన స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. ఇకపోతే కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చిన సంగతి తెలిసిందే. అలానే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా చాట్ జిపిటి క్షణకాలంలో అందిస్తుంది. దీనిని ఉపయోగించుకొని డెవలప్ అవుతున్న వాళ్లు కూడా ఉన్నారు.
ఏకంగా మహానటి కే అలా చేశారు
నేను శైలజ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాతవాసి సినిమాలో ఆఫర్ వచ్చింది. కీర్తి తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా గుర్తుండిపోయే సినిమా అంటే మహానటి మాత్రమే. ఆ సినిమా ఎప్పటికీ ఒక క్లాసిక్. ఆ సినిమా తర్వాత దసరా సినిమాలో వెన్నెల అనే పాత్ర మంచి పేరు తీసుకొచ్చింది. అయితే కీర్తి సురేష్ మీద పెద్దగా కంప్లైంట్స్ లేవు. తన పరిధి మేరకు బట్టలు వేసుకుంటుంది. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కీర్తి సురేష్ ఫొటోస్ ను చాలా దారుణంగా చేశారు. తను ఇవ్వని స్టిల్స్ కూడా ఇచ్చినంత ఒరిజినల్ గా ఫొటోస్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
https://Twitter.com/AjayPrabhas_/status/1958390209219002628?t=v2bNYY8IVOfELtkGvzOzhg&s=08
మరీ బోల్డ్ గా ఉన్నాయి
మామూలుగా ఈ ఫోటోలను చూస్తే నిజమే అనిపించేలా ఉన్నాయి. కానీ తదేకంగా ఆ ఫోటోను పరిశీలించినప్పుడు అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేశారు అని అర్థమవుతుంది. కొంతమంది అయితే ఈ విషయాన్ని గమనించకుండా ఏకంగా కీర్తిని కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఇంకొంతమంది మాత్రం ట్విట్టర్లో గ్రూక్ అడిగి కన్ఫామ్ చేసుకోవడం మొదలుపెట్టారు. మొత్తానికి అవి కీర్తి ఫోటోలు కాదు అని అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. గతంలో రష్మిక మందన్న పై కూడా ఇలాంటి వీడియోలు వచ్చాయి. ఇలాంటివి ముందు ముందు రాకుండా చర్యలు కూడా తీసుకుంటారేమో వేచి చూడాలి.
Also Read: Tvk Mahanadu : TVK మహానాడు లో తొక్కిసలాట… స్పాట్ లోనే 400 మంది?