BigTV English

Viral Couple: ట్రక్‌లోనే ఇల్లు, జీవితం.. ఇలా ఉంటున్నారు ఈ దంపతులు.. సూపర్ కదా!

Viral Couple: ట్రక్‌లోనే ఇల్లు, జీవితం.. ఇలా ఉంటున్నారు ఈ దంపతులు.. సూపర్ కదా!

Viral Couple: నేటి కాలంలో డిగ్రీ, పీజీ చదివితే ఉద్యోగం దొరుకుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ, వాస్తవం పూర్తిగా భిన్నం. అందుకు నిదర్శనమే ఎంఎస్‌సీ చదివిన దీపక్ పటేల్ దంపతులు. మంచి చదువులు పూర్తిచేసుకున్నా.. ఉద్యోగం కోసం ఎక్కడెక్కడో తలుపులు తట్టినా, వారికి ఎదురైనది మాత్రం నిరాశే. అందుకే ‘ఇంతకు మించిన గౌరవం, ఆత్మస్థైర్యం ఇంకేముంటుంది?’ అని దీపక్ ట్రక్ డ్రైవింగ్ వైపు మళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.


ఎక్కడి నుంచి మొదలైందో..
ఉత్తరప్రదేశ్‌కి చెందిన దీపక్ పటేల్, ఎంఎస్‌సీ పూర్తిచేశారు. ఆయన భార్య కూడా బీఎస్సీ పూర్తిచేసింది. చదువు పూర్తి చేసిన తర్వాత మంచి ఉద్యోగం వస్తుందని కలలు కన్నారు. కానీ వాస్తవం వేరేలా మారింది. ఎన్నో ప్రైవేట్ కంపెనీలకు అప్లై చేసినా, అక్కడ ఆఫర్ చేసిన జీతం రూ. 8,000 నుండి రూ. 10,000 మధ్యే. “ఇంత తక్కువ జీతంతో ఎలా జీవించాలి?” అని ఆలోచించిన దీపక్, చివరికి కొత్త దారిని ఎంచుకున్నారు.

ట్రక్ డ్రైవింగ్ వైపు మలుపు
ఇంత చదివినా, సరైన గుర్తింపు లేకపోతే, మనమే మన మార్గం సృష్టించుకోవాలని నిర్ణయించుకున్నారు దీపక్. తన సొంతంగా ఒక ట్రక్ కొనుగోలు చేసి, ట్రక్ డ్రైవర్‌గా కెరీర్ మొదలు పెట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ట్రక్‌లోనే ఒక చిన్న ఇల్లు లా ఏర్పాట్లు చేశారు. రజాయ్, గద్దె, వంటసామాను, దుస్తులు.. ఇలా జీవనానికి అవసరమైన ప్రతీ వస్తువూ ట్రక్‌లోనే ఉంది.


ప్రయాణంలో భాగస్వామ్యం
ప్రతి ప్రయాణంలో తనకు తోడుగా ఉంటూ, భార్య కూడా ఆయనతో ట్రక్‌లోనే ఉంటోంది. ట్రక్ నడపడం కూడా ఆమె నేర్చుకుంటోంది. మేమిద్దరం కలిసి ప్రయాణిస్తాం.. కలిసి పనిచేస్తాం. జీవితానికి ఇంతకంటే మధురమైన అనుభవం ఉండదనుకుంటా అని ఆనందంగా చెబుతున్నారు దీపక్.

సమాజపు మాటలు.. ధైర్యమైన నిర్ణయం
సాధారణంగా ట్రక్ డ్రైవింగ్ అంటే చాలా మంది తక్కువగా చూస్తారు. కానీ దీపక్ భార్య మాత్రం పూర్తిగా భిన్నంగా ఆలోచించింది. మనకు సంతోషంగా ఉండాలి, అంతే. ఇతరులు ఏమనుకుంటారన్నది పట్టించుకోను. నా భర్తతో కలిసి తిరగడం, ఆయనతో కలిసి జీవించడం నాకు గర్వంగా ఉందని ఆమె చెబుతోంది.

Also Read: Viral Video: పోలీస్ స్టేషన్‌లో మహిళ అల్లరి, దాడి.. వీడియో చూసి పోలీసులు షాక్!

వైరల్ అయిన జంట
ఈ జంట వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నాయి. ఈ జంట చూపిస్తున్న జీవనశైలి చాలా మందికి కొత్త ఆలోచనలకు దారితీస్తోంది. చాలామంది ఈ దంపతుల ధైర్యాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అద్భుతం.. ఇంత చదివినా మన గౌరవాన్ని కాపాడుకోవడం గొప్ప విషయం అని ఒకరు కామెంట్ చేశారు. సంతోషం మనతోనే ఉంటుందని నిరూపించారని మరొకరు కామెంట్స్ సాగిస్తున్నారు.

దీపక్, ఆయన భార్య కథ అనేక మందికి ఒక పాఠం. సమాజం నిర్ణయించే ‘గౌరవం’ కన్నా మన సొంత సంతోషం, ఆత్మగౌరవం ఎంత ముఖ్యమో వీరి కథ చెబుతోంది. ఎవరూ చేయని పని చేస్తూ, తన భార్యను కూడా జీవిత ప్రయాణంలో భాగస్వామ్యం చేయడం దీపక్ ప్రత్యేకత. ఇప్పుడు ఈ జంటను చూసి చాలామంది యువత కొత్త కోణంలో ఆలోచిస్తున్నారు. జీవితం మనమే తీర్చిదిద్దుకోవాలి. చదువుకున్నంత మాత్రాన కలలన్నీ నెరవేరవు. కానీ కష్టపడి, ధైర్యంగా ముందుకు సాగితే అవకాశాలు మనకే వస్తాయి. దీపక్ దంపతులు చూపిస్తున్న ఈ కొత్త దారి నిజంగా స్ఫూర్తిదాయకం. చివరగా ట్విస్ట్ ఏమిటంటే.. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ఈ జంట ఇలా చేశారంటూ నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Related News

UP Man Arrested: నోరా ఫతేహిలా కనిపించాలంటూ భార్యను అలా చేసిన భర్త.. సీన్ కట్ చేస్తే..

Viral Video: 28వ అంతస్తులో ఆవు దూడ.. భలే పెంచుతున్నారే!

Viral Video: పోలీస్ స్టేషన్‌లో మహిళ అల్లరి, దాడి.. వీడియో చూసి పోలీసులు షాక్!

Golden Nurse Shark: గోల్డెన్ నర్స్ షార్క్.. ఫస్ట్ టైమ్ కనిపించింది బ్రో!

Red Rainbow: ఇదెక్కడి వింత రా మామా.. రెన్ బోకు రెడ్ కలర్ ఏంట్రా?

Big Stories

×