E-Paper
Advertisement

Online Loan Fraud: ఇన్‌స్టాగ్రామ్ లోన్ యాడ్ చూస్తున్నారా? జాగ్రత్త.. లక్ష రూపాయలు పోగొట్టుకున్న హైదరాబాద్ మహిళ!

Online Loan Fraud: ఇన్‌స్టాగ్రామ్ లోన్ యాడ్ చూస్తున్నారా? జాగ్రత్త.. లక్ష రూపాయలు పోగొట్టుకున్న హైదరాబాద్ మహిళ!
Advertisement

Online Loan Fraud: ఆన్‌లైన్ లోన్ల పేరుతో అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన బోచు అరుణ్, గడ్డం భరత్, సామర్ల తిరుపతి, వెల్పుగొండ తరుణ్, చుక్క శ్యామ్ అనే ఐదుగురు నిందితులు ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. చదువు మధ్యలో ఆపేసి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో వీరు ఈ దారి ఎంచుకున్నారు. కోల్‌కతా, ఢిల్లీ కేంద్రాలుగా ‘ముద్రా లోన్ సర్వీసెస్’ పేరుతో వీరు నెట్‌వర్క్ నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో లోన్ ప్రకటన చూసి క్లిక్ చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. మరుసటి రోజే ఆమెకు నిందితుల్లో ఒకరైన కిలా పవన్ కుమార్ ఫోన్ చేసి, ముద్రా లోన్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. రూ. 3 లక్షల లోన్ మంజూరైందని నమ్మబలికిన నిందితులు, ప్రాసెసింగ్ ఫీజు లేదని చెబుతూనే ఇన్సూరెన్స్, TDS, ఇన్‌కమ్ టాక్స్ ఛార్జీల పేరుతో బాధితురాలి నుండి మొత్తం రూ. 1,08,274 కాజేశారు. చివరికి మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

ఈ ముఠాకు కోల్‌కతాలో ‘కృష్ణ అలియాస్ కిట్టు’ అనే మేనేజర్ ఆశ్రయం కల్పించి, జనాలను ఎలా మోసం చేయాలో శిక్షణ ఇచ్చేవాడని పోలీసులు వెల్లడించారు. వీరు ప్రతిరోజూ 180 నుండి 200 కాల్స్ చేస్తూ డేటా ఆధారంగా బాధితులను వేటాడుతుంటారు. వసూలైన మొత్తంలో ఈ ఐదుగురు నిందితులకు కృష్ణ 30 శాతం కమిషన్ ఇచ్చేవాడు. సోషల్ మీడియాలో వచ్చే తక్కువ వడ్డీ లోన్ ప్రకటనలను నమ్మి వ్యక్తిగత వివరాలు షేర్ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Read Also: Dharmapuri Arvind: తెలంగాణలో జనసేనతో పొత్తు లేదు.. పవన్ ఇంకెప్పుడు వస్తారు?, ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×