Akkineni Hero: అక్కినేని కుటుంబం అంటేనే అందులో హీరోలందరూ ఎక్కువగా రొమాంటిక్ సినిమాలు చేస్తారు అన్న విషయం తెలిసిందే. నాగేశ్వరరావు దగ్గర నుంచి నాగచైతన్య వరకు రొమాంటిక్ హీరోస్ కానీ పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా నాగార్జున.. తన కాలంలో రొమాంటిక్ హీరోగా మంచి పేరు సంపాదించారు. ఆయనను మన్మథుడు అని కూడా పిలుస్తారు. ఇప్పుడు అదే మార్గంలో ఆయన కుమారుడు నాగచైతన్య కూడా ప్రేమ కథా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
నాగచైతన్య కెరీర్‌లో విజయవంతమైన చిత్రాల్లో ఎక్కువగా ప్రేమ కథలే ఉన్నాయి. ఏం మాయ చేశావె, 100 శాతం లవ్, మనం, మజిలి, లవ్ స్టోరీ వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. నిజ జీవితంలో కూడా ఆయన ప్రేమ కథలు వార్తల్లో నిలిచాయి. ముందుగా సమంతను ప్రేమించి వివాహం చేసుకున్నారు. తరువాత ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత శోభిత.. కొత్త జీవితం ప్రారంభించారు.
కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్య తన మొదటి సెలబ్రిటీ క్రష్ గురించి వెల్లడించారు. మాజీ విశ్వసుందరి సుస్మిత సేన్ తన ఫస్ట్ క్రష్ అని చెప్పారు. ఆమె అందం.. వ్యక్తిత్వం తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సుష్మితా సేన్ గతంలో నాగార్జునతో కలిసి ఒక చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో వారు జంటగా కనిపించారు. ఒకప్పుడు తన తండ్రితో తెరపై ప్రేమ కథలో నటించిన హీరోయిన్ పై తనకు క్రష్ ఉండేదని నాగచైతన్య చెప్పడం ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం నాగచైతన్య తండేల్ విజయానంతరం కొత్త చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న వృషకర్మ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ALSO READ: Sreeleela: శ్రీలీల కాదు.. ఇకమీదట డాక్టర్ శ్రీలీల..!