Traffic Advisory: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రం మార్చి 19న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మార్చి 15వ తేది, ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను (Pre Release Event) మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్ (1st బెటాలియన్) వేదికగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ వేడుక జరగనుంది. ఈ క్రమంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ దృష్ట్యా కీలకమైన ట్రాఫిక్ అడ్వైజరీ (Traffic Advisory)ని జారీ చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఆ పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ క్రింది సూచనలు పాటించాలని కోరారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ట్రాఫిక్ అడ్వైజరీ ఇదే..
Also Read- Anchor Ravi Sreeleela: శ్రీ లీలకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన యాంకర్ రవి..అన్నయ్యా అంటూ పరువు తీసిన నటి!
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు నుంచి కేవీబీఆర్ (కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి) స్టేడియం వైపు వెళ్లే వాహనాలను కృష్ణానగర్ జంక్షన్ వద్ద శ్రీనగర్ కాలనీ – పంజాగుట్ట వైపు మళ్లించనున్నారు.
మైత్రీవనం జంక్షన్ నుండి జూబ్లీహిల్స్, మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలను యూసఫ్‌గూడ బస్తీ వద్ద ఆర్బీఐ క్వార్టర్స్ – కృష్ణానగర్ జంక్షన్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు మళ్లించనున్నారు.
మైత్రీవనం నుండి బోరబండ బస్టాప్ వైపు వెళ్తే వాహనాలు సవేరా ఫంక్షన్ హాల్ – కృష్ణకాంత్ పార్క్ – జీటీఎస్ టెంపుల్ – కళ్యాణ్ నగర్ – మోతీ నగర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
బోరబండ నుండి మైత్రీవనం వెళ్లే ప్రయాణికులు ప్రైమ్ గార్డెన్ – మిడ్‌ల్యాండ్ బేకరీ – జీటీఎస్ కాలనీ – కళ్యాణ్ నగర్ జంక్షన్ – ఉమేష్ చంద్ర స్టాచ్యూ మీదుగా మైత్రీవనం వెళ్లాలని తెలిపారు.
Also Read- Ustaad Bhagat Singh Trailer: ఆ వార్నింగ్ విలన్‌కా? వైసీపీకా?.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ రివ్యూ
ఇక ఈ ఈవెంట్‌కు వచ్చే వారు తమ వాహనాలను పార్కింగ్ చేసే స్థలాల వివరాలను కూడా ఇందులో తెలిపారు. ఈవెంట్‌కు వచ్చే సాధారణ ప్రజల కోసం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు.
జానకమ్మ తోట పార్కింగ్, యూసఫ్‌గూడ (ద్విచక్ర మరియు నాలుగు చక్రాల వాహనాలు)
మెట్రో పార్కింగ్, యూసఫ్‌గూడ (ద్విచక్ర మరియు నాలుగు చక్రాల వాహనాలు)
సవేరా ఫంక్షన్ హాల్ (కేవలం నాలుగు చక్రాల వాహనాల కోసం)
మహమూద్ ఫంక్షన్ హాల్ (కేవలం నాలుగు చక్రాల వాహనాల కోసం)
ఈ ఈవెంట్ నిమిత్తం ఆదివారం సాయంత్రం వేళల్లో కేవీబీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, సామాన్య ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.