E-Paper
Advertisement

Raashi Khanna: సినిమా ఖన్నా ఓటీటీ మేలు అనుకుంటారు.. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల వేల హీరోయిన్ కీలక వ్యాఖ్యలు..!

Raashi Khanna: సినిమా ఖన్నా ఓటీటీ మేలు అనుకుంటారు.. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల వేల హీరోయిన్ కీలక వ్యాఖ్యలు..!
Advertisement

Raashi Khanna:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో శ్రీలీలతో పాటు రాశి ఖన్నా కూడా కీలక పాత్రలో కనిపించనుంది. మార్చి 19న ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. విడుదలకు ముందు చిత్రబృందం ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్లలో భాగంగా రాశి ఖన్నా ఇచ్చిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమా కంటే ఓటీటీ బలపడుతోంది?

ఒక ఇంటర్వ్యూలో రాశి ఖన్నా మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడింది. ప్రపంచ పరిస్థితులు, యుద్ధ భయాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రజల ఖర్చులపై ప్రభావం చూపుతున్నాయని ఆమె చెప్పింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు పెద్ద సినిమాలు తప్ప చిన్న సినిమాలకు థియేటర్లకు రావడం తగ్గిందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.

Advertisement

ఆమె మాట్లాడుతూ..”ఇప్పటి పరిస్థితుల్లో సినిమా చూడటం అనేది చాలామందికి ఒక లగ్జరీలా మారింది. ప్రజలు అవసరమైన ఖర్చులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే చిన్న మరియు మధ్యస్థాయి సినిమాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. భవిష్యత్తులో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ మరింత బలపడే అవకాశం ఉంది” అని రాశి ఖన్నా తెలిపింది.

ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ అంచనాలు

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే, ఇది పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మరో భారీ చిత్రం. గతంలో వచ్చిన “గబ్బర్ సింగ్” బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

టికెట్ ధరల పెంపు

Advertisement

ఈ సినిమా విడుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు కూడా ఇచ్చింది. విడుదల రోజు ఉదయం 4 లేదా 5 గంటల నుంచే బెనిఫిట్ షోలు నిర్వహించడానికి అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఈ బెనిఫిట్ షోలకు టికెట్ ధరను సుమారు రూ.500గా నిర్ణయించారు. అంతేకాకుండా మొదటి 10 రోజులు థియేటర్లలో టికెట్ ధరలను పెంచుకునేందుకు కూడా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవైపు భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన “ఉస్తాద్ భగత్ సింగ్”, మరోవైపు రాశి ఖన్నా చేసిన ఓటీటీపై వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమా విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలా స్పందన వస్తుందో చూడాలి.

ALSO READ: Allu Arjun: అల్లు అర్జున్ 42 నిబంధనలు నిజమేనా…హాట్ టాపిక్ గా మారిన వీడియో!  

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×