E-Paper
Advertisement

Jio Recharge Plans: రూ.799 ప్లాన్‌పై సందేహాలు.. జియో కీలక ప్రకటన.. యూజర్లకు పండుగే!

Jio Recharge Plans: రూ.799 ప్లాన్‌పై సందేహాలు.. జియో కీలక ప్రకటన.. యూజర్లకు పండుగే!
Advertisement

Jio Recharge Plans: జియోలో బాగా పాపులర్ అయిన ప్లాన్ లలో రూ.799 రీఛార్జ్ ప్లాన్ ఒకటి. అయితే ఈ ప్లాన్ ను అర్ధాంతరంగా జియో నిలిపివేసిందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే కుదరడం లేదని పలువురు నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో జియో తాజాగా స్పందించింది. రూ.799 రీఛార్జ్ ప్లాన్ పై మరోమారు స్పష్టత ఇచ్చింది.

జియో ఏం చెప్పిందంటే?

జియో తన ఎంట్రీ లెవెల్ ప్లాన్ రూ.209, రూ.249 ను తొలిగించిన క్రమంలో రూ.799 రీఛార్జ్ ప్లాన్ సైతం డీయాక్టివేట్ చేసిందన్న ప్రచారం మెుదలైంది. పలుమార్లు దీనిపై క్లారిటీ ఇచ్చినప్పటికీ ప్రచారం ఆగడం లేదు. ఈ క్రమంలో మళ్లీ పుకార్లు ఊపందుకోగా రూ.799 రీఛార్జ్ ప్లాన్ పై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని మరోమారు కంపెనీ వర్గాలు కొట్టిపారేశాయి. ఈ ప్లాన్ తొలగించడం లేదా డీయాక్టివేట్ చేయడం వంటివి జరగలేదని పేర్కొన్నాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి ఫ్లాట్ ఫామ్స్ లోకి వెళ్లి ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవచ్చని సూచించాయి. యూజర్ల అవసరానికి అనుగుణంగా ప్లాన్స్ అందించేందుకు జియో ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశాయి. కాగా రూ.799 రీఛార్జ్ ప్లాన్ యాక్టివ్ గానే ఉందని తెలిసి.. జియో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రూ.799 ప్లాన్ ప్రయోజనాలు..

Advertisement

ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. రోజుకు 1.5 GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. వీటితో పాటు జియో టీవీ (JioTV), జియో సినిమా (JioCinema) జియో క్లౌడ్ (JioCloud) వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్ కూడా పొందవచ్చు. బడ్జెట్ లో డేటాతో పాటు వినోదాన్ని కోరుకునేవారికి ఇది బెస్ట్ ప్లాన్ గా చెప్పవచ్చు.

Also Read: Induction Stove Sales: గ్యాస్ కొరత ఎఫెక్ట్.. రికార్డ్ స్థాయిలో ఇండక్షన్ స్టవ్ సేల్స్.. 24 గంటల్లో ఎంతంటే!

జియో తొలగించిన ప్లాన్స్

Advertisement

రిలయన్స్ జియో గతేడాది ఆగస్టులో తన ప్లాన్లలో కొన్ని కీలక మార్పులు చేసింది. ఈ క్రమంలోనే అప్పటివరకూ బాగా పాపులర్ అయిన రూ. 209, రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ నుండి తొలగించింది. ఈ ప్లాన్స్ ప్రయోజనాల విషయానికి వస్తే.. రూ. 209 ప్లాన్ యూజర్లకు 22 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1 GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు అందించేది. అలాగే రూ. 249 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1GB డేటా, ఫ్రీ కాల్స్, 100 ఎస్ఎంఎస్ లు అందిచేంది.

Also Read: Induction Stove: క్రేజీ ఇండక్షన్ స్టవ్.. నచ్చిన ఆహారాన్ని.. ఏ గిన్నె పెట్టైనా వండేయచ్చు!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×