E-Paper
Advertisement

Naveen polishetty: ఆ హీరో పెళ్లి జరిగిన మరుసటిరోజే నా పెళ్లి: నవీన్ పోలిశెట్టి

Naveen polishetty: ఆ హీరో పెళ్లి జరిగిన మరుసటిరోజే నా పెళ్లి: నవీన్ పోలిశెట్టి
Advertisement

Naveen Polishetty:  టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంటున్న వారిలో నటుడు నవీన్ పోలిశెట్టి(Naveen polishetty) ఒకరు. విభిన్నమైన కామెడీ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. త్వరలోనే నవీన్ పోలిశెట్టి మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. నవీన్ పోలిశెట్టి హీరోగా మారి దర్శకత్వంలో తెరికెక్కిన చిత్రం అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju). ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీ విడుదల చేయబోతున్నారు.

పెళ్లి రిసెప్షన్..

ఇలా సంక్రాంతి బరిలో స్టార్ హీరోలకు పోటీగా నవీన్ పోలిశెట్టి సినిమా కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదలకు మరి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే తాజాగా చిత్ర బృందం “పెళ్లి రిసెప్షన్” పేరుతో ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నవీన్ పోలిశెట్టి పెళ్లికి సంబంధించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇలా తన పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో నవీన్ పోలిశెట్టి ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)పెళ్లితోనే ముడి పెట్టారు.

Advertisement

Also Read; The Raja Saab: ది రాజా సాబ్ మూవీపై కుట్రలు… మారుతిపై ప్రతీకారమేనా?

ప్రభాస్ పెళ్లి తరువాతే నా పెళ్లి..

ఈ సందర్భంగా నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ..”ప్రభాస్ అన్న ఏ రోజు అయితే పెళ్లి చేసుకుంటారో ఆ మరుసటిరోజే నేను కూడా పెళ్లి చేసుకుంటా” అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో అభిమానులు కూడా విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే నిత్యం ప్రభాస్ తన పెళ్లి గురించి వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ ఇప్పటివరకు పెళ్లి చేసుకొని నేపథ్యంలో ఈయన పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.

Advertisement

ప్రభాస్ పెళ్లితో ముడిపెట్టిన నవీన్ పోలిశెట్టి..

ఇటీవల ది రాజా సాబ్ సినిమా వేడుకలో భాగంగా పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలో తెలియక ఇన్నేళ్లు పెళ్లి చేసుకోలేదు అంటూ తనదైన శైలిలోనే సమాధానం ఇచ్చారు. ఇప్పుడు నవీన్ పోలీశెట్టి సైతం ప్రభాస్ పెళ్లి చేసుకునే వరకు తాను కూడా పెళ్లి చేసుకోనని చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. అనగనగా ఒక రాజు సినిమా ఫ్యామిలీ వెడ్డింగ్ నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా చిత్ర బృందం సైతం పెళ్లి రిసెప్షన్ అంటూ సరికొత్తగా ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టికి జోడిగా మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Also Read: Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజు రన్ టైం లాక్.. నిడివి ఎంతంటే?

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×