E-Paper
Advertisement

Sweekriti Controversy: అల్లు అర్జున్‌పై వైరల్ వీడియో తర్వాత స్వీకృతి పోస్ట్ వైరల్.. బాబోయ్ అలా అనేసిందేంటి..

Sweekriti Controversy: అల్లు అర్జున్‌పై వైరల్ వీడియో తర్వాత స్వీకృతి పోస్ట్ వైరల్.. బాబోయ్ అలా అనేసిందేంటి..

Sweekriti Controversy: సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి చేసే విశ్లేషణలు ఒక్కోసారి ఎంతటి వివాదానికి దారితీస్తాయో చెప్పడానికి తాజా ఉదాహరణే ఈ ఘటన. ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ స్వీకృతి (Sweekriti), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. కొద్దిరోజుల క్రితం స్వీకృతి తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను అప్‌లోడ్ చేశారు. అందులో ఒక అతిథితో కలిసి అల్లు అర్జున్‌కు సంబంధించిన కొన్ని అంశాలను చర్చించారు. అయితే, ఆ వీడియో వైరల్ కావడంతో అల్లు అర్జున్ అభిమానుల నుండి, అలాగే కొన్ని పిఆర్ (PR) వర్గాల నుండి ఆమె తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, ఆమె ఆ వీడియోను తన ఛానల్ నుండి తొలగించి, దానికి గల కారణాలను వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో వరుస పోస్ట్‌లు పెట్టారు.

Read also-Allu Arjun : అల్లు అర్జున్ పై ఆరోపణలు..నమ్మలేని నిజాలను బయటపెట్టిన ‘పుష్ప’ నటుడు..!

స్వీకృతి ఆరోపణలు

స్వీకృతి తన పోస్ట్‌లలో ప్రధానంగా ఏం చెప్పారంటే?.. వీడియోలో పాల్గొన్న తన గెస్ట్ ఒక ప్రతిష్టాత్మక సంస్థలో ఉన్నత పదవిలో ఉన్నారని, ఆన్‌లైన్ వేధింపుల వల్ల ఆమె వృత్తిపరమైన జీవితం (Career) దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే వీడియోను తొలగించినట్లు ఆమె పేర్కొన్నారు. తనపై, తన అతిథిపై ఒక పద్ధతి ప్రకారం నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయని, ఇవన్నీ పెయిడ్ పిఆర్ టీమ్స్, బాట్ అకౌంట్ల ద్వారా జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. అల్లు అర్జున్ టీమ్ పట్ల ఆమె తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. “అల్లు అర్జున్, అతని టీమ్ అధికార దాహంతో ఉన్నారని” ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.

Read also-Anchor Sravanthi: అల్లు అర్జున్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన యాంకర్.. ఏం జరిగిందంటే?

సోషల్ మీడియా స్పందన

ఈ ఘటనపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం స్వీకృతికి మద్దతుగా నిలుస్తూ, ఇంటర్నెట్‌లో ఒక మహిళ తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక వర్గం, ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు, కావాలనే తమ హీరో ఇమేజ్‌ను దెబ్బతీయడానికి ఇలాంటి వీడియోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేటి డిజిటల్ యుగంలో ‘వైరాలిటీ’ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఏదైనా విషయం వైరల్ అయినప్పుడు వచ్చే గుర్తింపుతో పాటు, అదే స్థాయిలో విమర్శలు, వేధింపులు కూడా వస్తాయి. ఒక కంటెంట్ క్రియేటర్‌గా తను చెప్పాలనుకున్న వాస్తవాలను చెప్పానని స్వీకృతి అంటుండగా, అధికార బలం ఉపయోగించి తన నోరు నొక్కేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ వివాదం టాలీవుడ్ పిఆర్ కల్చర్, ఆన్‌లైన్ బుల్లీయింగ్‌పై మరోసారి చర్చకు దారితీసింది. మరి ఈ వివాదం ఎక్కడి వరకూ దారి తీస్తుందో చూడాలి మిరి.

Related News

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

Big Stories

×