E-Paper
Advertisement

సితార మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్.. కార్తీ – కళ్యాణ్ శంకర్ సినిమా గ్రాండ్ లాంచ్!

సితార మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్.. కార్తీ – కళ్యాణ్ శంకర్ సినిమా గ్రాండ్ లాంచ్!
Advertisement

Karthi Kalyan: కార్తీ..కోలీవుడ్ లోనే కాకుండా,టాలీవుడ్ లోనూ మాంచి క్రేజ్ ఉన్న ఈ స్టార్ హీరో ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్‌తో జతకట్టారు.అవును..’మ్యాడ్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద నవ్వుల జల్లు కురిపించి యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్.. ఇప్పుడు కార్తీని డైరెక్ట్ చేసే ఛాన్స్ పట్టేశాడు.వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ నేడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో భారీ ప్రాజెక్ట్

Advertisement

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’, ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రోజు నేడు జరిగిన ప్రారంభోత్సవంలో సినిమా యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ALSO READ :నితిన్ మార్కెట్ అవుట్? భారీ బడ్జెట్‌తో రిస్క్ చేయలేక దర్శకుడికి షాక్!

Advertisement

కార్తీ సరసన మీనాక్షి చౌదరి.. 

ఇక ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న మీనాక్షి, కార్తీ సరసన నటిస్తుండటం ప్రాజెక్టుపై మరిన్ని అంచనాలు పెంచేదే. వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై ఎలా ఉండబోతుందోనన్న క్యూరియాసిటీ అప్పుడే మూవీ లవర్స్ లో కనిపిస్తుంది కూడా.

మ్యాడ్ హ్యూమర్ – కార్తీ మార్క్ యాక్షన్ 

ఇక డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ విషయానికి వస్తే గత సినిమాలు ‘మ్యాడ్’ మరియు ‘మ్యాడ్ స్క్వేర్’తో సూపర్ హిట్స్ అందుకున్న సంగతి తెల్సిందే. ఇక తనదైన న్యాచురల్ యాక్టింగ్ తో కార్తీ సిల్వర్ స్క్రీన్ పై ఎలా చెడుగుడు ఆడేస్తాడో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కామెడీ మరియు ఎమోషనల్ సీన్స్‌లో కార్తీ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్.మరి ఈ ఇద్దరు కలిశారంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు

త్వరలోనే సెట్స్ పైకి..

ఇక ఈరోజే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా,త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనుందని తెలుస్తుంది.ఇక సినిమా టైటిల్ మరియు ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.ఇప్పటికే కార్తీ నటించిన ఊపిరి, ఖైదీ వంటి సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఈ స్ట్రెయిట్ తెలుగు సినిమాపై అంచనాలు భారీగానే పెరిగిపోయాయ్.చూడాలి మరి నవ్వుల నజరానా ఖాయం అంటున్న ఈ కాంబో ఎలాంటి అవుట్ పుట్ ని డెలివర్ చేస్తుందో !

ALSO READ :ఇండస్ట్రీ నుంచి క్లీన్ స్వీప్.. పోసానిని దూరం పెట్టిన మేకర్స్.. కారణం అదేనా?

Related News

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

Big Stories

Advertisement
×