E-Paper
Advertisement

ముంబయి పుచ్చకాయ మరణాల మిస్టరీ వీడింది.. అసలు కారణం ఇదే

ముంబయి పుచ్చకాయ మరణాల మిస్టరీ వీడింది.. అసలు కారణం ఇదే
Advertisement

Mumbai family watermelon death: ముంబయిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు పుచ్చకాయ తిన్న తర్వాత ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. మొదట పుచ్చకాయ కల్తీ లేదా ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఈ మరణాలు సంభవించాయని అంతా భావించారు. అయితే ఈ విషాద ఘటనపై తాజాగా ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించిన నిజాలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ఆ కుటుంబం మృతికి పుచ్చకాయ కల్తీ కారణం కాదని.. వారి శరీరంలోకి అత్యంత ప్రమాదకరమైన ‘ఎలుకల మందు’ చేరడం వల్లే ప్రాణాలు పోయాయని ఫోరెన్సిక్ నివేదికలో తేలింది.

దక్షిణ ముంబయికి చెందిన అబ్దుల్లా డోకాడియా (44).. అతడి భార్య నస్రీన్‌ (35).. కుమార్తెలు అయేషా (16).. జైనేబ్‌ (13) మృతదేహాలను పరీక్షించిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. వీరి మృతదేహాల్లో ఎలుకలను చంపడానికి వాడే ‘జింక్ ఫాస్ఫైడ్’ అవశేషాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది. దీంతో ఇన్నాళ్లూ పుచ్చకాయపై జరిగిన దుష్ప్రచారం తప్పని తేలిపోయింది. అయితే ఈ విషం పుచ్చకాయలోకి ఎలా చేరిందన్నది ఇప్పుడు అతిపెద్ద మిస్టరీగా మారింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పుచ్చకాయలో విషం కలిపారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

ఘటన జరిగిన రోజు వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 25వ తేదీ రాత్రి అబ్దుల్లా కుటుంబం తమ బంధువులతో కలిసి విందు ఏర్పాటు చేసుకుంది. అతిథులంతా వెళ్ళిపోయిన తర్వాత అర్ధరాత్రి దాటాక కుటుంబ సభ్యులంతా కలిసి పుచ్చకాయ ముక్కలు తిన్నారు. ఆ మరుసటి రోజు తెల్లవారుజాము నుంచి వారందరికీ తీవ్రమైన వాంతులు.. విరేచనాలు మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒకరి తర్వాత ఒకరు నలుగురూ మరణించారు. అప్పట్లో ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో జనం పుచ్చకాయలు తినాలంటేనే భయపడిపోయారు.

ప్రస్తుతం జేజే మార్గ్ పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడేంత బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న దిశగా బంధువులు.. ఇరుగుపొరుగు వారిని విచారించారు. అయితే ఇప్పటి వరకు అటువంటి ఆధారాలేవీ లభించలేదు. దీంతో ఎవరైనా కావాలనే పుచ్చకాయలో విషం ఎక్కించారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా పోలీసులు తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నివేదికతో కనీసం పుచ్చకాయ అమ్మే వ్యాపారులు.. సామాన్య ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగిపోయాయి.

Advertisement

Read Also: వేస్ట్ అనుకుంటున్నారా? ప్లాస్టిక్ బాటిళ్లతో మీ ఇంటికి అదిరిపోయే లుక్ తెచ్చేయండిలా!

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×