E-Paper
Advertisement

Itlu Arjuna: ఇంకా ఏం లేకుండానే.. ఈ రేంజ్‌లో ఎలివేషన్స్ ఏంటో?

Itlu Arjuna: ఇంకా ఏం లేకుండానే.. ఈ రేంజ్‌లో ఎలివేషన్స్ ఏంటో?
Advertisement

Itlu Arjuna: ఇండస్ట్రీకి కొత్త హీరో వస్తున్నాడంటే అతనిలో ఉన్న సత్తా ఏంటో ప్రేక్షకులకు తెలిసే వరకు కాస్త ఓపిక పట్టాలి. అలా కాకుండా తురుము, తోపు అంటూ ముందే ఎలివేషన్స్ వేసుకుని, తీరా సినిమా రిలీజయ్యాక విషయం లేకపోతే.. ఆ హీరోకి మళ్లీ అవకాశం కూడా రాదు. ఇదంతా చెబుతుంది ఎవరి గురించో కాదు.. ఇటీవల న్యూ గై ఇన్ టౌన్’ అంటూ హడావుడి చేసిన ‘ఇట్లు అర్జున’ (Itlu Arjuna) మూవీ హీరో అనిష్ (Aniesh) గురించే. ఆయన బర్త్‌డేని పురస్కరించుకుని చిత్రాన్ని నిర్మిస్తున్న వెంకీ కుడుముల ఓ వీడియోను వదిలారు. అందులో హీరోకు మాములుగా ఎలివేషన్స్ ఇవ్వడం లేదు. వెంకీ కుడుముల ‘ఇట్లు అర్జున’ అనే సినిమాతో నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు. వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఆయన నిర్మిస్తోన్న మొదటి సినిమా ఇది. ఇటీవల ‘న్యూ గై ఇన్ టౌన్’ అని అర్భాటం చేసి, ఫైనల్‌గా ఇందులో అనిష్ హీరోగా నటిస్తున్నట్లుగా తెలుపుతూ ఓ వీడియోను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే.

Also Read- Peddi Movie: ‘పెద్ది’ సెట్స్‌లో రామ్ చరణ్.. సందడి సందడిగా టీమ్.. విషయమిదే!

ఫైండింగ్ అర్జున వాల్యూమ్ 1

Advertisement

అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ ఇచ్చిన టైటిల్ గ్లింప్స్‌తో వచ్చిన ఈ వీడియో మంచి స్పందననే రాబట్టుకుంది. ఈ సినిమా మహేష్ ఉప్పల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ‘ఛాంపియన్’ ఫేమ్ అనస్వర రాజన్ హీరోయిన్ నటిస్తోంది. ఇక హీరో అనిష్ పుట్టిన సందర్భంగా మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్, వీడియోను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లోనూ, అలాగే ఇంతకు ముందు వచ్చిన వీడియో లోనూ అనీష్ కూల్ అండ్ చార్మింగ్‌గానే కనిపించారు. ఇప్పుడు కొత్తగా విడుదలైన వీడియోతో మేకర్స్ ఆ పాత్ర వెనుక ఉన్న యాక్టర్ పై ఫోకస్ చేశారు. ఫైండింగ్ అర్జున వాల్యూమ్ 1 అంటూ వచ్చిన ఈ వీడియోలో ఒక క్యారెక్టర్‌ను పరిచయం చేయడమే కాదు, ఆ క్యారెక్టర్‌లోకి వెళ్ళడానికి అనీష్ చూపించిన కమిట్మెంట్ మైండ్‌సెట్‌ను ఆవిష్కరించారు.

Also Read- Prabhas : జియోహాట్ స్టార్ కు బిర్యానీ ఆర్డర్లు… ప్రభాస్ ఫ్యాన్స్ అనిపించుకున్నారు కదరా బాబు!

ఎలివేషన్స్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చేయండి

Advertisement

అర్జున్ మూగవాడు, సంభాషణలపై ఆధారపడకుండా, పూర్తిగా బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ డెప్త్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సిన పాత్ర ఇది. కొత్త నటుడికి నిజంగా ఇది పెద్ద సవాలే. కానీ అనీష్ దీన్ని ఒక సవాలుగా కాకుండా, తన నటనా పరిధిని విస్తరించుకునే అవకాశంగా స్వీకరించాడంటూ వెంకీ కుడుమల చెబుతున్నారు. ఆడిషన్ సమయంలోనే అనీష్ టీమ్‌ను ఇంప్రెస్ చేయడం, పాత్రను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత కూడా అదే ఉత్సాహంతో ముందుకు రావడం వీడియోలో చూపించారు. ఆ తర్వాత అతడు ప్రత్యేకంగా ప్రిపరేషన్ దశను పూర్తి చేశాడని, అర్జున్ ఎమోషనల్ జర్నీని లోతుగా అధ్యయనం చేయడం, షూటింగ్‌కి ముందే పాత్రను ఇంటర్నల్‌గా స్వీకరించడం వంటి వన్నీ అతని కమిట్‌మెంట్‌ను చాటిచెబుతున్నాయని వెంకీ కుడుమల ఇందులో ఎలివేషన్స్ ఇస్తున్నారు. అయితే ఈ వీడియోకు నెటిజన్లు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటో తెలియకుండానే, విడుదల కాకుండానే ఎందుకింత ఎలివేషన్స్? ఒక పని చేయండి.. ముందే ఎలివేషన్స్ స్టార్ అని ట్యాగ్ ఇచ్చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read- Thriller Movie OTT : ఫ్యామిలీ ఫ్యామిలీ అలాంటి వాళ్ళే… ఒక్కో ట్విస్ట్ కి మైండ్ బ్లాక్… బుర్ర బుర్రబద్దలయ్యే క్లైమాక్స్

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×