E-Paper
Advertisement

‘ఉప్పెన’లో విజయ్ సేతుపతి పాత్ర మిస్ చేసుకున్న నటుడు ఎవరో తెలుసా?.. బుచ్చి గేట్ వరకూ వచ్చి..

‘ఉప్పెన’లో విజయ్ సేతుపతి పాత్ర మిస్ చేసుకున్న నటుడు ఎవరో తెలుసా?.. బుచ్చి గేట్ వరకూ వచ్చి..
Advertisement

Uppena Role Reveal: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా పరిశ్రమకు పరిచయమై, మొదటి సినిమా ‘ఉప్పెన’తోనే సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సన. ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సరసన ‘పెద్ది’ (Peddi) అనే మైలురాయి లాంటి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ గ్రామీణ నేపథ్య సినిమాలో విలక్షణ నటుడు జగపతి బాబు ‘అప్పలసూరి’ అనే ఒక అత్యంత శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న జగ్గుభాయ్, దర్శకుడు బుచ్చిబాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ‘ఉప్పెన’ సినిమాలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి చేసిన రాయనమ్ క్యారెక్టర్ మొదట తనకే దక్కాల్సిందని ఆయన వెల్లడించారు. అంతే కాకుండా మంచి పాత్ర ఒదులుకున్నానన్నారు.

Read also-నాగచైతన్య ‘వృషకర్మ ‘ రిలీజ్ డేట్ లాక్.. టైం చూసి దిగితున్నాడే..!

గేట్ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిన బుచ్చిబాబు!

Advertisement

‘ఉప్పెన’ సినిమా కథా చర్చల సమయంలో జరిగిన ఒక క్రేజీ ఇన్సిడెంట్‌ను జగపతి బాబు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. “ఒకరోజు బుచ్చిబాబు నాకు ఫోన్ చేసి, సార్ ఒక అద్భుతమైన కథ ఉంది, మీకు చెప్పడానికి వస్తున్నాను అన్నాడు. నేను సరే రమ్మని వెయిట్ చేస్తున్నా. కొద్దిసేపటికి మళ్ళీ ఫోన్ చేసి, సార్ మీ ఇంటి గేట్ దగ్గరే ఉన్నాను, లోపలికి వస్తున్నాను అన్నాడు. కానీ, అంతలోనే సడన్‌గా మళ్ళీ ఫోన్ చేసి.. ‘సార్, క్షమించండి.. హీరో అర్జున్ (వైష్ణవ్ తేజ్)తో ఏదో అర్జెంట్ పని పడింది, నేను వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని మళ్ళీ వచ్చి కలుస్తాను’ అని చెప్పి వెళ్ళిపోయాడు” అని జగపతి బాబు చెప్పారు. ఆ తర్వాత బుచ్చిబాబు తన మైండ్‌లో క్యారెక్టరైజేషన్‌ను మార్చుకుని, ఆ పాత్రను విజయ్ సేతుపతితో చేయించాడని జగ్గుభాయ్ వివరించారు.

ఆ నిర్ణయమే కరెక్ట్!

ఆ సమయంలో ఒక మంచి దర్శకుడి సినిమాను మిస్ అయ్యానే అని కొంచెం బాధపడ్డానని జగపతి బాబు ఒప్పుకున్నారు. అయితే, ఆ నిర్ణయం పట్ల తనకు బుచ్చిబాబుపై ఎలాంటి కోపం రాలేదని స్పష్టం చేశారు. “ఆ రోజు ఆ పాత్రకు విజయ్ సేతుపతిని ఎంచుకోవడమే కరెక్ట్ నిర్ణయం. ఎందుకంటే అప్పట్లో నాకంటే విజయ్ సేతుపతికి ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలోనూ చాలా పెద్ద మార్కెట్ ఉంది. సినిమా బిజినెస్ పరంగా, క్రేజ్ పరంగా బుచ్చిబాబు తీసుకున్న నిర్ణయం సరైనదే” అని జగపతి బాబు చాలా ప్రాక్టికల్‌గా మాట్లాడారు.

Advertisement

Read also-జూన్‌ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న నాలుగు క్రేజీ టాలీవుడ్ చిత్రాలు ఇవే!..

‘పెద్ది’తో అంతకంటే పెద్ద గిఫ్ట్!

అప్పట్లో ‘ఉప్పెన’ సినిమా చేజారినప్పటికీ, బుచ్చిబాబు మాత్రం జగపతి బాబును తన మైండ్‌లోనే ఉంచుకున్నాడు. ‘పెద్ది’ సినిమా స్క్రిప్ట్ సిద్ధమయ్యాక, దాదాపు 15 మంది నటులను పరిశీలించిన తర్వాత, చివరకు అప్పలసూరి పాత్రకు జగపతి బాబే కరెక్ట్ అని బుచ్చిబాబు ఆయన దగ్గరకు వచ్చాడు. “బుచ్చిబాబు నా కోసం ఎంతో ఓపిగ్గా వెయిట్ చేసి, ‘ఉప్పెన’ కంటే వంద రెట్లు శక్తివంతమైన ‘అప్పలసూరి’ పాత్రను నాకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. నా కెరీర్‌లో నేను చేసిన బెస్ట్ 6 పాత్రలలో ఇది ఖచ్చితంగా నిలిచిపోతుంది” అని జగపతి బాబు ఎంతో గర్వంగా చెప్పుకొచ్చారు.

దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా సమయం నుంచే బుచ్చిబాబుతో తనకు మంచి ఫ్రెండ్‌షిప్ ఉందని, బుచ్చిబాబు చాలా ఎమోషనల్ పర్సన్ అని జగ్గుభాయ్ కొనియాడారు. మొత్తానికి ‘ఉప్పెన’లో మిస్ అయిన కాంబినేషన్, ఇప్పుడు ‘పెద్ది’ రూపంలో అంతకంటే భారీ స్థాయిలో థియేటర్లలో విజువల్ ట్రీట్ ఇవ్వబోతోందని జగపతి బాబు మాటలను బట్టి స్పష్టమవుతోంది.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×