E-Paper
Advertisement

డీకే శివ‌కుమార్‌.. ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు! అధిష్టానానికి వీర విధేయుడు! అందుకే లేటు సీఎం!

డీకే శివ‌కుమార్‌.. ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు! అధిష్టానానికి వీర విధేయుడు! అందుకే లేటు సీఎం!
Advertisement

మొండిప‌ట్టుద‌ల‌, మంచి వ్యూహ‌క‌ర్త‌..ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు.. అంత‌కు మించి అధిష్టానానికి వీర విధేయుడు.. ఇప్పుడు చెప్పేది కాబోయే క‌ర్ణాట‌క సీఎం డీకే శివ‌కుమార్ గురించి. ఆయ‌న వ‌ల్లే అక్క‌డ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది.. అంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌టి మంచి వ్యూహ‌క‌ర్త కూడా. ఫ్రీ బ‌స్సు లాంటి ప‌థ‌కాలు అక్క‌డే కాదు.. తెలంగాణ‌లోనూ గెలుపు మంత్రాలుగా ప‌నిచేశాయి. క‌ష్ట‌కాలంలోపార్టీని విజ‌య‌తీరాల‌కు చేర్చ‌డ‌మే కాదు.. అధిష్టానానికి అన్ని ర‌కాలుగా అండ‌గా నిల‌బ‌డి కూడా త‌న‌కు చాన్స్ వ‌చ్చేదాకా వేచి చూసే దోర‌ణినే అవ‌లంభించాడు డీకే.

వాస్త‌వానికి, కాంగ్రెస్‌లో అధికారం క‌న్నా … సీనియ‌ర్ల‌కు పెద్దపీట వేయ‌డం అల‌వాటు. అది ఆ పార్టీ సంప్ర‌దాయంగా కూడా ఉంది. నాటి నుంచి నేటి వ‌ర‌కు ఇవే విధానాలను అది అమ‌లు చేస్తూ సిద్దాంత ప‌రంగా ఆద‌ర్శంగా ఉండే ప్ర‌య‌త్న చేస్తుంద‌ది. తెలంగాణ రాష్ట్రం ప్ర‌క‌టించే విష‌యంలో కూడా ఏపీలో కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోతుంద‌ని తెలిసీ .. నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. కార‌ణం.. ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉండ‌టమే. పార్టీని న‌మ్ముకున్నోళ్ల‌కు , క‌ష్ట‌కాలంలో తోడున్నోళ్ల‌ను పార్టీ వ‌ద‌ల‌దు. చాలా సంద‌ర్బాల్లో పార్టీ న‌ష్టం పోయినా.. ఆ నాయ‌కుల‌ను కాపాడుకునేందుకు ముందే ఉంటుంది కాని, వెనుక‌డుగు వేయ‌దు. అందుకే డీకే కూడా ఓపిక ప‌ట్టాడు.

Advertisement

ఇప్ప‌టి ఆయ‌న చాలాస్లారు అధిష్టానం వ‌ద్ద త‌న అస‌మ్మతిని తెల‌ప‌క‌నే తెలిపాడు. క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అన్నీ తానై ఉన్న క‌ర్ణాట‌క పార్టీకి, ప్ర‌భుత్వానికి.. తానెందుకు సీఎం కాకూడ‌ద‌నే త‌లంపు ఆయ‌న్ను నిల‌క‌డ‌గా ఉండ‌నీయ‌లేదు. అటు అధిష్టాన నిర్ణ‌యాన్ని శిర‌సావహించ‌డం.. ఇటు త‌న సీఎం ప‌ద‌వి ఆశ‌ల‌కు గ‌డువు ముంచుకొస్తున్న సంద‌ర్బం.. రెండూ డీకేను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అధిష్టానం మ‌న‌సెరిగిన నేత‌గా.. అక్క‌డి సున్నిత‌మైన మ‌న‌స్త‌త్త‌వ నిర్ణ‌యాలు తెలిసి ఉన్న సిద్ద‌రామ‌య్య‌.. కూడా సీఎం ప‌ద‌విని వ‌ద‌ల‌డానికి స‌సేమిరా అనడం.. అధిష్టానం.. డీకేనే బుజ్జ‌గించి వెన‌క్కి పంప‌డం.. ప‌ర‌మ రోటీన్ అయిపోయాయి. తాజాగా కేసీ వేణుగోపాల్ మ‌ధ్య‌వ‌ర్తిత్వంలో కీల‌క‌మైన డిస్క‌షన్ న‌డిచింది. ఇక ఇదే లాస్ట్ చ‌ర్చ అని వారికి తెలుసు. ఓ ముగింపు ఇద్దామ‌నుకున్నారు. కొత్త శ‌కానికి నాంది ప‌ల‌కాల‌ని కూడా అనుకున్నారు. కానీ లాస్ట్ మిన‌ట్ వ‌ర‌కు కూడా దీన్ని స‌స్పెన్స్‌లో పెట్ట‌డంలో వ్యూహ‌క‌ర్త కేసీ వేణుగోపాల్ స‌క్సెస్ అయ్యాడు.

ఆయ‌న మంత్రాంగం ఫ‌లించింది. రాహుల్ కూడా ప్ర‌స్తుత ప‌రిణామాల‌ను బేరీజు వేసుకుని .. డీకే సిన్సియారిటీని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని .. ఓకే చెప్పేయ‌డం.. డీకే సీఎం కావ‌డ‌మే త‌రువాయిగా ఉండ‌టం.. చ‌కాచ‌కా జ‌రిగిపోయాయి. పీసీసీ చీఫ్‌గా ఉండి పార్టీని ప‌టిష్ట ప‌రిచిన డీకే.. వాస్త‌వానికి ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌డంలో ఎలాంటి ఆటంకాలు లేవు. ఆయ‌న‌కు అడ్మినిస్ట్రేష‌న్ తెలుసు. వ్యూహాలూ తెలుసు. అధిష్టానం కోరుకున్న‌ట్టు అక్క‌డ ప్ర‌భుత్వాన్ని ప‌టిష్ట ప‌రిచి.. పార్టీని బ‌లోపేతం చేయ‌డ‌మూ తెలుసు. ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో పార్టీ మ‌రింత బ‌లోపేతం కానుంది. ఎలాంటి వివాదాలు లేకుండా. అస‌మ్మ‌తి లేకుండా.

Advertisement

ఇది కేసీ వేణుగోపాల్ వ్యూహ‌క‌ర్త‌గా సాధించిన ఫ‌లితాల్లో ఒక‌టి. ద‌క్షిణాదిన త‌న స‌త్తాను చాటుతూ వ‌స్తున్న రాహుల్ నాయ‌క‌త్వానికి క‌ర్ణాట‌క అధికార మార్పు కూడా అద‌న‌పు బ‌లం కానుంది. ఏక్‌నాథ్ షిండే లాంటి రాజ‌కీయాల‌ను చూసిన దేశం.. ఇలా ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న‌తో, పార్టీ సిద్దాంతాల‌ను,విలువల‌ను పాటిస్తూ .. రాజ‌కీయ వ్యూహం, ఎత్తుగ‌డ‌లో భాగంగా మారిన క‌ర్ణాట‌క అధికార మార్పును కూడా చూశారు. రాహుల్ నాయ‌క‌త్వంలోని న‌వ శ‌కాన్నీ చూస్తున్నారు.

Related News

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×