BigTV English

War 2 film: ఎన్టీఆర్ – హృతిక్ కాంబోలో అదిరిపోయే సాంగ్.. ఎన్ని కోట్లు ఖర్చంటే?

War 2 film: ఎన్టీఆర్ – హృతిక్ కాంబోలో అదిరిపోయే సాంగ్.. ఎన్ని కోట్లు ఖర్చంటే?

War 2 film : ప్రస్తుతం సినీ ప్రేమికుల చూపు మొత్తం భారీ అంచనాలతో విడుదల కాబోయే కొన్ని సినిమాల మీదే ఉన్నాయి. అందులో ఒకటే వార్ 2(War-2).. బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan),టాలీవుడ్ స్టార్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) కాంబినేషన్లో వస్తున్న ‘వార్ -2’ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబోలో సినిమా అంటే ఇటు సౌత్, అటు నార్త్ రెండు ఇండస్ట్రీలు కవర్ చేస్తుంది కాబట్టి అటు ఎన్టీఆర్ ఇటు హృతిక్ రోషన్ అభిమానులకు పండగే..


వార్ -2 నుంచీ బిగ్ అప్డేట్..

అయితే అలాంటి ఎన్టీఆర్,హృతిక్ రోషన్ కాంబోలో రాబోతున్న వార్ -2 సినిమా గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. అదేంటంటే హృతిక్ రోషన్,ఎన్టీఆర్ నటిస్తున్న వార్-2 మూవీలో ఒక స్పెషల్ సాంగ్ ఉందట.ఆ సాంగ్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. మరి ఇంతకీ హృతిక్ రోషన్,జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఆ సాంగ్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


ఎన్టీఆర్ – హృతిక్ కాంబోలో వచ్చే సాంగ్ కి అన్ని కోట్లా..

ఈ మధ్యకాలంలో చాలా సినిమాలలో పాటల కోసమే రూ.10, రూ.20 కోట్లు ఖర్చుపెట్టి, భారీ సెట్లు వేయిస్తూ సాంగ్ అద్భుతంగా రావాలని కోరుకుంటున్నారు. అలా సినిమా షూటింగ్ మొత్తానికి రూ.100 కోట్లు అయితే కేవలం 1, 2 పాటల కోసమే రూ.20, రూ.30 కోట్లు కూడా పెట్టే నిర్మాతలు లేకపోలేదు.అలా తాజాగా వార్-2 మూవీ విషయంలో కూడా అదే జరుగుతోందట. అదేంటంటే హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక స్పెషల్ సాంగ్ రాబోతుందట. అయితే ఈ సాంగ్ వార్ -2 మూవీకే హైలెట్ గా నిలవబోతున్నట్టు తెలుస్తోంది.అంతేకాదు సినిమాకి ఈ సాంగ్ హైలెట్ కాబట్టి.. ఆ సాంగ్ కి బడ్జెట్ కూడా ఎక్కువగానే పెడుతున్నారట. మరి ఇంతకీ ఆ సాంగ్ కి ఎంత బడ్జెట్ పెడుతున్నారంటే.. అక్షరాల రూ.15 కోట్లట.. అవును మీరు వినేది నిజమే. 15 కోట్ల బడ్జెట్ తో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య ఈ స్పెషల్ సాంగ్ షూట్ చేస్తున్నారట. ఈ స్పెషల్ సాంగ్ లో ఎన్టీఆర్,హృతిక్ రోషన్ ఇద్దరూ డ్యాన్స్ తో ఇరగదీయబోతున్నట్టు తెలుస్తోంది.

సాంగ్ చిత్రీకరణ ఎక్కడంటే..?

ఇక వీరి కాంబోలో రాబోతున్న సాంగ్ యష్ రాజ్ ఫిలిమ్ స్టూడియో(Yash Raj Film Studio)లో చిత్రీకరణ జరుపుకుంటుందట. అలా కేవలం ఈ ఒక్క సాంగ్ కోసమే దాదాపు 15 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు బీటౌన్ లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.ఇక ఈ గాసిప్ ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పటినుండి వార్-2 మూవీపై మరిన్ని అంచనాలు పెరిగి పోయాయి. ఇక డ్యాన్స్ విషయంలో ఎన్టీఆర్ ఎలా చేస్తారో చెప్పనక్కర్లేదు. అలాంటి ఎన్టీఆర్,హృతిక్ రోషన్ కాంబోలో డ్యాన్స్ అంటే ఏ లెవెల్ లో షూట్ చేస్తున్నారు అర్థం చేసుకోవచ్చు అంటూ అభిమానులు చాలా ఎక్జైట్ అవుతున్నారు.

వార్ -2 సినిమా విశేషాలు..

ఇక హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్-2 సినిమాకి అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించగా కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్ గా చేస్తోంది.. ఇక ఇందులో ఎన్టీఆర్ విలన్ పాత్రలో చేస్తున్నారు.అలాగే వార్- 2 మూవీని యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా(Adithya Chopra) చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక వార్-2 మూవీ ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల కాబోతోంది.

also read:3BHK Twitter Review: సిద్ధార్థ్ 3BHK ట్విట్టర్ రివ్యూ.. సిద్ధార్థ్ మళ్లీ కం బ్యాక్ ఇచ్చినట్లేనా?

Related News

Mass Jathara : మాస్ జాతర టీం కు లీగల్ నోటీసులు, నిర్మాత వంశీకి దెబ్బ మీద దెబ్బ

Sreeleela: శ్రీలీలా హీరోయిన్ అవ్వడం వెనక ఎన్టీఆర్, బిగ్గెస్ట్ ట్విస్ట్ రివీల్ చేసిన శ్రీలీలా మదర్

Nithiin: పాపం నితిన్… హిట్ కోసం మళ్ళీ ఆ దర్శకుడును నమ్ముకుంటున్నాడు

Nara Rohit: పొలిటికల్ ఎంట్రీపై హీరో క్లారిటీ.. ఆ అపోహలకు చెక్!

Priyanka Chopra: బాలీవుడ్ పై గ్లోబల్ బ్యూటీ అసహనం.. ఆ మార్పు రావాలంటూ?

Kantara Chapter 1: తెలుగు స్టేట్స్ లో భారీ డీల్.. ప్రీక్వెల్ కి అంత అవసరమా?

Big Stories

×