Nara Rohit: ప్రముఖ నటుడు , రాజకీయ వారసుడు నారా రోహిత్ (Nara Rohit) తాజాగా నటిస్తున్న చిత్రం ‘సుందరాకాండ’. వెంకటేష్ నిమ్మలపూడి (Venkatesh Nimmalapudi) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఆగస్టు 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ద్వారా ప్రముఖ సీనియర్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ (Sridevi Vijay Kumar)మళ్ళీ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈమె తోపాటు విర్తి వాఘాని (Virti Vaghani) హీరోయిన్ గా నటిస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టిన చిత్ర బృందం అందులో భాగంగానే తాజాగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే కుటుంబ సమేతంగా వినోదాన్ని ఆస్వాదించేలా రూపొందించిన చిత్రమే సుందరాకాండ అని తెలిపిన నారా రోహిత్.. తన పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా చెప్పి ఆ అపోహలకు చెక్ పెట్టారు. ప్రెస్ మీట్ లో భాగంగా నారా రోహిత్ మాట్లాడుతూ..” రాజకీయాలలోకి, సినిమాలలోకి వస్తే ఎవరు ఆపారని.. ? “ఎదురు ప్రశ్నించారు నారా రోహిత్.. అంతేకాదు ఆయన మాట్లాడుతూ..” పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాల్సి వస్తే కచ్చితంగా చెబుతాను. అటు పెదనాన్న నారా చంద్రబాబు నాయుడు, అన్నయ్య నారా లోకేష్ సపోర్ట్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. అవకాశం వస్తే ఎంట్రీ ఇస్తానేమో తెలియదు. కానీ ఎంట్రీ ఇచ్చినప్పుడు మాత్రం పక్కాగా చెబుతానని “క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే ఇప్పటినుంచే సన్నహాలు సిద్ధం చేస్తున్నారు అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని నారా రోహిత్ ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చారని చెప్పవచ్చు.
సుందరకాండ సినిమా విషయానికి వస్తే.. సంతోష్ నిర్మాతగా రాబోతున్న కుటుంబ కథా చిత్రంగా, ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ తో కూడుకున్న మూవీగా రాబోతోందని మేకర్స్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ సినిమా విజయం సాధిస్తుందని అటు హీరోయిన్స్ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఇందులో ప్రతి నటుడు ఒక మంచి రోల్ పోషించారని, పాత సుందరాకాండ సినిమాకి ఈ సినిమాకు చాలా తేడా ఉందని అని కూడా స్పష్టం చేశారు. మొత్తానికైతే సుందరకాండ సినిమాతో అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్న మేకర్స్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.
నారా రోహిత్ సినిమాలు..
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నారా రోహిత్. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు నిర్మాతగా కూడా పలు చిత్రాలు నిర్మించి వార్తల్లో నిలిచారు.ఈయన కెరియర్ విషయానికి వస్తే.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈయన తండ్రి పేరు నారా రామ్మూర్తి నాయుడు. ఇటీవల కాలం చేసిన విషయం తెలిసిందే. న్యూయార్క్ ఫిలిం అకాడమీలో పూర్వ విద్యార్థిగా శిక్షణ తీసుకున్న ఈయన.. బాణం, అసుర, రౌడీ ఫెలో, ప్రతినిధి, ప్రతినిధి 2, సోలో ఇలా పలు చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు సుందరకాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రోహిత్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.
ALSO READ:Priyanka Chopra: బాలీవుడ్ పై గ్లోబల్ బ్యూటీ అసహనం.. ఆ మార్పు రావాలంటూ?