BigTV English

Priyanka Chopra: బాలీవుడ్ పై గ్లోబల్ బ్యూటీ అసహనం.. ఆ మార్పు రావాలంటూ?

Priyanka Chopra: బాలీవుడ్ పై గ్లోబల్ బ్యూటీ అసహనం.. ఆ మార్పు రావాలంటూ?

Priyanka Chopra:గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తాజాగా బాలీవుడ్ పై అసహనం వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా హాలీవుడ్లో చిత్రాలు చేస్తూ గ్లోబల్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. ఇప్పుడిప్పుడే ఇండియన్ భాషలలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఇండియన్ సినిమాలలో వచ్చిన మార్పులను ఎత్తి చూపిస్తూ అసహనం వ్యక్తం చేసింది ప్రియాంక చోప్రా.


తాజాగా బాలీవుడ్ లో హీరోయిన్ల పరిస్థితి, అక్కడి మేల్ డామినేషన్ గురించి ఒక ఇంటర్వ్యూలో ఊహించని కామెంట్లు చేసింది ప్రియాంక చోప్రా. ఈమె మాట్లాడుతూ.. “అందరూ చెబుతున్నట్టుగానే బాలీవుడ్ ఇండస్ట్రీలో పురుషాధిపత్యం ఎక్కువగా ఉంది. సెట్ లో మేము హీరోలతో సమానంగా కష్టపడినా.. అటు పారితోషకం విషయంలో మాత్రం సమానత్వం కొంచెం కూడా కనిపించదు. హీరో వచ్చిన తర్వాతే షూటింగ్ మొదలవుతుంది. కానీ హాలీవుడ్ లో ఇలాంటి సిస్టం మీకు ఎక్కడా కనిపించదు. హీరోలతో సమానంగా వేతనం లభిస్తుంది. ఈ విషయంలో నాకు చాలా సంతోషంగా అనిపించింది. కనీసం బాలీవుడ్ లో ఇప్పటికైనా మార్పు రావాలి” అంటూ ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రియాంక చోప్రా చెప్పినట్టు ఇది ఒక బాలీవుడ్ లోనే కాదు చాలా ఇండస్ట్రీలో ఈ వ్యత్యాసం ఉందని సమంత (Samantha) ను మొదలుకొని చాలామంది హీరోయిన్లు ఈ విషయంపై స్పందించిన విషయం తెలిసిందే. కనీసం ఇప్పటికైనా పారితోషకం విషయంలో అలాగే విలువల విషయంలో సమాన హక్కు కల్పిస్తారేమో చూడాలి.

ప్రియాంక చోప్రా సినిమాలు..


ప్రస్తుతం ప్రియాంక చోప్రా వరుస పెట్టి తెలుగు చిత్రాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఎస్ ఎస్ ఎం బి 29 అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న చిత్రంలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక భాగం కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు అటు బాలీవుడ్ లో కూడా ఈమె ఒకటి , రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ప్రియాంక చోప్రా కెరియర్..

2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ 2020 పోటీలలో విజేతగా నిలిచిన ఈమె.. భారత దేశంలో అత్యధిక పారితోషకం పొందే నటిగా పేరు సొంతం చేసుకుంది. పలు చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. నటనతో రెండు నేషనల్ అవార్డులు, ఐదు ఫిలింఫేర్ అవార్డులతో పాటు అనేక ప్రశంసలతో సత్కరించబడింది. 2016లో భారత ప్రభుత్వం ఈమెకు పద్మశ్రీ అవార్డు కూడా అందించింది. దీనికి తోడు ఫోర్బ్స్ ఇండియా ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఒకరిగా ఈమెకు అవకాశం కల్పించింది. తమిళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె ఆ తర్వాత బాలీవుడ్లో సెటిల్ అయిపోయింది.. ఇప్పుడు హాలీవుడ్లో సినిమాలు చేస్తూ గ్లోబల్ బ్యూటీగా పేరు సొంతం చేసుకుంది.

ALSO READ:Kantara Chapter 1: తెలుగు స్టేట్స్ లో భారీ డీల్.. ప్రీక్వెల్ కి అంత అవసరమా?

Related News

Sreeleela: శ్రీలీలా హీరోయిన్ అవ్వడం వెనక ఎన్టీఆర్, బిగ్గెస్ట్ ట్విస్ట్ రివీల్ చేసిన శ్రీలీలా మదర్

Nithiin: పాపం నితిన్… హిట్ కోసం మళ్ళీ ఆ దర్శకుడును నమ్ముకుంటున్నాడు

Nara Rohit: పొలిటికల్ ఎంట్రీపై హీరో క్లారిటీ.. ఆ అపోహలకు చెక్!

Kantara Chapter 1: తెలుగు స్టేట్స్ లో భారీ డీల్.. ప్రీక్వెల్ కి అంత అవసరమా?

Mahesh Vitta: పండంటి కొడుకుకు జన్మనిచ్చిన నటుడి భార్య.. క్యూట్ ఫోటో వైరల్!

Big Stories

×