BigTV English

3BHK Twitter Review: సిద్ధార్థ్ 3BHK ట్విట్టర్ రివ్యూ.. సిద్ధార్థ్ మళ్లీ కం బ్యాక్ ఇచ్చినట్లేనా?

3BHK Twitter Review: సిద్ధార్థ్ 3BHK ట్విట్టర్ రివ్యూ.. సిద్ధార్థ్ మళ్లీ కం బ్యాక్ ఇచ్చినట్లేనా?

3BHK Twitter Review.. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ (Siddharth) ఈసారి ఎలాగైనా సరే గట్టి కం బ్యాక్ ఇవ్వాలని భారీ ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా తాజాగా థియేటర్లలో విడుదల చేసిన చిత్రం 3BHK. హీరో సిద్ధార్థ్, కన్నడ హీరోయిన్ చైత్ర జే ఆచార్ జంటగా వచ్చిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.అలా సిద్ధార్థ్, మీతా రఘునాథ్, దేవయాని, శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ఇది. యంగ్ ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వా నిర్మించగా.. శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలా ఒక ఎమోషన్ తో ఈ సినిమాను తీసినట్లు ఇటీవలే ట్రైలర్ ద్వారా అర్ధమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలి అనే పాయింట్ తోనే ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. మరి థియేటర్లలోకి ఈరోజు వచ్చేసిన ఈ సినిమా ఎలా ఉంది? సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా ఏ విధంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.


3BHK ట్విట్టర్ రివ్యూ..

ఇకపోతే తాజాగా ఈ సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అందులో భాగంగానే ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నారు.


ఇదొక రియలిస్టిక్ ఎమోషనల్ మూవీ.. చాలా సంవత్సరాల తర్వాత శరత్ కుమార్ పోషించిన ఈ పాత్ర అద్భుతం. మరొకసారి సిద్ధార్థ్ సూపర్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. మీతా రంగనాథ్ చాలా బోల్డ్ గా నటించింది. పాటల ప్లేస్మెంట్ మహా అద్భుతం. నిజజీవితానికి దగ్గరగా ఉండే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది అంటూ కామెంట్ చేశారు.

3BHK సినిమా అనేది కేవలం ఒక సినిమా కాదు ఇదొక అద్భుతం. నిత్యం మనకు ఎదురు దెబ్బలు, ప్రతి దాంట్లో అపజయం ఎదురవుతూ ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు మనకంటూ ఉంటుందనే ఆశను కలిగించే చిత్రమే ఇది. నిత్యం మనకు ఎదురయ్యే సంఘటనలు ఎన్నో ఈ చిత్రంలో చూపించారు అంటూ చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో ఎమోషన్స్ రోలర్ కోస్టర్ గా ఉన్నాయి. యాక్టర్స్ పర్ఫామెన్స్ చాలా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ ఎక్స్ట్రార్డినరీగా ఉంది. శ్రీ గణేష్ కు గొప్ప విజయం చేకూరబోతోంది. గుండెను పిండేసే ఒక మధ్యతరగతి కుటుంబ కథ ఇది. సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని అనుకునే వారికి ఈ సినిమా చక్కగా అద్దం పడుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు

3BHK మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఇందులో సిద్ధార్థ్ , శరత్ కుమార్ తమ నటనతో అబ్బురపరిచారు. సొంత ఇంటి కల అనేది ప్రతి ఒక్క మనిషికి, ఫ్యామిలీకి ఉంటుంది. అయితే ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు.. గౌరవం అంటూ ఈ సినిమాలో శరత్ కుమార్ చెప్పిన డైలాగు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఒక ఇంటి కోసం తండ్రి పడే తపన ఇందులో చాలా అద్భుతంగా చూపించారు. నిజ జీవితానికి ఈ సినిమా అద్దం పడుతోంది అంటూ మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

 

మొత్తానికైతే ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలను ట్విట్టర్ హ్యాండిల్ లో పంచుకుంటున్నారు. ముఖ్యంగా 4/5 అంటూ రేటింగ్ కూడా ఇచ్చేస్తున్నారు. మరి ఆడియన్స్ ఇస్తున్న రివ్యూ, రేటింగ్ బట్టి చూస్తే సిద్ధార్థ్ ఖచ్చితంగా మళ్లీ గట్టి కం బ్యాక్ ఇవ్వబోతున్నారని స్పష్టం అవుతోంది.

also read:Priyamani: ది గుడ్ వైఫ్ కాపీ ఆరోపణలపై స్పందించిన ప్రియమణి.. అంత కర్మ పట్టలేదంటూ!

Related News

Tehran Movie Review : ‘టెహ్రాన్’ మూవీ రివ్యూ… యాక్షన్‌‌తో దుమ్మురేపే గ్లోబల్ స్పై థ్రిల్లర్

Coolie Movie Review : కూలీ మూవీ రివ్యూ… లోకి ‘లో’ మార్క్

WAR 2 Movie Review : వార్ 2 మూవీ రివ్యూ.. జస్ట్ వార్ – నో రోర్

Coolie Twitter Review : కూలీ సినిమా ట్విట్టర్ రివ్యూ

War 2Twitter Review : ‘వార్ 2 ‘ ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే..!

Coolie Review: కూలీ మూవీకి ఆ హీరో ఫస్ట్ రివ్యూ.. అదేంటీ అలా అనేశాడు, వెళ్లొచ్చా?

Big Stories

×