Kantara Chapter 1:యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి (Rishabh Shetty) తన అద్భుతమైన డైరెక్షన్ విలువలతో తెరకెక్కించిన చిత్రం కాంతార(Kantara ). కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ఈ చిత్రం ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా కన్నడ ఇండస్ట్రీ తో పాటు ఇటు డైరెక్టర్ కి పాన్ ఇండియా ఇమేజ్ అందించింది. అటు కన్నడ తో పాటు తెలుగు స్టేట్స్ లో కూడా భారీ విజయం అందుకుంది. ఇప్పుడు ఈ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి మేకర్స్ ప్రీక్వెల్ తో మన ముందుకు రాబోతున్నారు. అక్టోబర్ మొదటి వారంలో విడుదల కాబోతున్న ఈ సినిమా హక్కులకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
కాంతార ప్రీక్వెల్ కి భారీ డిమాండ్..
అసలు విషయంలోకి వెళ్తే.. కాంతార సినిమాకు తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న నిర్మాతలు తెలుగు రాష్ట్రాలలో భారీ బిజినెస్ ఆశిస్తున్నారు. అందులో భాగంగానే రూ.100 కోట్ల భారీ డీల్ తో క్విట్ చేస్తున్నట్లు సమాచారం.. ముఖ్యంగా పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయినప్పటికీ.. దాని ప్రీక్వెల్ కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందని ఏ నమ్మకంతో చెప్పగలరు అని ఈ విషయం తెలిసిన నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా ఇప్పటివరకు పాన్ ఇండియా ఆడియన్స్ ఎంజాయ్ చేసే సాలిడ్ కంటెంట్, ప్రోమో, ట్రైలర్ ఈ సినిమా నుండి రాలేదు. అయినప్పటికీ కూడా మేకర్లు భారీగా బిజినెస్ ఆశిస్తున్నారు అంటే ఇక వీరు కష్టాలు ఎదుర్కోవాల్సిందే అని కూడా సినీ విశ్లేషకులు చెబుతూ ఉండడం గమనార్హం.
నిర్మాతలు రిస్క్ చేస్తున్నారా?
ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. దీనికి తోడు చాలా సినిమాలు బిజినెస్ విషయంలో నత్త నడకన సాగుతున్నాయి.. ఇలాంటి సమయంలో కాంతార ప్రీక్వెల్ కోసం ఇంత భారీ మొత్తం పెట్టడంతో డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వస్తారా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఏది ఏమైనా రూ.100 కోట్ల డీల్ అంటే నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. మరి ఇది నిజంగా జరుగుతుందా? లేదా? మార్కెటింగ్ హైప్ మాత్రమేనా? అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా రిషబ్ శెట్టి మూవీకి ఈ రేంజ్ లో ఆశించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక కాంతార విషయానికి వస్తే ఈ ప్రీక్వెల్ ఎప్పుడు మొదలుపెట్టారో కానీ షూటింగ్ మొదలైనప్పటి నుంచి దాదాపు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. పైగా మేకర్స్ ఈ విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్న పలు అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి. మరి అన్ని అనుమానాలకు తెరదించుతూ రిషబ్ శెట్టి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.
ALSO READ:Mahesh Vitta: పండంటి కొడుకుకు జన్మనిచ్చిన నటుడి భార్య.. క్యూట్ ఫోటో వైరల్!