BigTV English

Vishwambhara : విశ్వంభర త్యాగాలు… అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు తమ్ముడి కోసం!

Vishwambhara : విశ్వంభర త్యాగాలు… అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు తమ్ముడి కోసం!

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగా 157 (Mega 157) అనే వర్కింగ్ టైటిల్ తో చేస్తున్నారు. ఈ సినిమాలో నయనతారని హీరోయిన్ గా ఫిక్స్ చేసి, ఈ మధ్యనే అధికారికంగా కూడా ప్రకటించారు. ప్రస్తుతం నయనతార (Nayanthara),చిరంజీవి మధ్య షూటింగ్ జరుగుతుంది. అలాగే అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబోలో రాబోతున్న మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలవుతున్నట్టు చెప్పారు. దీంతో చిరంజీవి ముందు నటించిన విశ్వంభర మూవీ రిలీజ్ పై గందరగోళం నెలకొంది. ఎందుకంటే చిరంజీవి నటించిన విశ్వంభర మూవీ ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి.


షూటింగ్ పూర్తయినా.. కొడుకు కోసం విశ్వంభర వాయిదా..

ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయిందని ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలవుతుందని మొదట అఫీషియల్ రిలీజ్ డేట్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత చిరంజీవి కొడుకు రామ్ చరణ్ (Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతికి విడుదల కావడంతో తండ్రి కొడుకుల మధ్య పోటీ ఎందుకని గేమ్ ఛేంజర్(Game Changer) కోసం చిరంజీవి తన విశ్వంభర మూవీని వాయిదా వేసుకున్నారు. కానీ చిరంజీవి త్యాగం చేసినప్పటికీ ఫలితం మాత్రం దక్కలేదు. ఎందుకంటే గేమ్ ఛేంజర్ డిజాస్టర్.


తమ్ముడు మూవీ కోసం మళ్లీ వాయిదా వేసుకుంటున్న చిరంజీవి..

ఆ తర్వాత విశ్వంభర మూవీ (Vishwambhara Movie) ని సెప్టెంబర్ 18న రిలీజ్ చేస్తారని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కానీ తాజాగా దసరా బరిలో కూడా విశ్వంభర ఉండడం లేదని,అది కూడా తమ్ముడి కోసం అన్నట్లుగా టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో ఓ రూమర్ వినిపిస్తుంది. ఎందుకంటే విశ్వంభర మూవీని సెప్టెంబర్ 18 విడుదల చేద్దామని మేకర్స్ అనుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న ‘ఓజీ ‘ మూవీ కూడా సెప్టెంబర్ 25న విడుదల కాబోతున్నట్టు ఓజీ మేకర్స్ చెప్పారు. కానీ ఈ మధ్యకాలంలో సెప్టెంబర్ 25న ఓజీ మూవీ(OG Movie) రావడం లేదని దాన్ని వాయిదా వేశారని సోషల్ మీడియాలో రూమర్స్ వినిపించేసరికి ఓజి మేకర్స్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చి సెప్టెంబర్ 25 కి ఓజీ మూవీ పక్కా వస్తుందని చెప్పారు. దీంతో మళ్లీ చిరంజీవి ఆలోచనలో పడ్డారట. తమ్ముడి సినిమా కోసం చిరంజీవి తన విశ్వంభర మూవీని సెప్టెంబర్ 18న కూడా వాయిదా వేసుకున్నారట.

వచ్చే యేడాది సంక్రాంతికి కూడా లేనట్టేనా..

మరి సంక్రాంతికి తీసుకొద్దాం అంటే ఆల్రెడీ అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమా సంక్రాంతికి ఫిక్స్ అయి ఉంది. దీంతో విశ్వంభర మూవీ ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియక నిర్మాతలు గందరగోలంలో పడిపోయారు. అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులవుతుంది.

సమ్మర్ వరకు వెయిట్ చేస్తే.. నిర్మాతలపై భారం తప్పదా..

కానీ వచ్చే ఏడాది సమ్మర్ అంటే నిర్మాతల మీద బండరాయి పడ్డట్లే. ఎందుకంటే నిర్మాతలు అప్పులు తెచ్చి సినిమాల మీద బడ్జెట్ పెడతారు. కానీ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగి ఫైనాన్షియర్స్ నుండి ఒత్తిడి రావడంతో చాలా ఇబ్బందులు పడతారు. అలా చిత్ర యూనిట్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది.మరి నిర్మాత బడ్జెట్ భారాన్ని భరించి సమ్మర్ కే సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేస్తారా..లేక ఓ జి మూవీ కి పోటీగా దసరాకే రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.కానీ చిరంజీవి మాత్రం ఓజీ సినిమా కోసం విశ్వంభరని వాయిదా వేయాలని చెప్పినట్టు సమాచారం.

అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు తమ్ముడు కోసం..

అలా అప్పుడు కొడుకు కోసం ఇప్పుడు తమ్ముడి కోసం చిరంజీవి తన విశ్వంభర మూవీని వాయిదా వేసుకుంటూ వస్తున్నారంటూ ఒక వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. మరి చూడాలి చిరంజీవి విశ్వంభర మూవీ సెప్టెంబర్ లోనే విడుదలవుతుందా లేక సమ్మర్ వరకు ఆగుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

also read:War 2 film: ఎన్టీఆర్ – హృతిక్ కాంబోలో అదిరిపోయే సాంగ్.. ఎన్ని కోట్లు ఖర్చంటే?

Related News

Mass Jathara : మాస్ జాతర టీం కు లీగల్ నోటీసులు, నిర్మాత వంశీకి దెబ్బ మీద దెబ్బ

Sreeleela: శ్రీలీలా హీరోయిన్ అవ్వడం వెనక ఎన్టీఆర్, బిగ్గెస్ట్ ట్విస్ట్ రివీల్ చేసిన శ్రీలీలా మదర్

Nithiin: పాపం నితిన్… హిట్ కోసం మళ్ళీ ఆ దర్శకుడును నమ్ముకుంటున్నాడు

Nara Rohit: పొలిటికల్ ఎంట్రీపై హీరో క్లారిటీ.. ఆ అపోహలకు చెక్!

Priyanka Chopra: బాలీవుడ్ పై గ్లోబల్ బ్యూటీ అసహనం.. ఆ మార్పు రావాలంటూ?

Kantara Chapter 1: తెలుగు స్టేట్స్ లో భారీ డీల్.. ప్రీక్వెల్ కి అంత అవసరమా?

Big Stories

×