E-Paper
Advertisement

చరణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్… ఐటెం సాంగ్ కోసం ఆ బ్యూటీని దింపుతున్న బుచ్చిబాబు?

చరణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్… ఐటెం సాంగ్ కోసం ఆ బ్యూటీని దింపుతున్న బుచ్చిబాబు?

Peddi Movie: ఈ మధ్య కాలంలో ఈ సినిమా క్రియేట్ చేసిన బజ్ మరే సినిమా క్రియేట్ చేయలేదంటే ఆశ్చర్యం లేదు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ మరియు వృద్ధి సినిమాస్ కలిసి దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ జత కట్టగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై చరణ్ పెట్టుకున్న హోప్స్ అన్నీ ఇన్నీ కావు. ఎందుకంటే గత పొంగల్ బరిలో దిగిన గేమ్ ఛేంజర్ బొక్క బోర్లా పడటంతో ఈ సినిమాతో అయినా సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆశపడి మరీ ఎంచుకున్న కథ కాబట్టి.

also read:టాలీవుడ్ మల్టీప్లెక్స్‌లో ‘తమిళ’ దండయాత్ర! మన ‘డెకాయిట్’ కంటే ప్రదీప్ రంగనాథన్ సినిమాకే ఎక్కువ రేటా?

కొంచెం టాకీ పార్ట్‌తో పాటు స్పెషల్ సాంగ్ బ్యాలెన్స్

ఇక సినిమాను మార్చి 27న రిలీజ్ చేస్తామని సినిమా మొదలైనప్పుడే చెప్పేసింది మూవీ టీమ్. కానీ కారణాలేవైనా ఈసారి పక్కా అంటూ ఏప్రిల్ 30న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది. అయితే ఏప్రిల్‌లో కాదు కదా, మే నెలలో కూడా సినిమా రావడం అనుమానమే అన్న వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంకా కొంచెం టాకీ పార్ట్‌తో పాటు ఒక స్పెషల్ సాంగ్ బ్యాలెన్స్ ఉండటంతో జూన్ చివరి వారం వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదని ఇన్‌సైడ్ టాక్. అయితే ఇప్పటికీ మేకర్స్ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ఇదే అని క్లారిటీగా చెప్పలేని పరిస్థితి.

మొహం మీదే ‘నో’ చెప్పేసిన మృణాల్?

ఇకపోతే సినిమాలో బ్యాలెన్స్ ఉన్న ఆ ఐటెం సాంగ్ ఎవరు చేస్తారా అంటూ క్యూరియస్‌గా వాచ్ చేస్తున్నారు మూవీ లవర్స్. అయితే ‘రంగస్థలం’లో ‘జిగేల్ రాణి’గా మ్యాజిక్ చేసిన మృణాల్ ఠాకూర్‌ ను రిపీట్ చేయాలని బుచ్చి ట్రై చేయడం, ఆమె మొహం మీదే ‘నో’ చెప్పేయడం చకచక జరిగిపోయాయట. మొత్తానికి ఐటెం అదే స్పెషల్ సాంగ్స్ గనుక కంటిన్యూ చేస్తే మెయిన్ లీడ్ అవకాశాలు రావా లేక డేట్స్ లేక నో చెప్పిందా తెలియదు కానీ సాలిడ్ రేట్ ఆఫర్ చేసినా మృణాల్ లైట్ తీసుకోవడంతో ఆ పాటకు స్టెప్పులు వేసే అమ్మడు ఎవరా అంటూ డైలమాలో పడిపోయిందట మూవీ యూనిట్.

మిస్ ఇండియా బ్యూటీ మానస వారణాసి

అయితే తాజాగా ఆ ప్లేస్‌లోకి మిస్ ఇండియా బ్యూటీ మానస వారణాసిని తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. రీసెంట్‌గా సంతోష్ శోభన్ తో‘కపుల్ ఫ్రెండ్లీ’ ‘కపుల్ ఫ్రెండ్లీ’ అంటూ హిట్ కొట్టిన ఈ భామ మంచి మార్కులే కొట్టేసింది కానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్  డ్యాన్స్‌లో ఉన్న గ్రేస్‌ని మ్యాచ్ చేయగలదా అన్నదే మెగా ఫ్యాన్స్‌ని వేధిస్తున్న ప్రశ్న. ఇదిలా ఉంటే క సినిమా డైరెక్టర్స్ తెరకెక్కించే సినిమాలో కూడా సాయి దుర్గ తేజ్ పక్కన మానస వారణాసినే ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. చూడాలి నిజమెంతో.

రాబోయే ఐటెం సాంగ్ మీదనే అంచనాలు

ఇక ఇదిలా ఉంటే ఆస్కార్ విన్నర్ రెహమాన్ మ్యూజిక్ చేసే మ్యాజిక్ మామూలుగా ఉండదు. కానీ ఈ సినిమాలో ‘చికిరి చికిరి’ తర్వాత దాన్ని బీట్ చేసేలా ‘రై రై రారా’ లేదన్నది నిజం. దీంతో ఇప్పుడు రాబోయే ఐటెం సాంగ్ మీదనే భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇది గనుక క్లిక్ అవకపోతే మాత్రం సినిమా రేంజ్ పడిపోవడం ఖాయమన్నది కొందరు ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న మాట. ఏదేమైనా ఏప్రిల్‌లో అయినా వస్తుందని ఆశ పెట్టుకున్న ఫ్యాన్స్‌కు పోస్ట్‌పోన్ అయితే మాత్రం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.చూడాలి మరి బ్యాలెన్స్ ఉన్న ఈ స్పెషల్ సాంగ్‌ని చకచక పూర్తి చేసి కనీసం జూన్‌లో అయినా రిలీజ్ చేస్తారో లేక మరిన్ని వాయిదాల పాటలు పాడుతారో!

also read:డేట్ మర్చిపోయారా…లేక మైండ్ బ్లాక్ అయ్యిందా?మెగా డాటర్ పై నెటిజన్ల ఫైర్ !

Related News

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

Big Stories

×