E-Paper
Advertisement

IDFC FIRST Scam: రూ.590 కోట్లు హంఫట్.. ఆ బ్యాంక్ మేనేజర్ వేసిన ప్లాన్ చూస్తే మతిపోద్ది!

IDFC FIRST Scam: రూ.590 కోట్లు హంఫట్.. ఆ బ్యాంక్ మేనేజర్ వేసిన ప్లాన్ చూస్తే మతిపోద్ది!
Advertisement

IDFC FIRST Scam: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్‌లో జరిగిన రూ. 590 కోట్ల స్కామ్ దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ఈ భారీ స్కామ్ వెనుక ఆ బ్యాంకు మాజీ బ్రాంచ్ మేనేజర్ హస్తం ఉందని తేలింది. హర్యానా ప్రభుత్వ ఖాతాల నుంచి నిధులను మాజీ మేనేజర్ తన భార్య, బావమరిది నడుపుతున్న కంపెనీ ఖాతాలోకి మళ్లించాడని షాకింగ్ విషయం దర్యాప్తులో తేలింది. ఈ కేసులో హర్యానా అవినీతి నిరోధక శాఖ ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేసింది. మాజీ బ్రాంచ్ మేనేజర్ రిభవ్ రిషి, బ్యాంక్ మాజీ రిలేషన్‌షిప్ మేనేజర్ అభయ్, రిభవ్ భార్య స్వాతి సింగ్లా, ఆమె సోదరుడు అభిషేక్ సింగ్లాను అరెస్టు చేశారు.

అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ ఎఎస్ చావ్లా మాట్లాడుతూ.. ఈ కేసులో రిభవ్, అభయ్ ప్రధాన నిందితులని చెప్పారు. వారిద్దరూ దాదాపు ఆరు నెలల క్రితం ఈ శాఖలో తమ ఉద్యోగాలకు రిజైన్ చేశారని దర్యాప్తులో తేలిందన్నారు. దాదాపు రూ.300 కోట్ల మొత్తాన్ని స్వస్తిక్ దేశ్ ప్రాజెక్ట్స్ అనే కంపెనీకి ట్రాన్స్ ఫర్ చేశారు. కంపెనీ షేర్లలో రిభవ్ భార్య స్వాతి 75 శాతం వాటాను కలిగి ఉండగా, మిగిలిన 25 శాతం అభిషేక్ వద్ద ఉన్నాయి. నిందితులను పోలీసులు కోర్టులో హాజరనుపరచనున్నారు.

ఎలా వెలుగులోకి వచ్చింది?

Advertisement

ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తన చండీగఢ్ శాఖలో ఉన్న హర్యానా ప్రభుత్వానికి చెందిన కొన్ని ఖాతాలకు సంబంధించి సుమారు రూ. 590 కోట్ల మోసం జరిగినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తేలింది. బ్రాంచ్‌లోని కొంతమంది ఉద్యోగులు మోసపూరిత పనుల ఫలితంగా ఈ స్కామ్ జరిగిందని, బహుశా బయట వ్యక్తులు కూడా ఇందులో పాల్గొనవచ్చని బ్యాంక్ తెలిపింది.

హర్యానా ప్రభుత్వ తమ అకౌంట్ల బ్యాలెన్స్‌ను వేరే బ్యాంకుకు బదిలీ చేయమని చెప్పినప్పుడు మోసం బయటపడిందని బ్యాంక్ యాజమాన్యం తెలిపింది. ఈ ప్రక్రియలో, బ్యాంకు అధికారులు రికార్డులలో పేర్కొన్న మొత్తానికి, వాస్తవ బ్యాలెన్స్‌కు మధ్య తేడాను గుర్తించారు. హర్యానా ప్రభుత్వానికి చెందిన ఇతర ఖాతాలలో కూడా ఇలాంటి వ్యత్యాసాలు గుర్తించారు.

దర్యాప్తులో ఏం తేలింది?

Advertisement

ఈ స్కామ్ లో కీలక నిందితులైన రిభవ్, అభయ్ మాస్టర్ ప్లాన్ వేసి… రూ. 300 కోట్లు స్వస్తిక్ దేశ్ ప్రాజెక్ట్స్‌కు మళ్లించారు. ఆ మొత్తాన్ని ఆ అకౌంట్ నుంచి మరో ఖాతాకు బదిలీ చేశారు. మూడు నగరాలు సమీపంలో ఉండటం, రెండు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం ఉండటం వల్ల బ్యాంకు సిబ్బంది ఈ మోసాన్ని గుర్తించలేకపోయాని దర్యాప్తు అధికారులు అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో రూ.590 కోట్ల మోసం.. ప్రభుత్వ ఖాతాలతోనే!

బ్యాంక్ ఏం చెప్పింది?

హర్యానా ప్రభుత్వ విభాగాలకు 100 శాతం క్లెయిమ్ ఇప్పటికే తిరిగి చెల్లించినట్లు బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం మా కస్టమర్ ఫస్ట్ సూత్రాలను ఆచరణలో పెట్టాల్సిన సందర్భం వచ్చిందని పేర్కొంది. స్కామ్ జరిగినా… పేమెంట్ చెల్లింపును నిలిపివేయలేదని బ్యాంకు తెలిపింది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×