E-Paper
Advertisement

NPCIL Recruitment: నెలకు రూ.74,000 జీతం.. NPCIL‌లో ఉద్యోగాలు, దరఖాస్తుకు ఇంకా 4 రోజులే..!

NPCIL Recruitment: నెలకు రూ.74,000 జీతం.. NPCIL‌లో ఉద్యోగాలు, దరఖాస్తుకు ఇంకా 4 రోజులే..!

ముంబయిలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. సంస్థలో ఖాళీగా ఉన్న 30 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. మార్చి 4వ తేదీని దరఖాస్తుకు చివరి గడువుగా నిర్ణయించారు. దరఖాస్తుకు ఇంకా 5 రోజుల సమయం మాత్రమే ఉంది.

వెకెన్సీ వివరాలు..

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ఇండస్ట్రియల్, ఫైర్ సేఫ్టీ విభాగానికి 10 పోస్టులు కేటాయించారు. ఫిజిక్స్ విభాగంలో 20 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

జీతం..

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.74,000 వేతనం లభిస్తుంది.

విద్యార్హత:

సంబంధిత విభాగాల్లో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తుకు అర్హులు అవుతారు. ఫిజిక్స్ విభాగం పోస్టులకు బీఎస్సీ లేదా ఎంఎస్సీ పూర్తి చేసిన వారు అప్లై చేయవచ్చు. విద్యార్హతతో పాటు పోస్టును బట్టి నిర్ణీత కాలం ఉద్యోగానుభవం కలిగి ఉండాలి.

వయస్సు:

వయసు విషయానికి వస్తే జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 26 ఏళ్లు లోపు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 29 ఏళ్లు వరకు సడలింపు ఇచ్చారు. ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థులు 31 ఏళ్ల వయసు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.

ఉద్యోగ ఎంపిక ప్ర్రక్రియ:

అభ్యర్థులను రెండు దశల్లో ఎంపిక చేస్తారు. మొదటి దశలో ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి రెండో దశలో ఇంటర్వ్యూ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

దరఖాస్తు రుసుముగా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ పురుష అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.

నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. మార్చి 4వ తేదీ లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలి.

అఫీషియల్ వెబ్ సైట్: https://npcilcareers.co.in/

ALSO READ: Women Empowerment: ఆ జిల్లాలో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. రూ.34వేల వరకు జీతం పొందే ఛాన్స్, డోంట్ మిస్

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×