Upcoming Movies OTT : ఈరోజు ఒక్కరోజే ఓటీటీలోకి ఏకంగా 6 కొత్త సినిమాలు, సిరీస్ లు అడుగు పెట్టాయి. అయితే అందులో ఒకే ఒక్కటి మాత్రమే తెలుగులో అందుబాటులో ఉండడం గమనార్హం. మిగతావి అన్ని ఇతర భాషల్లో అందుబాటులో ఉన్నాయి. మరి ఈరోజు నుంచి తాజాగా స్ట్రీమింగ్ అవుతున్న ఆ కొత్త సినిమాలు – సిరీస్ లు ఏంటో, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం పదండి.
The Chestnut Man: Season 2 (Hide and Seek)
తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ఈ డానిష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో ఇది రెండవ సీజన్. మొదటి సీజన్‌లో ‘చెస్టనట్’ బొమ్మలను వదిలి వెళ్తాడు హంతకుడు. గతంలో అతన్ని పట్టుకున్న డిటెక్టివ్‌లు, ఇప్పుడు రెండో సీజన్‌లో సరికొత్త మిస్టరీతో ఆడియన్స్ ను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ‘హైడ్ అండ్ సీక్’ థీమ్‌తో సాగే ఈ సీజన్‌లో స్టోరీ అంతా పిల్లల మిస్సింగ్స్ కేసు చుట్టూ తిరుగుతుంది. ఈసారి హంతకుడు బాధితులతో బ్రూటల్ గేమ్స్ ఆడతాడు. హింట్ ఇస్తూ పోలీసులను తనను పట్టుకోమని ఛాలెంజ్ చేస్తాడు. ఈ సిరీస్ ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.
Legends
1990ల నాటి బ్రిటన్ నేపథ్యంలో సాగే ట్రూ-క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ Legends (2026). మే 7న నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన ఆరు భాగాల సిరీస్. ఇదొక సీక్రెట్ అండర్ కవర్ ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కింది. 1990ల ప్రారంభంలో కథ నడుస్తుంది. బ్రిటన్ సరిహద్దుల ద్వారా డ్రగ్స్ భారీగా సరఫరా అవుతుంటాయి. దీనిని అరికట్టడానికి ‘హెర్ మెజెస్టీస్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్’ ఒక కొత్త ప్లాన్ ను వేస్తుంది. శిక్షణ పొందిన గూఢచారులను కాకుండా, సాధారణ కస్టమ్స్ ఉద్యోగులను సెలెక్ట్ చేసి, వాళ్ళను అండర్ కవర్ ఏజెంట్లుగా ఏర్పాటు చేస్తారు. గ్యాంగ్‌స్టర్ల మధ్య బతకడానికి క్రియేట్ చేసుకున్న కృత్రిమ గుర్తింపులనే ‘లెజెండ్స్’ (Legends) అని పిలుస్తారు. మరి ఈ రహస్య విభాగం ఎలాంటి పనులు చేసింది అన్నది చూడాల్సిందే.
Countdown: Rousey vs Carano
ఇదొక పెద్ద ఫైట్ లేదా ఈవెంట్‌కు ముందు ఇచ్చే బిల్డప్ ప్రోగ్రామ్. రోండా రౌసీ, గినా కరానో వంటి మహిళా MMA ఫైటర్ల మధ్య జరగబోయే పోరు, శిక్షణ, వ్యక్తిగత జీవితాల గురించి ఉంటుంది. Netflixలో దీన్ని చూడవచ్చు.
Also Read : మనిషి మాంసంతో బిజినెస్… వంద నిమిషాల పాటు వెన్నులో వణుకు పుట్టించే సినిమా
Vertical Limit
క్లాసిక్ సర్వైవల్ థ్రిల్లర్ ‘వర్టికల్ లిమిట్’. కె2 పర్వతంపై ఒక గుహలో చిక్కుకుపోయిన తన సోదరిని కాపాడటానికి ఒక యోధుడు ఎలాంటి అడ్వెంచర్ చేశాడు అన్నదే కథ. గడ్డకట్టే చలిలో ప్రాణాలకు తెగించి అతను చేసే పోరాటం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
My Dearest Assassin
థాయ్ యాక్షన్ డ్రామా ‘మై డియరెస్ట్ అస్సాసిన్’. ప్రొఫెషనల్ అస్సాసిన్ (హంతకురాలు) తన గతాన్ని మర్చిపోయి ప్రశాంతంగా మిగతా జీవితాన్ని గడపాలని అనుకుంటుంది. కానీ పాత శత్రువులు ఆమెను వెంటాడగా, ఏం జరిగిందన్నది కథ. ‘వర్టికల్ లిమిట్’తో పాటు ఈ థాయ్ మూవీ కూడా Netflixలో ఉంది.
Send Help
డార్క్ కామెడీ సిరీస్ గా తెరకెక్కిందని ‘సెండ్ హెల్ప్’. హాలీవుడ్‌లో నటుడిగా ఎదగాలని ప్రయత్నిస్తున్న ఒక హైతీ-అమెరికన్ కుర్రాడి జీవితంలో ఎదురయ్యే విషాదాలు, ప్రొఫెషనల్ ఛాలెంజస్ ను ఇందులో చూడవచ్చు. Huluలో అందుబాటులో ఉంది ఈ సిరీస్.