E-Paper
Advertisement

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !
Advertisement

Salman Health: సల్లూ భాయ్ ఒక్కసారిగా చిక్కిపోయినట్టుగా కనిపించాడు.అంతే కంగారు పడిపోయిన ఫ్యాన్స్ అసలేమైంది అంటూ ఆరాలు తీయడం మొదలెట్టారు.అలా ఒకరు ఇద్దరు అయితే పర్లేదు.కానీ అభిమానులంతా మూకుమ్మడిగా అసలేమైంది,ఆరోగ్యం ఎలా ఉంది ,అంతా ఓకేనా అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు,ఇంకేం …చిర్రెత్తుకొచ్చిన సల్లూ భాయ్ కౌంటర్ ఇచ్చాడు.ఇంతకీ అసలేమైందో చూద్దాం.

ఫోటోలు వీడియోలు బయటికి వచ్చాయో లేదో

Advertisement

ముంబైలోని ‘ఎస్ఆర్ఏ’ (SRA) ఆఫీస్‌లో డేటా సెంటర్‌ను ప్రారంభించదానికి వచ్చాడు సల్లూ భాయ్.అక్కడున్న కొందరు లభి దారులకి తాళాలు ఇవ్వడానికి.అంతా బాగానే ఉంది.కాని ఎప్పుడూ ఫిట్ గా కనిపించే సల్లూ ఈసారి డీలా పడిపోయినట్టు కనిపించాడు.ఆరోగ్యం అసలు బాగోలేనట్టు అతని వాలకం చూస్తే అనిపిస్తుంది కూడా.ఇక అక్కడి ఫోటోలు వీడియోలు బయటికి వచ్చాయో లేదో,డిటెక్టివ్ లా ఇన్వెస్టిగేషన్ మొదలెట్టారు.ఫేస్ లో గ్లో పోయిందని, చూస్తుంటే అలసిపోయాడని,ఏదైనా వ్యాధి భారిన పడ్డాడేమో అని ఇబ్బడి ముబ్బడిగా డౌట్స్ ని రైజ్ చేస్తూ సల్మాన్ ని ట్యాగ్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు.ఇక సోషల్ మీడియాలో అయితే ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్.

”ఆప్ లోగోం కీ తబియత్ కైసీ హై?”

Advertisement

దీంతో చిర్రెత్తుకుపోయిన సల్మాన్ తన ఇన్స్టాగ్రామ్‌లో లేటెస్ట్ ఫోటోని వదులుతూ ఆప్ లోగోం కీ తబియత్ కైసీ హై?” (అయినా నా ఆరోగ్యం పక్కన పెడితే.. ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉందయ్యా?)అంటూ ప్రశ్నలు అడిగిన వారికి కౌంటర్ వేశాడు.నా ఆరోగ్యం సంగతి సరే ముందు మీ ఆరోగ్యాలు చూసుకోండి అన్న రేంజ్ లో సెటైర్ వేయడంతో ఒక్కసారిగా సల్లూ ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయినంత పని అయింది.ఇక సల్మాన్ ఇలా కౌంటర్ వేశాడో లేదో ఎమోజీల వర్షం కురిపిస్తున్నారంతా ..వీరిలో ఫ్యాన్స్ తో పాటు బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా ఉండటం విశేషం.

also read:రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

మొత్తానికి కౌంటర్ గా ఇచ్చిన పోస్ట్ తో సల్మాన్ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదన్న క్లారిటీ వచ్చేసింది.ఇక సల్మాన్ సినిమాల విషయానికి వస్తే అపూర్వ లకియా దర్శకత్వంలో వస్తున్న మాతృభూమి అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు సల్మాన్.ఇక భారత్,చైనా మధ్య 2020లో జరిగిన ఘర్షణల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నిజానికి ఈ ఏప్రిల్ లోనే రావాల్సి ఉంది.కానీ సెన్సార్ సమస్యలతో ఆగిపోయింది.ఇక దీనితో పాటు దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడి పల్లి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే !

 

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×