E-Paper
Advertisement

బాక్సాఫీస్ దగ్గర ‘పెద్ది’కి థియేటర్ల షాక్? ఎగ్జిబిటర్ల అల్టిమేటం.. టాలీవుడ్ కి పెద్ద గండమే!

బాక్సాఫీస్ దగ్గర ‘పెద్ది’కి థియేటర్ల షాక్? ఎగ్జిబిటర్ల అల్టిమేటం.. టాలీవుడ్ కి పెద్ద గండమే!
Advertisement

Peddi Issue : ఇప్పటికే సమ్మర్ సీజన్ సాలిడ్ సక్సెస్ లేక డీలా పడిపోయింది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఒక్కటీ సాలిడ్ సౌండ్ చేయలేదు మరి. దీంతో అందరి ఆశలు మెగా ప్రాజెక్ట్ ‘పెద్ది’ పైనే. జూన్ 4న ఈ సినిమా వస్తే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుందని, థియేటర్లు షేక్ అవుతాయని భారీ ఆశలే పెట్టుకున్నారంతా. కానీ కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా రెంటల్ VS పర్సెంటేజ్ ఇష్యూలో చిక్కుకోబోతుందని ఫిలిమ్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తుంది.

ఏంటి ఆ గొడవ? నిర్మాతలా.. ఎగ్జిబిటర్లా?

Advertisement

విషయంలోకి వెళ్తే గత కొన్నాళ్లుగా “మాకు రెవిన్యూలో పక్కాగా షేరింగ్ కావాలి.. పాత రెంటల్ పద్ధతులు అస్సలు వర్కౌట్ కావు” అంటూ ఎగ్జిబిటర్లు మొండికేస్తుంటే “అంత పర్సంటేజీ ఇస్తే మాకు మిగిలేది ఏముంటుంది?” అంటూ నిర్మాతలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్‌గా ఈ పంచాయితీ మరింత ముదిరిపోయింది. దీనికి ఎగ్జాంపుల్ శుక్రవారం రిలీజ్ అయిన ‘జెట్లీ’ సినిమానే. మా డిమాండ్ నెరవేరిస్తే కాని ఈ సినిమాను ప్రదర్శించం అంటూ కొన్ని థియేటర్లలో ఏకంగా బహిష్కరించారు ఎగ్జిబిటర్లు. దీనిపై మైత్రీ మూవీస్ ఏకంగా ఓపెన్ లెటర్ రాసింది కూడా.

టార్గెట్ ‘పెద్ది’.. ఎగ్జిబిటర్ల మైండ్ గేమ్

Advertisement

ALSO READ :గాయపడ్డ సింహం గర్జించలేదు.. జెట్లీ స్పీడ్ అందుకోలేదు.. మే తొలివారం డిజాస్టర్?

నిజానికి ఎగ్జిబిటర్ల అసలు టార్గెట్ ‘జెట్లీ’ లాంటి చిన్నా చితకా సినిమాలు కాదు. వారి కళ్లన్నీ ‘పెద్ది’ లాంటి బడా సినిమాల మీదే. ఎందుకంటే చిన్న సినిమాకు రెవిన్యూ షేరింగ్ ఇచ్చినా ఎగ్జిబిటర్లకు పెద్దగా వచ్చేది ఏమీ ఉండదు. కానీ ‘పెద్ది’ లాంటి క్రేజీ మూవీకి షేరింగ్ పద్ధతి గనుక ఓకే అయితే.. కోట్లు కొల్లగొట్టవచ్చని వారి ప్లాన్.

అందుకే జూన్ 4న సినిమా విడుదల కాకముందే, ఇప్పుడే “పొగ” పెట్టడం మొదలుపెట్టారు. ఒకవేళ తమ డిమాండ్లు నెరవేరకపోతే.. ‘పెద్ది’ రిలీజ్ సమయంలో థియేటర్లు మూసివేస్తామని ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇవ్వడం మొదలెట్టారు. అసలే జూన్ 3 నుంచే ప్రీమియర్లు పడాలి. చూస్తుంటే అప్పటికల్లా ఈ ఇష్యూ మరింత ముదిరేలా కనిపిస్తుంది.

40 శాతం ఇస్తే నిర్మాత పరిస్థితి ఏంటి?

గ్రౌండ్ రియాలిటీ ప్రకారం ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నట్టుగా వచ్చిన కలెక్షన్స్‌లో 40 శాతం ఇచ్చేస్తే.. భారీ బడ్జెట్‌తో సినిమా తీసిన నిర్మాతలకు మిగిలేది ఏమీ ఉండదు. పోస్టర్ ఖర్చులు, పబ్లిసిటీ, వడ్డీలు అన్నీ పోను ప్రొడ్యూసర్ చేతికి చిల్లిగవ్వ కూడా మిగలదు.మరి ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య ఈ పర్సెంటేజీ పంచాయితీ ఎప్పుడు కొలిక్కి వస్తుందో అని క్యూరియస్ గా వాచ్ చేస్తున్నారంతా.

వచ్చే వారం కీలక భేటీ

అయితే వచ్చే వారం టాలీవుడ్‌లోని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లు కలిసి ఒక హై-లెవల్ మీటింగ్ నిర్వహించబోతున్నారని సమాచారం. ఇక్కడ మాత్రం ఇద్దరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ‘పెద్ది’ పెద్ద చిక్కుల్లో పడ్డట్టే.

చూడాలి మరి ఎవరు ఎలా తగ్గుతారో… ఎవరు నెగ్గుతారో

ALSO READ :రెబలోడి ఫ్యాన్స్ కి పెద్ద షాక్ .. సీక్వెల్ లో ‘కల్కి’ ఉండడా?

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×