E-Paper
Advertisement

తహసిల్ధార్లకే షాక్.. అయిజలో‌ నకిలీ ధ్రువపత్రాల గుట్టు రట్టు..!

తహసిల్ధార్లకే షాక్.. అయిజలో‌ నకిలీ ధ్రువపత్రాల గుట్టు రట్టు..!
Advertisement

Fake Certificates: స్వేచ్ఛ బ్యూరో: నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును అయిజ రెవెన్యు శాఖ అధికారులు రట్టు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అదార్ కార్డులో మార్పులు, చేర్పుల కొరకు అయిజ మున్సిపాలిటిలోని లక్ష్మీ నర్సింహ్మ‌‌ ప్రింటింగ్ ప్రెస్‌లో‌ నకిలీ దృవపత్రాలను తయారు చేస్తున్నట్లు అయిజ తహసీల్దార్ జ్యోతికి ఫిర్యాదు అందింది. ఈ మేరకు శనివారం ఆర్.ఐ. రజినీకాంత్ రెడ్డి, జీపీవోలు జ్యోతి, రహమతుల్లా, బాలు తదితరులు అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో లక్ష్మీ నరసింహ ప్రింటింగ్ ప్రెస్ పై ఆకస్మిక దాడి చేసి, అక్రమ దందా గుట్టురట్టు చేశారు. ఈ సందర్భంగా ప్రింటింగ్ ప్రెస్‌లో పెద్ద ఎత్తున నకిలీ ముద్రలను (స్టాంపులను) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న వివరాలు..

వివిధ శాఖలకు సంబంధించిన గవర్నమెంట్ డాక్టర్లు, సర్పంచులు, హెడ్మాస్టర్లు, వివాహ ధ్రువపత్రాలు, ఆధార్ కార్డులు, ఎస్ఎస్సీ మెమోలతో సహా సుమారు 18 నకిలీ ముద్రలు లభ్యమయ్యాయి. వీటిలో రాయలసీమ వివిధ జిల్లాలకు మరియు గట్టు మండలానికి సంబంధించిన ముద్రలు ఉన్నాయి. కంప్యూటర్‌ను పరిశీలించగా, సుమారు 150కి పైగా నకిలీ పత్రాలు తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం, స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ మరియు ఇతర సామగ్రిని తదుపరి దర్యాప్తు నిమిత్తం పోలీసు శాఖకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూ శాఖ అధిజారుల మేరకు అయిజ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Also read: రాంచందర్ రావు బుద్ధి ఉందా.. ఎమ్మెల్యే కుంభం ఫైర్!

తహసిల్దార్ జ్యోతి మాట్లాడుతూ..

ఈ సందర్భంగా తహసిల్దార్ జ్యోతి మాట్లాడుతూ.. ముందస్తుగా వచ్చిన నమ్మదగిన సమాచారం మరియు ఫిర్యాదుల మేరకు అయిజ లోని ప్రింటింగ్ ప్రెస్ పై ఈ దాడులు నిర్వహించామని తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటామని ఆమె హెచ్చరించారు.

Advertisement

Also read: మమ్మల్ని చావనివ్వండి కలెక్టర్ గారు.. పురుగుల మందు డబ్బాతో వృద్ధ దంపతుల ఆవేదన..!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×