E-Paper
Advertisement

Leader Glimpse: శరవరణ్ ‘లీడర్’ సినిమా తెలుగు టైటిలే తప్పురాస్తే ఎలా?.. నెటిజన్లు ఫైర్

Leader Glimpse: శరవరణ్ ‘లీడర్’ సినిమా తెలుగు టైటిలే తప్పురాస్తే ఎలా?.. నెటిజన్లు ఫైర్
Advertisement

Leader Glimpse: ‘ది లెజెండ్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన లెజెండ్ శరవణన్, ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘లీడర్’ (Leader) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ‘టైటిల్ గ్లింప్స్’ సోషల్ మీడియాలో భారీ స్పందనను పొందుతోంది. అయితే అదే సందర్భంలో శరవరణ్ సినిమా లీడర్ గ్లింప్స్ చివరిలో లీడర్ కు బదులు ‘లీదర్’ అని పడింది. దీనిని చూసిన నెటిజన్లు డబ్బింగ్ ఒకటి చేస్తే సరిపోతుందా? కనీసం పదాలు ఎలా వస్తున్నాయి అని కూడా పట్టించుకోరా అంటూ మూవీ టీం పై తెలుగు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే డబ్బింగ్ సైలెంట్ సినిమా అయిన గాధీ టాక్స్ లో కూడా కనీసం శ్రద్ధ చూపలేదు నిర్మాతలు. అందులో కూడా తెలుగుకు అరవ దర్శకులు తెగులు పట్టించారు. అందులో ఆ సినిమా తెలుగు నేటివిటీలో రూపొందించాము అని చెప్పడానికి నిర్మాతలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. సినిమాకు పనిచేసిన టెక్నీషిన్స్ పేర్లు కూడా తప్పుగా రాశారు.. తాజాగా ఈ సినిమాలో కూడా పేర్లు అంటే సరే అనుకుంటే ఏకంగా టైటిల్ లోనే తప్పు రాశారు. దీంతో తెలుగు ప్రజలు సినిమా నిర్మాత, దర్శకుడిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేరే భాషల్లో వచ్చిన సినిమాలకు ఇలా చేస్తే వారు ఊరుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.

Read also-Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. అవనిని పై మరో నింద.. అక్షయ్ కు అవని నిజం చెప్తుందా..?

విడుదలైన్ టైటిల్ గ్లింప్స్ చూస్తే..

Advertisement

గ్లింప్స్ ప్రారంభంలో రాత్రి పూట కురుస్తున్న భారీ వర్షంలో తొమ్మిది కంటైనర్ లారీలు మాయమవ్వడం ఉత్కంఠను కలిగిస్తుంది. మాయమైన లారీలను వెతుక్కుంటూ వెళ్లిన వ్యక్తిపై గ్యాంగ్‌స్టర్లు దాడి చేసే క్రమంలో కథానాయకుడి ఎంట్రీ జరుగుతుంది. రక్తసిక్తమైన ముఖంతో, గంభీరమైన చూపులతో శరవణన్ శత్రువులను చీల్చిచెండాడటం చూస్తుంటే, సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉండబోతున్నాయని అర్థమవుతోంది. గ్లింప్స్ చివరలో యాక్షన్ కి భిన్నంగా, తన కూతురితో కలిసి ఐస్‌క్రీమ్ తింటూ కనిపించే సన్నివేశం సినిమాలో బలమైన ఎమోషన్ కూడా ఉందని సూచిస్తోంది. ఈ చిత్రానికి ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, జిబ్రాన్ వైభోద అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను ‘ది లెజెండ్ న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్’ పతాకంపై స్వయంగా శరవణన్ నిర్మిస్తున్నారు.

Read also-Tarun Career: లవర్ బాయ్ తరుణ్ ఫేడ్ అవుట్ అవ్వడానికిక కారణం ఇదే.. విజయ్ భాస్కర్

Advertisement

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×